సబ్ ఫీచర్

పరస్పర సహకారమే మెరుగు( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో వరకట్నం ఇవ్వడం ఒక ఆచారం. కన్యాదాత తన కూతురితోపాటు, తన శక్తిమేరకు-కారు, ఇల్లు, స్కూటరు, సైకిలు, డబ్బు- ఇలా ఏదోఒకటి కట్నంగా ఇవ్వక తప్పదు. అలా ఆ బిచ్చగాడు తన అల్లుడు అడుక్కునేందుకు తన వీధిని కట్నంగా ఇచ్చాడు. ఒకరోజు వాడు నాకు బజారులో ఎదురయ్యాడు. వెంటనే నేను అతనితో ‘‘కట్నంగా నువ్వు నీ అల్లుడికి ఆ వీధిఇచ్చి చాలా మంచి పనిచేశావు’’అన్నాను. ‘‘అవునండీ, నాకున్నది ఒకే ఒక కూతురు. ఆమె సుఖంకోసం ఆ వీధిని నా అల్లుడికి ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ బజారులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది కాస్త కష్టమైనపనే అనుకోండి. ఎందుకంటే, ఇక్కడ చాలా ఏళ్ళుగా స్థిరపడ్డ బిచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను’’అన్నాడు. అతడు ఆ పని సాధిస్తాడని నాకు అనిపించింది.
అలాగే, ఒక గ్రామం శివారులో ఉన్న గుడిసెలో ఇద్దరు బిచ్చగాళ్ళు నివసిస్తున్నారు. వారిలో ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు. ఇద్దరి మధ్య వృత్తిపరమైన శతృత్వముంది. కానీ, ఒక రోజు రాత్రి ఆ గుడిసెకు నిప్పంటుకుంది. వెంటనే వారిమధ్య శతృత్వంపోయింది. ఎలాగైనా ఆ ప్రమాదంనుంచి తప్పించుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. వెంటనే కుంటివాడిని మోసేందుకు గుడ్డివాడు, గుడ్డివాడికి తప్పించుకునే దారి చెప్పేందుకు కుంటివాడు సిద్ధపడ్డారు. అలా వారు తమ శతృత్వాన్ని మరచిపోయి ఆ ప్రమాదంనుంచి బయటపడ్డారు. తెలివికి, హృదయానికి సంబంధించిన కథ ఇది. ఇక్కడ ప్రమాదంనుంచి తప్పించుకోవడం ముఖ్యంకానీ, ఇతర విషయాలతో పని లేదు.
ప్రతి క్షణం మీరు అనేక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఒంటరిగా ఉండే మీ తెలివికి ఏదీ కనిపించదు. ఎందుకంటే, అది గుడ్డిది. వేగంగా పరిగెట్టేందుకు దానికి కాళ్ళుంటాయి. కానీ, అది గుడ్డిది కాబట్టి, ఎటువెళ్ళాలో, ఎలా వెళ్ళాలో దానికి తెలియదు. అందువల్ల అది ఎప్పుడూ కింద పడుతూనే ఉంటుంది. ఆ కారణంగా జీవితానికి అర్థంలేదనే భావన మీలో కలుగుతుంది.
అందుకే ప్రపంచంలోని తెలివైన వాళ్ళందరూ ‘‘జీవితానికి అర్థం లేదు’’అనే అంటారు. ఎందుకంటే, గుడ్డి తెలివి ఎప్పుడూ కాంతిని చూడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది అసంభవం. కానీ, చూడగల, అనుభూతి చెందగల హృదయం మీలో ఉంది. అయితే దానికి కాళ్ళులేవు కాబట్టి, అది పరిగెట్టలేదు. అందువల్ల హృదయం అలా స్పందిస్తూ ఏదో ఒకరోజు తెలివి తన కళ్ళను తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావిస్తూ, అక్కడే నిరీక్షిస్తూ ఉంటుంది.
నేను ‘‘నమ్మకం’’అనే పదాన్ని చెప్తున్నానంటే హృదయానికి కళ్ళున్నాయని, ‘‘సందేహం’’అనే పదాన్ని వాడుతున్నానంటే తెలివికి కాళ్ళున్నాయని అర్థం. అవి రెండు కలిస్తేనే ఎలాంటి సమస్య లేకుండా అగ్నిప్రమాదంనుంచి బయటపడగలవు. కానీ, కాళ్ళులేని హృదయాన్ని తన భుజాలపై మోసేందుకు, అలాగే కళ్ళున్న హృదయం చెప్పే దారిని అనుసరించేందుకు తెలివి అంగీకరించాలి. హృదయం చేతుల్లో ఉన్న తెలివి బుద్ధిగామారి అద్భుతమైన సంపూర్ణ శక్తిగా రూపాంతరం చెందుతుంది. అలాంటి వ్యక్తి కేవలం తెలివైనవాడుగా మాత్రమేకాదు, మహాజ్ఞానిగా రూపాంతరం చెందుతాడు. తెలివి, హృదయాల సంగమం ద్వారా మాత్రమే జ్ఞానం వికసిస్తుంది. ఈ రహస్యాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకుంటే మార్మిక రహస్యాలన్నీ మీకు తెలిసినట్లే.
అమాయకత్వ మార్గం:
అసలు ప్రశ్న ధైర్యానికి సంబంధించినది కాదు. ఏదైనా ఒక విషయం తెలిసిన వెంటనే అది దాని జీవాన్ని కోల్పోతుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.