సబ్ ఫీచర్

అంతటా ఉన్నది ప్రేమే! (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే, ప్రేమ మీలో చోటుచేసుకున్న వెంటనే మీ జీవితానికి పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మీరు చాలా హాయిగా, సౌకర్యంగా ఉంటారు. దానితో మీ మానసిక భయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే, ప్రార్థన దానంతటదే మీలో చోటుచేసుకున్నప్పుడు మీరు విశ్వంతో ఏకమైపోతారు. అప్పుడు అన్ని రకాల భయాలు మీ నుంచి పూర్తిగా అదృశ్యమవుతాయి. చివరికి మీకు మృత్యుభయం కూడా ఉండదు. అలా అన్ని రకాల భయాలు పూర్తిగా అంతరించడంతో మీరు పూర్తిగా నిర్భయులవుతారు. ఆ నిర్భయత్వం కూడా మీరు గాఢమైన ధ్యానం చేసిన వెంటనే పోతుంది. అంటే, భయమూ పోతుంది, నిర్భయత్వమూ పోతుంది. అప్పుడు ఒక్క శూన్యం తప్ప మీలో ఏదీ మిగలదు. అంటే, ఎంతో స్వచ్ఛమైన, అమాయకమైన, పరమపవిత్రమైన శూన్యం మాత్రమే మీలో మిగులుతుంది.
ప్రేమ ఒక సంబంధం కాదు, అది ఒక స్థితి:
దానికి ఎవరితోనూ ఎలాంటి సంబంధము ఉండదు. ఒకరు ఎప్పుడూ ప్రేమించరు, మరొకరు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. ఎప్పుడూ ప్రేమించే వారు ఎప్పుడూ ప్రేమలోనే ఉంటూ, ప్రేమగా మారతారు. ప్రేమ ఫలితం, దాని ఉపోత్పత్తి అలాగే ఉంటుంది.
కానీ, అదే ప్రేమకు మూలం కాదు. ఎవరైతే ప్రేమగా మారతారో వారే ప్రేమకు మూలమవుతారు. అయితే ఎవరు ప్రేమగా మారగలరు? మీరెవరో మీకు తెలియకపోతే ఎప్పటికీ మీరు ప్రేమగా మారలేరు. అప్పడు భయం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించడంతో మీరే భయంగా మారతారు.
గుర్తుంచుకోండి: అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమకు వ్యతిరేకమైనది ద్వేషం కాదు, భయం. ప్రేమ తలక్రిందులుగా ఉండడమే ద్వేషం. అంతేకానీ, అది ప్రేమకు వ్యతిరేకమైనది కాదు. నిజానికి, ప్రేమకు వ్యతిరేకమైనది భయమే. ఎందుకంటే, ప్రేమలో ఉన్నవారు ఎప్పుడూ చాలా విశాలంగా ఉంటారు. అందువల్ల వారి దగ్గర ఎలాంటి దాపరికము ఉండదు. కానీ, భయంలో ఉన్నవారు ఎప్పుడూ మూసుకుపోయి ఉంటారు. అందువల్ల వారు ఏదీ పైకి చెప్పలేరు. ప్రేమలో ఉన్నవారు ఎప్పుడూ విశ్వాసంతోనే ఉంటారు. అందువల్ల వారి దగ్గర ఒంటరితనం ఎప్పుడూ ఉండదు. కానీ, భయంతో ఉన్నవారు ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు. అందువల్ల వారు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. ప్రేమలో ఉన్నవారు విశ్వంతో ఏకమైపోతారు. అందువల్ల వారి దగ్గర ఒంటరితనం ఎప్పుడూ ఉండదు.
ఎందుకంటే, ఈ చెట్లు, పక్షులు, జంతువులు, మేఘాలు, కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడిన మొత్తం విశ్వమంతా మీలోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ అంతర్గత ఆకాశాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు ప్రేమగా మారతారు, మీరే ప్రేమ అవుతారు.
పసి పిల్లలందరూ ఎలాంటి భయాలు లేకుండానే పుడతారు. కాబట్టి, మూఢ నమ్మకాలతో వారిని భయపెట్టకుండా పర్వతాలను ఎక్కడం, సముద్రాలలో ఈదడం లాంటి సాహసకార్యాలు చేసేందుకు సమాజం పూర్తిగా సహకరిస్తే, వారు జీవితాన్ని ప్రేమించే వారుగా, పరిపూర్ణ ప్రేమికులుగా తయారవుతారు. అదే అసలైన మతం. ప్రేమకన్నా ఉన్నతమైన మతం ఏదీ లేదు.
మీరు నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ మీ అంతర్గత లోతుల్లోకి చొచ్చుకుపొండి. అలాగే వికసించిన పువ్వులను ఆశ్చర్యంగా చూస్తూ, పక్షుల కిలకిలరవాలను ఏకాగ్రతతో వింటూ మైమరచిపొండి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.