సబ్ ఫీచర్

ప్రేమే దైవం ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అందరికీ కామకలాపాలు తెలిసినంతగా ప్రేమ గురించి తెలియదు. ఎలాంటి భయాలు లేనప్పుడే మీలో ఎలాంటి దాపరికాలు ఉండవు. అప్పుడే మీరు మీ సరిహద్దులను తొలగించి, విశాల హృదయంతో ఇతరులను మీ కేంద్రంలోకి ఆహ్వానించగలరు. గుర్తుంచుకోండి, ఇతరులు మీ కేంద్రంలోకి ప్రవేశించేందుకు మీరు ఏమాత్రం భయపడకుండా అంగీకరించినప్పుడే వారికి కూడా మీపై పూర్తిగా నమ్మకం కలుగుతుంది. అప్పుడే వారుకూడా మిమ్మల్ని తమ కేంద్రంలోకి ప్రవేశించేందుకు నిర్భయంగా ఆహ్వానిస్తారు. మీరు భయపడనప్పుడు ఇతరులు కూడా భయపడరు కదా! కానీ, మీ ప్రేమలో భయం ఎప్పుడూ ఉంటుంది. భార్యభర్తకు, భర్త భార్యకు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. అలాగే, ప్రేమికులు కూడా ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. కానీ, భయపడే ప్రేమ ఎప్పుడూ నిజమైన ప్రేమకాదు. అది కేవలం ఎప్పుడూ భయపడుతూ ఒకరిపై ఒకరు ఆధారపడే ఇద్దరు వ్యక్తులు స్వాధీనతాభావంతో ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, శాసించుకుంటూ, నియంత్రించుకుంటూ, దోచుకునేందుకు చేసుకున్న ఒక ఏర్పాటుమాత్రమే అందుకే అది నిజమైన ప్రేమకాదు.
ఒకవేళ మీరు నిజంగా ప్రేమ సంభవాన్ని అంగీకరించగలిగితే చర్చిలు, దేవాలయాలు, మసీదులు, ప్రార్థనలు, ధ్యానాలతో మీకు ఎలాంటి అవసరమూ ఉండదు. ఎందుకంటే, ప్రేమ ద్వారా మీకు అన్నీ లభిస్తాయి. అప్పుడు మీరు హాయిగా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోవచ్చు. అందుకే జీసస్ ‘‘ప్రేమేదైవం’’అన్నాడు. కానీ, ప్రేమించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే, అందుకు భయాన్ని వదలక తప్పదు. కానీ, తమాషా ఏమిటంటే, భయాన్ని వదిలినందువల్ల మీకు పోయేదేమీ లేకపోయినా దానిని వదిలేందుకు మీరు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు.
ఇలాంటి వ్యక్తుల గురించి మార్మికుడైన ‘‘కబీర్’’ ఒకచోట ‘‘దుస్తులు ఆరేదెలా? అని స్నానం చేసేందుకు దిగంబరులు భయపడుతున్నారు’’ అని చమత్కరించాడు. మీ పరిస్థితికూడా సరిగ్గా అలాగే ఉంది. పోగొట్టుకునేందుకు ఏమీలేని మీరు ఏదోపోతుందని భయపడుతున్నారు. మీ శరీరాన్ని మృత్యువు కబళిస్తుంది. అది జరగక ముందే దానిని ప్రేమకు ఇచ్చెయ్యండి. అలాగే అన్నింటినీ నాశనంచేసే మృత్యువు ఏదీ మిగల్చకుండా మీకున్నవన్నీ లాగేసుకుంటుంది. అలా జరగకముందే వాటిని పంచండి. నిజానికి, కేవలం పంచడం ద్వారా మాత్రమే మీరు ఇచ్చిన వాటిని తిరిగి పొందే అధికారి అవుతారు. అసలు పోరాటమంతా ప్రేమకు, మృత్యువుకు మధ్యలో జరుగుతోంది. నేను చెప్పినట్లు చేస్తే దోచుకునేందుకు మృత్యువుకు ఎలాంటి అవకాశము ఉండదు. ఎందుకంటే, మృత్యువు మీవన్నీ దోచుకోవడానికి ముందే వాటిని మీరు అందరికీ పంచేసారు.
ప్రేమించే వాడికి మరణముండదు. ప్రేమించని వాడికి ప్రతి క్షణం మరణమే. ప్రతి క్షణం క్షీణించే శరీరాన్ని ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు కబళిస్తుంది. అప్పుడు అంతా సర్వనాశనమవుతుంది. మీరు ఎలాంటి దాపరికాలు లేకుండా తెరిచిన పుస్తకంలా ఉన్నారు.
ఒకవేళ మీ గురించి అందరికీ పూర్తిగా తెలిసినా మీకొచ్చిన నష్టమేముంది? ఎందుకు మీరు అంతగా భయపడుతున్నారు? అసలు మీకున్న భయమేమిటి? కేవలం సమాజ మందించిన అనేక నిబద్ధీకరణలు, తప్పుడు భావనలవల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకించే శత్రువులని భావించే మీరు ఎప్పుడూ పోరాడే మనస్తత్వంతో ఉంటూ, మిమ్మల్ని మీరు రక్షించుకునే పనిలో దాక్కోవలసి వస్తోంది.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.