సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీకు ఆమెపై నెంత గారాబము కలదో అంత గారాబమును జూపుము; నీ మనసార ఆమెను పోషింపుము, సింగారింపుము; కాని యాకృత్యములన్నిటి మూలమునను బృందావన గోపాలునే ఆరాధించుచున్నానని మాత్రము అంతరంగమున భావించుచుండును.’’
757. ఒక భక్తునకు బందుగులలో నొకరియందమితమైన రాగమనియు అందుచే మనస్సును నిగ్రహింపజాలకున్నాడనియు గ్రహించి శ్రీగురుదేవుడాతని కిట్లుపదేశించెను: ‘‘నీ ప్రియవస్తువు సాక్షాత్తు భగవత్స్వరూపమని భావింపుము, ఈ భావనతో సేవింపుము.’’ ఈ విషయమునే విశదీకరించుచు శ్రీ గురుదేవుడు వైష్ణవచరణుడు నిట్లే తెలిపియున్నాడని యిట్లు వెల్లడించెను: ‘‘తన ప్రియవస్తువు నెవ్వడైనను ఇష్టదైవమని భావించునెడల మనస్సు సులభముగా భగవానునివైపు మఱలును. ఇదియే వైష్ణవచరణుని బోధన.’’
భక్తిప్రభావము
758. ఒక భక్తుడు: దేవా! విచారముచే మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించుట ఆవశ్యకమా?
శ్రీ గురుదేవుడు: ఔను, అదియొక మార్గము: అది విచారమార్గము. భక్తిమార్గమున ఇంద్రియ నిగ్రహము తనంతటదియే లభించును,- అతి సులభముగా లభించును.
759. హరినామమును విన్ననంతనే ఆనందాశ్రువులు స్రవింపకుండునంతవఱకే (్భక్తి)సాధనలు ఆవశ్యకము. భగవన్నామమును విన్నంతమాత్రమున ఆనందబాష్పములు వెల్లివిరియ, ఎవ్వని హృదయము ఉప్పొంగునో వానికిక సాధనలు అనావశ్యకము.
760. భగవద్భక్తిని ఒక కవి పులితో బోల్చియున్నాడు. జంతువులను పులివలె భగవద్భక్తి నరుని కామక్రోధాది శత్రువర్గమును కబళించివేయును. భక్త్యగ్ని ప్రజ్వలించినంతనే కామక్రోధాదులు దానిలో భస్మీపటలమైపోవును. శ్రీకృష్ణునందలి గాఢానురక్తిచే బృందావన గోపికలకట్టి మహాదశ లభించెను.
761. భక్తిమఱల కాటుకతో బోల్చబడియున్నది. శ్రీమతి (రాధ) యొకప్పుడిట్లు పలికెను: ‘‘ఓహో! సఖులారా! సర్వత్రా నాకు నా కృష్ణుడే కాన్పించుచున్నాడు!’’ ఇతర గోపికలు అందులకిట్లనిరి: ‘‘నీ కన్నులకు ప్రేమయను కాటుకను బెట్టుకొనియున్నావు. అందుచే నీకట్లు కాన్పించుచున్నది!’’
762. ప్రశ్న: భగవంతునికై భక్తుడెందుచే సమస్తము విడనాడును?
ఉ.దీపము కాన్పింపగనే చీకటినుండి కీటకము ఎగిరి వచ్చి దానిపై బడును; చీమ పానకమును విడువక అందే ప్రాణము విడుచును. అటులనే భక్తుడు సమస్తము విడనాడి భగవంతునాశ్రయించును.
763. శ్రీగురుదేవుడు: దీపమును జూచిన పిమ్మట మిడుత మఱల చీకటిని ఆశ్రయించునా?
వైద్యుడు (నవ్వుచు): ఒల్లదు, ఒల్లదు,- జ్యోతిలోబడి ప్రాణములు విడిచిపెట్టును.
గురుదేవుడు: కాని నిజమైన భగవద్భక్తుని విషయము వేఱు. వాని నాకర్షించు పరంజ్యోతి వానిని దగ్ధము చేయదు, నశింపచేయదు. అయ్యది దీప్తిమంతమయ్యును మార్దవముగను, మనోహరముగను ప్రశాంతికరముగను ప్రకాశించు మాణిక్యకాంతివంటిది. అది దగ్ధము చేయదు, కాని శాంతిని, ఆనందము నొసగి హృదయమును ప్రకాశింపజేయును.
764.ఒకనికి సరియైన మార్గము తెలియకున్నను భగవద్భక్తియు భగవంతుని దెలిసికోవలయునను తీవ్రవాంఛయ నుండవచ్చును. అట్టివాడు తన భక్తియొక్క ప్రభావమువలననే భగవల్లాభమును బొందగల్గును. ఒక మహాభక్తుడు జగన్నాథుని దర్శింపవలయునని పయనమైనవాడు.

- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి