సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యమేది, అనిత్యమేది యను విచారణ మూలమునకు నీవిట్లు బ్రహ్మ జ్ఞానము నొంద వచ్చును. మఱియు భక్తి మూలమునను బ్రహ్మ జ్ఞానమును బడయ వచ్చును. భక్తి కోసము వికాసము కోసము , ఆత్మ సమర్పణ కోసము , నిరంతరము ఆమెను ప్రార్థించుటయే భక్తి యోగ తత్త్వము . వీని మూలమున మొదట నా జగజ్జనని సాన్నిధ్యమును బొందుము. నీ ప్రార్థన హృదయపూర్వకమై నచో నా దివ్యమాత దాని నాలకించి తీరునని నా మాటగా నమ్ముము కాని నీవనందులకై వేచియుండవలయును. ఆమె నిర్గుణ తత్త్వమును సాక్షాత్కరించుకొనగవల చెదవా. మఱల ఆమెనేప్రార్థింపుము. ఆమె నీప్రార్థన నాలకించు నేని ఆమె సర్వ శక్తిమయి కదా. సమాధి స్థితిలో నీకామె నిర్గుణ తత్త్వము అనుభూతమగును. (అనగా నిర్గుణ బ్రహ్మసాక్షాత్యారము నొందుదువు) ఇదియే బ్రహ్మజ్ఞానము.
జ్ఞానికిని భక్తునకు మనోభావమునందుగల భేదము
805. సాధకులు ఇరు తెఱగలుగా గాన్పించుచున్నారు. ఒక తెగ వారిని కోతిపిల్లతోడను రెండవ తెగ వారిని పిల్లికూన తోడను బోల్పవచ్చును. ఇట్లే జ్ఞాన మార్గమును లేదా, నిష్కామకర్మమార్గమును అవలంబించు సాధకుడు మోక్షమునకై స్వప్రయత్నముపై నాధారపడును. భక్తిమార్గము నవలంబించువాడో, సమస్తము ఈశ్వరేచ్ఛచేతనే జరుగుచున్నదని గ్రహించి పూర్ణ విశ్వాసముతో వానియనుగ్రహముపై నాధారపడియుండి వానికి సంపూర్ణముగా ఆత్మార్పణ మొనర్చుకొనును. ఇందుముందు జెప్పినవాడు (అనగా పురుషప్రయత్నము నాశ్రయించువాడు) కోతిపిల్లవంటివాడు (మర్కట కిశోర న్యాయము). తరువాత చెప్పినవాడు (అనగా ఈశ్వరునకు ఆత్మార్పణముగావించుకొను సాధకుడు) పిల్లి పిల్లవంటివాడు (మార్జాలకిశోర న్యాయము).
806. జ్ఞాని ‘‘నేనే శుద్ధబ్రహ్మను’’నన్నును; కాని భక్తుడు, ‘‘ఆహా! ఈ సర్వము ఈశ్వర విభూతియే!’’ యనును.
807. ‘‘ఈ సమస్త ప్రపంచము నేనే’’; ‘‘ఈ సమస్త ప్రపంచము నీవే’’; ‘‘నీవు ప్రభుడవు. నేను సేవకుడను’’- ఈ మూడు మనోభావములందును ఏదేని యొకదానియందు చక్కగా నెలకొని యుండువాడు మాత్రమే భగవత్సాక్షాత్కారము నొందగల్గును.
808. శివాంశముచే జన్మించునట్టివాడు జ్ఞానియగును. ‘‘బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య’’యను జ్ఞానమునొందుటయే వానియభీష్టము. కాని విష్ణ్వంశముచే జన్మించిన వానికి భక్తి విశ్వాసము లెన్నడును కొఱవడవు. నిత్యానిత్య వస్తువిచారముచే, లేక తార్కిక జ్ఞానమహిమచే తాత్కాలికముగా వాని భక్తివిశ్వాసము లొకప్పుడు ఒకించు క్షీణించినను సకాలమున అయ్యని యాదవకుల నాశకమైన ముసలము వలె విజృంభించును.
809. జ్ఞాని హృదయమున బ్రవహించు ‘‘ప్రజ్ఞానగంగ’’ ఒకే దిశగా బ్రవహించుచుండును. వానికి సమస్త జగత్తును స్వప్నతుల్యముగా దోచును. ఆతడు సదా ఆత్మయందే నెలకొనియుండును. కాని భక్తుని హృదయమందలి ‘‘ప్రేమ గంగ’’యో, సదా ఒకే దిశగా ప్రవహింపదు భక్తుడు ఒకప్పుడు నవ్వును, ఒకప్పుడేడ్చును; ఒకప్పుడు ఆడును, మఱియొకప్పుడు పాడును. భక్తుడు ఎప్పుడును భగవత్సాన్నిధ్యము గలుగునానందము ననుభవింపగోరును. సముద్రమున దేలియాడు మంచుకొండవలె ఆ యానందసాగరమున నొకప్పుడాతడు ఈదులాడుచు, ఒకప్పుడు మునుగుచు, ఒకప్పుడు తేలుచు, అందే నెలకొని యుండ నభిలషించును.
810. పురాణముల ప్రకారము భక్తుడు భగవంతునికంటె భిన్నుడు, - భక్తుడు ఒక తత్త్వము, భగవంతుడు వేఱొక తత్త్వము.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది