సబ్ ఫీచర్

ప్రపంచమొక మజిలీ మాత్రమే (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
ఎందుకంటే, అవి మీకు ఎలాంటి స్పష్టతను ఇవ్వవు. బాహ్యప్రపంచంలో విజయాన్ని సాధించేందుకు అవి మీకు సహాయపడవచ్చు. కానీ, వాటివల్ల మీరు మీ అంతర్గత ప్రపంచంలో కచ్చితంగా ఓడిపోతారు. చివరకు మీకు దక్కేది అదే. ఆ ఓటమిముందు బాహ్యప్రపంచంలో మీరు సాధించిన విజయాలన్నీ ఎందుకూ పనికిరానివే అవుతాయి. ఎందుకంటే, మీ కీర్తి, ప్రతిష్ఠ, అధికారాలు ఏమాత్రం శాశ్వతం కావు. అవి ఎప్పటికైనా పూర్తిగా అంతమయ్యేవే. కానీ, మీరు మరణించేవరకు మీతోపాటు ఉండేది కేవలం మీరు పుట్టేటప్పుడు మీతో తెచ్చుకున్న మీ అంతర్గతం మాత్రమే. కాబట్టి, దానిని మాత్రమే మీరు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మీతోపాటు తీసుకెళ్ళగలరు.
రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి గది ఉంటుంది. మీరు ఎక్కవలసిన రైలు వచ్చేవరకు- మహాఅయితే, కొన్ని నిముషాలు లేదా కొన్ని గంటలు- అవసరమైతే అక్కడ ఉన్న సౌకర్యాలను మీరు వాడుకుంటారే కానీ, మీరు అక్కడే శాశ్వతంగా ఉండిపోరు. ఎందుకంటే, అది మీ సొంత ఇల్లు కాదు.
మీరు ఎక్కవలసిన రైలు రాగానే మీరు మీ సామానులు తీసుకుని వెళ్ళిపోతారు. సరిగ్గా అలాంటిదే ఈ ప్రపంచం. విశ్రాంతి గదిలో మీరు కొన్ని నిముషాలు లేదా కొన్ని గంటలు ఉన్నట్లుగానే మీరు ఈ ప్రపంచమనే విశ్రాంతి గదిలో దాదాపు డబ్భై లేదా ఎనభై సంవత్సరాలు ఉంటారే తప్ప శాశ్వతంగా ఉండరు. కానీ, అనేక సంవత్సరాలు మీరు ఈ ప్రపంచంలో ఉన్నందువల్ల దానినే మీరు మీ సొంత ఇల్లుగా భావిస్తారు. అందుకే ఆ ఇంటి గోడపై మీ పేరు చెక్కిస్తారు. రైల్వేస్టేషన్‌లోని విశ్రాంతి గదిలో ఉండే బల్లలపైన, స్నానాల గది గోడలపైన అనేక మంది పేర్లు ఉండడం నేను చూశాను. అలా రాయడం మూర్ఖంగా కనిపించినప్పటికీ, చాలామంది అక్కడ అలాగే రాస్తుంటారు.
జైనుల పవిత్ర గ్రంథాలలో ఉన్న ఒక చక్కని కథ చెప్తాను:
ప్రాచీన కాలంలో యుద్ధాల పేరుతో రక్తపాతం జరగకుండా ఉండేందుకు ఎవరితోనైనా యుద్ధంచేసి గెలిచే సామర్థ్యమున్న రాజు తన దేశం జెండాను తగిలించిన రెండు గుర్రాలున్న రథాన్ని ప్రపంచమంతా పర్యటించే ఏర్పాటుచేసేవాడు. ఎవరూ అడ్డుకోకుండా ఆ రథం తిరిగిన భూభాగమంతా ఆ రాజు అధీనంలోకి వచ్చేది. ఎవరైనా ఆ రథాన్ని అడ్డుకుంటే వారితో మాత్రమే యుద్ధం జరిగేది. ఇది చాలా నాగరికమైన ఏర్పాటు. ఇప్పుడు అమెరికా, రష్యాల వంటి దేశాలు చాలా అనాగరికంగా యుద్ధాలు చేస్తున్నాయి. అలా ఆ రాజు తన శక్తిని ప్రపంచానికి చాటేవాడు. అతని శక్తిని అంగీకరించిన చిన్నచిన్న రాజ్యాలన్నీ అతని రథంపై పువ్వులు చల్లుతూ అతని అధికారాన్ని అంగీకరించేవి. అలా ప్రపంచాన్ని జయించిన వ్యక్తిని భారతదేశంలో ‘చక్రవర్తి’అంటారు. చాలా చిన్న వయసులో చనిపోయిన మహావీరుడైన అలెగ్జాండర్ కూడా చక్రవర్తి కాలేకపోయాడు. చాలామంది రాజులకు చక్రవర్తి అవాలనే కోరిక ఉన్నప్పటికీ అనేక వేల సంవత్సరాలలో ఎప్పుడో, ఏ ఒక్కడో చక్రవర్తి అయ్యేవాడు.
అలా ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి చచ్చి స్వర్గానికి వెళ్ళాడు. అతని వియోగాన్ని భరించలేని అతని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మహత్య చేసుకుని అతనితోపాటు స్వర్గానికి వెళ్ళారు. అక్కడ వారికి చక్కని స్వాగతం లభించింది. దేవకన్యలు వారిని సుమేరు పర్వతం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళారు. జైన పురాణాలలోని స్వర్గంలో హిమాలయ పర్వతమంత బంగారు పర్వతం ఉంది. దానినే ‘‘సుమేరు పర్వతం’’ అంటారు.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.