సబ్ ఫీచర్

శుభాలను కురిపించే రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ ‘నెలవంక’ కన్పించగానే ప్రతి ముస్లిమ్‌లో ఒకరకమైన అద్వితీయమైన భక్త్భివాం వెల్లివిరుస్తుంది. అనిర్వచనీయమైన మానసిక ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసం అత్యంత శుభప్రదమైన మాసం. రంజాన్ మాసంలోనే మానవాళి సాఫల్యానికి మార్గదర్శకమైన ‘దివ్యఖుర్ ఆన్’ గ్రంథం అవతరించబడింది.
రమజాన్ మాసంలో విధిగా అందరూ రోజాలు (ఉపవాసాలు) ఉండాలి. కాని, ఈ నియమ నిబంధనలలో కొంత వెసులుబాటును కూడా ఇవ్వటం జరిగింది. వృద్ధులు, వ్యాధిస్త్రులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారికి మినహాయింపు ఉంది. కాని వారు ఆ ఉపవాస దినాలలో ఉపవాసం లేకపోయినయెడల తిరిగి ఇతర దినాలలో పూర్తిచెయ్యాలి.
శక్తిహీనులయినవాళ్ళు, వృద్ధాప్యంతోనూ, అనారోగ్య దృష్ట్యా ఉపవాసం చేపట్టకపోయినవారు- నిర్ణీత ధనాన్ని ఉపవాసాలు చేపట్టిన ఓ పేదవాడికి తనకు బదులుగా చెల్లించాల్సి వుంటుంది. అతను ఓ నెలపాటు సహరి (ప్రాతఃకాలంలో భుజించడం) ఇఫ్తార్ (సూర్యాస్తమ సమయంలో ఉపవాసదీక్ష విరమింపజెయ్యడం) కొరకు ఎంత ఖర్చు అవుతుందో దాని విలువ కట్టి ధనరూపంలో ఇవ్వటం.
రంజాన్ మాసంలో సమాజంలో ఒక మంచి మార్పు కన్పిస్తుంది. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అందరిలో భక్త్భివం పెరిగిపోతుంది. మసీదుల్లో నమాజ్ చెయ్యటానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాక దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తారు.
రమజాన్ మాసంలో ప్రతి ముస్లిమ్ విధిగా పాటించవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి.
రోజాలు (ఉపావాసాలు పాటించడంతో పాటు ఫిత్రా - జకాల్- తరావీహ్ - వంటివి కూడా ఆచరించాలి.
జకాత్ - ఫిత్రా- అన్నది పేద సాదలకు ఆర్థికంగా సాయపడటం. జకాత్ ఇస్లామీయ మూలస్తంభాలలో మూడవది. తప్పనిసరి విధిగా భావించాలి.
నిర్ణీత సంపద కలిగిన వ్యక్తి జకాత్ చెల్లింపును ఆమోదించని పక్షంలో అతను తిరస్కారి అవుతాడు. అతను విధిగా పేదసాదలకు తన సంపదపై నిర్ణీత పైకాన్ని దానధర్మాలు చెయ్యాలి.
ఫిత్రా- ఈద్ నమాజ్‌కు ముందే ఫిద్రా దానం చెల్లిస్తారు. పేదసాదలకు ఈద్ పండగ జరుపుకోవడానికి ఆర్థిక సాయం లభించినట్లవుతుంది. అది స్వీకృతదానం అవుతుంది. ఆ సమయం దాటితే సాధారణ దానమవుతుంది. రోజాలు పాటిస్తున్న సమయంలో ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే దానికి పరిహారంగా కూడా భావించటం జరుగుతుంది.
తరావీహ్ రంజాన్ మాసంలోని ఆరాధనల్లోని ముఖ్య ఆరాధన రాత్రిళ్ళలో ఇషానమాజ్ సమయంలో చెయ్యటం జరుగుతూంటుంది. ఈ నమాజ్‌లో ఖురాన్ పారాయణం చేస్తారు. రంజాన్ నెల ముగిసేలోగా ఖురాన్ పారాయణం చెయ్యటం ముగిస్తారు. ఇలాంటి కఠిన నియమావళిని కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో గావిస్తారు.
ఇఫ్తార్- తెల్లవారుజామునుండి కఠినమైన నియమ నిబంధనలలో అంటే కనీసం మంచి నీళ్ళు కూడా త్రాగకుండా ఉమ్మి కూడా మ్రింగకుండా ఉపవాసాలను చేపట్టిన తరువాత సూర్యాస్తమయ సమయంలో దీక్ష విరమణ చెయ్యటమే ఇఫ్తార్. కొంతమంది తమ ఇళ్ళల్లో బంధు మిత్రుల నడుమ ఇఫ్తార్ విందును చేబడుతుంటారు. మరికొంతమంది దయార్ద్ర హృదయులు మసీదుల్లో అక్కడక్కడ పేదసాదలకు సహారీ ఇప్తార్‌లను ఏర్పాటుచేసి అన్నపానీయాలు పంచుతుంటారు.
రమజాన్ మాసం శుభాలను కురిపించే మాసం. సాధారణ రోజుల్లో పొందే పుణ్యం కంటే డెబ్భై రెట్లు ఎక్కుగా పుణ్యం పొందుతారంటారు.
రమజాన్ మాసం ముగుస్తున్న సమయంలో ప్రవక్త చాలా దుఃఖించేవారట. ఇంత పవిత్రమైన మాసం, మానవులను ప్రక్షాళనం చేసే మాసం ముగిసిపోతుందా తిరిగి పదకొండు నెలలు వేచి చూడాలా? అన్నట్లు బాధపడేవారట.

-పి.షహనాజ్ 9849229786