సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను కర్తను’’అని భావించువానికి భగవవంతుడు ప్రసన్నుడు కాడు.
687. తనకు ఎపుడు కృపగలుగునో అపుడే భగవంతుడు సాక్షాత్కరించును. ఆతడు పరంజ్యోతి, జ్ఞానభాస్కరుడు. వాని కిరణమొక్కటి ప్రసరించి లోకమునకంతకును ధీశక్తినొసగుచున్నది. తన్మూలముననే మనము ఒండొరులను దెలిసికొనగలుగుచున్నాము. బహువిధములైన జ్ఞానమును బొందగలుగుచున్నాము. తన దివ్య తేజమును తనపై బ్రసరింపజేసికొనునప్పుడే మనము వానిని గాంచగల్గుదుము.
పదునైదవ ప్రకరణము
గురువు , గురుని లక్షణములు
688. ఎవ్వరికెవరు గురువు? భగవంతుడే జగద్గురువు. ఎల్లరకును దారి చూపగలవాడు.
689. తన గురువునెవ్వడు మానవమాత్రునిగా గణించునో అట్టివాడెన్ని జపతపములు చేసినను ప్రార్థనలుచేసినను అన్నియు నిష్ఫలము. గురుని మనము మనుష్యమాత్రునిగా ఎన్నదగదు. శిష్యునకు భగవత్సాక్షాత్కారము కలుగుటకు పూర్వము, బ్రహ్మానుభవమున మొట్టమొదట గురుసాక్షాత్కారమునొందును. పిమ్మట విచిత్రముగా తానే భగవద్రూపమునుబొంది శిష్యునకు భగవత్సాక్షాత్కారమును ప్రసాదించును. అప్పుడు గురువును దైవమును ఏకమేయని శిష్యుడు గ్రహించును. శిష్యుడు కోరువరములనెల్ల భగవద్రూపమున గురువే వానికొసగును. వేయేల, సర్వమును, జీవబ్రహ్మైక్య పదమగు నిర్వాణమును సైతము, గురువే వానికి జేకూర్చును. లేదా, భగవంతుడు సేప్యుడనియు తాను సేవకుడననియు భగవంతుడుని యెడ సేవ్య సేవక భావమును నిలుపుకొనగోరు వరుడు ద్వైతస్ఫురణము గలిగియునుండవచ్చును. శిష్యుడేమి కోరికను గురువువానికి ప్రసాదింపగలడు.
690. ద్వి.‘‘మంత్రంబు చెవి నూఁదు మానవగురుఁడు. ఆత్మలో ముద్రించునల శివగురుఁడు.’’
691. గురువు మధ్యవర్తి, సంధానకర్త ప్రియుని ప్రియురాలిని ఒండొరులతో గూర్చునటుల గురువు నరునకు నారాయణ సమాగమము గలిగించును.
692. గురువు గంగాభవాని వంటివాడు. గంగానదిలో నరులెంత మాలిన్యము వైచినను గంగ తన పవిత్రతనుగోల్పోదు. అటులనే గురువు దూషణ తిరస్కారాదులకు అతీతుడు.
693. ఉత్తములనియు మధ్యములనియు అధములనియు మూడు విధములైన వైద్యులుగలరు, అటులనే మూడు విధములైన గురువులును గలరు. రోగిని, వానినాడిని జూచి యేదో మందుపుచ్చుకొనుమని చెప్పి వెడలిపోవువారు ఇందు మూడవ తరగతి వైద్యులు. వీరు రోగి నిజముగా ఆ షధమను సేవించుచున్నాడా, లేదాయని విచారింపనైన విచారింపరు. అలాగుననే తమ యుపదేశమును పాటించి శిష్యుడు తదనుగుణముగా వర్తించుచున్నాడా, లేదాయను విషయమునే కనుగొనని గురువులు కొందఱుందురు. ఇక రెండవ తరగతి వైద్యులు తాము నియమించిన మందు పుచ్చుకొనిన స్వస్థత కలుగునని రోగికి నచ్చజెప్పి, మందు మ్రింగుట కిష్టపడనియెడల సామోపాయములచే వానిని ప్రోత్సహింతురు. ఇదే విధమున సన్మార్గమున నడచుచు, భక్తి కలిగియుండి సత్యానే్వషణ చేయుడని సామోపాయములచే జనులకు బోధించుచు, వారినట్లు ప్రవర్తింపజేయుటకై కొందఱు గురువులు సకల కష్టముల బడుదురు. వీరు రెండవ తరగతి వారని చెప్పవచ్చును. (ఉత్తములగు) మొదటి తరగతి వైద్యులు రోగి ‘మందు మ్రింగ’నని భీష్మించినను జంకక వాని ఱొమ్ముపై మోకాలు మోపి బలవంతముగ మందును గొంతుకలోపోయుటకు వెనుదీయరు. ఇటులనే శిష్యుని బ్రహ్మమార్గమున నడిపించుటకై, ఆవశ్యకమగునేని, బలాత్కరించుటకు సైతము వెనుదీయని గురువులు కొందఱుందురు.. వీరే గురూత్తములు.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి