సబ్ ఫీచర్

ప్రేమ.. ప్రార్థన( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే అది సరిగా గుర్తుండట్లేదు. మళ్ళీ చెప్పండి’’ అన్నారు. ఆర్చిబిషప్ మళ్ళీ ప్రార్థన చెప్పాడు. అయినా ఆ ముగ్గురూ ‘‘ప్రార్థన చాలా పెద్దది కదా! దయచేసి మరొకసారి చెప్పండి. ఈసారి దానిని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తాం’’ అన్నారు. వెంటనే ఆర్చిబిషప్ వారికి మరొకసారి ప్రార్థన నేర్పి, వారు చేసిన పాద నమస్కారాలు స్వీకరించి, లక్షలాది ప్రజలు పూజిస్తున్న ముగ్గురు మూర్ఖుల్ను క్రైస్తవ మతంలోకి లాగినందుకు తెగ సంబరపడుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. అతని పడవ చెరువు మధ్యకు చేరుకుంటుండగా ఆ ముగ్గురు మూర్ఖులు నీటిపై పరిగెత్తుకుంటూ రావడం అతనికి కనిపించింది. అతడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఎందుకంటే, ఇంతవరకు ఒక్క జీసస్ మాత్రమే నీటిపై నడిచినట్లు అతనికి తెలుసు. కానీ, ఆ ముగ్గురు చేతులు జోడించి నమస్కరిస్తూ ‘‘మహాత్మా, మీరు నేర్పిన ప్రార్థనను మేము మళ్ళీ మర్చిపోయాం. దయచేసి మీరు మరొకసారి ఆ ప్రార్థనను మాకు నేర్పాలి’’ అన్నారు. నీటిపై నిలబడ్డ వారిని చూడగానే ఆర్చిబిషప్‌కు సత్యం బోధపడింది. వెంటనే ఆర్చిబిషప్ వారికి నమస్కరిస్తూ ‘‘చాలా సంప్రదాయబద్ధమైన రష్యా చర్చిలో అత్యున్నత స్థానానికి చేరుకున్న నేను జీవితకాలమంతా ప్రార్థిస్తూనే ఉన్నాను. అయినా నేను మీలా నీటిపై నడవలేను. దేవుడు మీతో ఉన్నాడని నాకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, మీకు నా ప్రార్థనతో పనిలేదు. మీరు చేసే ప్రార్థనే పరిపూర్ణమైనది. అదే చెయ్యండి. నన్ను మన్నించండి’’ అన్నాడు. వెంటనే వారు ఆర్చిబిషప్‌కు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయారు.
ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీరు ఈ కథను గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే, ప్రేమను ప్రార్థనగా మలచడమే అసలైన ప్రార్థన. కానీ, చర్చిలు, దేవాలయాలు, మసీదులు, వ్యవస్థీకృత మతాలు దానిని పూర్తిగా నాశనం చేశాయి. అవన్నీ సిద్ధం చేసిన ప్రార్థనలనే మీకు బోధించాయి. నిజానికి, అప్రయత్నంగా మీలో కలిగే సహజమైన భావనే ప్రార్థన. అది ఎప్పుడూ అలాగే పుట్టాలి. అంతేకానీ, దేవుడి ముందు కూడా సిద్ధం చేసిన ప్రార్థనను వల్లించే మీరు ఎలా సహజంగా, ప్రామాణికంగా, వాస్తవంగా ఉండగలరు. కాబట్టి, చెప్పాలనుకున్న వాటినే మీరు చెప్పండి. ఎలాంటి మర్యాదలు పాటించకుండా మంచి మిత్రుడితో మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడండి. మర్యాదలతో కూడుకున్న అనుబంధం అసలు ఒక అనుబంధమే కాదు.
ఒకవేళ, దేవుడితో కూడా మీరు అలాంటి అనుబంధంలో ఉన్నట్లైతే, మీ సహజత్వాన్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లే. ప్రార్థనలో మీ ప్రేమను నింపండి. అలా మీ ప్రేమను ప్రార్థనగా మలచండి. అప్పుడే మీరు ఈ విశ్వంతో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అది చాలా అందమైన అనుభవం. మీరు నిజంగా మీ సహజమైన భావోద్వేగంతో అప్రయత్నంగా ఒక చెట్టుతోనో, పువ్వుతోనో మాట్లాడుతున్నప్పుడు చూసిన వారందరూ మిమ్మల్ని పిచ్చివాడనుకుంటారు. అదే మీరు చర్చిలో ఉన్న శిలువతోనో, దేవాలయంలో ఉన్న రాతి విగ్రహంతోనో మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ధార్మికుడంటారే కానీ, పిచ్చివాడనరు. ఎందుకంటే, వాటివి అధీకృత రూపాలు.
మీరు రాతి బొమ్మతో మాట్లాడడం కన్నా జీవమున్న గులాబీతో మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే, గులాబీలో దివ్యత్వముంది. అలాగే మీరు భూమి లోతుల్లోకి వెళ్ళిన వేళ్ళతో, ఆకాశంలోకి ఉన్నతంగా ఎదిగిన శాఖలతో, సూర్యుడు చంద్రుడు, నక్షత్రాల కాంతులతో కూడిన విశ్వంతో అనుసంధానమున్న చెట్లతో మాట్లాడడం చాలా మంచిది. దివ్యత్వంతో అనుబంధమంటే అదే.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.