సబ్ ఫీచర్

నమోదు చేసిన చిట్టాపద్దు( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకం ఎప్పటికీ సత్యం కాదు. అందువల్ల అది ఎప్పుడూ సజీవంగా ఉండదు. ఎప్పుడూ సజీవంగా ఉండేదే సత్యం. ఎందుకంటే, సత్యమే జీవం. జ్ఞాపకానికి ఉనికి లేదు. అందుకే అది ఎప్పుడూ దయ్యాల ప్రపంచంలో జీవిస్తుంది. మనం కూడా అందులోనే ఉన్నాం. అందుకే జ్ఞాపకం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటుం ది. అదే మన చెరసాల. నిజానికి, మనకున్నది అదే.
జ్ఞాపకం ‘‘నేను’’అనబడే అహంతో మనల్ని గట్టిగా బంధిస్తుంది. ఈ ‘‘నేను’’అనబడే అహానిది ఎప్పుడూ అవాస్తవ అస్తిత్వమే. కాబట్టి, సహజంగానే అది ఎప్పుడూ మృత్యుభయంతో ఉంటుంది. అందుకే మీరు కొత్తదానికి భయపడతారు.
నిజానికి, ఈ ‘‘నేను’’అనేది మీరు కాదు. అది కేవలం భయం మాత్రమే. ఉనికికి ఎలాంటి భయం ఉండదు. కానీ, అహానికి ఎప్పుడూ మరణభయమే. ఎందుకంటే, ఎప్పుడూ ఏకపక్షంగా ఉండే అది చాలా కృత్రిమమైనది. కాబట్టి, అది ఏ క్షణంలోనైనా విడిగా రాలిపోతుంది. అందుకే కొత్తది ఎప్పుడు ప్రవేశించినా అహం భయపడుతుంది. ఎందుకంటే, ఏ క్షణంలోనైనా అది విడిగా రాలిపోయే అవకాశముంది. అయితే, అలా జరగకుండా అది ఏదో విధంగా నెట్టుకొస్తూ ఉంటుంది. కానీ, ముక్కలుగా పగిలిపోయే కొత్తది ఏదో ఇప్పుడు వస్తుంది. అందుకే మీరు దానిని ఆనందంతో అంగీకరించరు. ఎందుకంటే, అహం తన మృత్యువును ఆనందంతో ఎలా అంగీకరించగలదు? అలా ఎప్పటికీ జరగదు. కాబట్టి, మీరు అహంకాదని తెలుసుకోనంతవరకు కొత్తను స్వీకరించలేరు. అహం కేవలం మీ గతానికి చెందిన జ్ఞాపకమని మీకు తెలిసిన వెంటనే, ఆ జ్ఞాపకం ‘‘బయో కంప్యూటర్’’లా ఉపయోగపడే యంత్రమే తప్ప మీరుకాదని, మీరు దానికి మించిన చైతన్యమని, జ్ఞాపకం మీ చైతన్యంలో ఉన్న విషయం మాత్రమే అని మీకు తెలుస్తుంది.
ఎందుకంటే, మీరే ఒక చైతన్యం. ఉదాహరణకు, మీకు తెలిసిన వ్యక్తి రోడ్డుపై ఎదురైనప్పుడు వెంటనే మీరు అతని ముఖాన్ని గుర్తిస్తారే కానీ, పేరును గుర్తించలేరు. కానీ, మీకు జ్ఞాపకశక్తి ఉంటే అతని పేరునుకూడా మీరు గుర్తిస్తారు. ఒకవేళ మీకు జ్ఞాపకశక్తిలేకపోతే ‘‘నాకు మీరెవరో తెలుసు. కానీ, మీ పేరు గుర్తుకు రావట్లేదు’’ అంటూనే మీరు మీ జ్ఞాపకాల పొరల్లోకి వెళ్ళి అతని పేరును గుర్తించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అతని పేరు మీకు గుర్తుకొస్తుంది. కాబట్టి, జ్ఞాపకమనేది నమోదుచేసిన చిట్టాపద్దు లాంటిది. మీరు అందులో వెతుకుతారే కానీ, అదే మీరుకాదు. అలా చాలాసార్లు జరుగుతుంది. కానీ, ఒక విషయాన్ని గుర్తించేందుకు మీరు అతిగా ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నమే మిమ్మల్ని అడ్డుకుంటుంది. అందువల్ల అతని పేరు మీ నాలుకపై ఆడుతున్నా చెప్పలేరు. అతని పేరు మీకు తెలుసుని మీకు తెలుసు. అయినా అతని పేరు మీరు చెప్పలేరు. ఇది వింతగానే ఉంటుంది.
ఎందుకంటే, అతని పేరు మీ జ్ఞాపకంలో ఉన్నప్పటికీ అది బయటకు రాకుండా అడ్డుకుంటున్నదెవరు? అలాగే ‘‘నాకు తెలుసు. అయినా చెప్పలేకపోతున్నాను’’అని అంటున్నదెవరు? మీరు ఎంత కష్టపడి ప్రయత్నించినా అది గుర్తుకు రాకుండా మిమ్మల్ని మరింత ఇబ్బందిపెడుతుంది. దానితో మీరు విసుగుచెంది, ఆ ప్రయత్నాన్ని ఆపి బయటకువెళ్ళి నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అది గుర్తొస్తుంది.
కాబట్టి, మీలో ఉన్న జ్ఞాపకం మీరుకాదు. అది మీ చైతన్యంలో ఉన్న విషయం మాత్రమే. అది పాతదే కావచ్చు. కొత్తదానికి అది భయపడవచ్చు. అయినా అదే మీ అహానికి సంపూర్ణ జీవశక్తి.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.

- ఇంకాఉంది