సబ్ ఫీచర్

ధారణ, ధ్యానమూ ప్రధానమే శ్రీచక్రము, మానవ శరీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

ఇదివరకెప్పుడో చదివింది, విన్నది, చూసింది, మనకవసరమైనపుడు, సమయానికి, స్ఫురణకు వచ్చుటను, ధారణ అని సామాన్యార్థంగా చెప్పుకోవచ్చును. ఇట్టి ధారణ లౌకిక ప్రయోజనమునకు మాత్రమే ఉపకరిస్తుంది. మానసికంగా ఒక అంశాన్ని అర్థవంతంగా ధరించుటయే ధారణ.
ఒక విషయమును ధారణ చేయవలెనన్న ఏకాగ్రత చాలా అవసరము. ధరించుట అను అర్థము కలిగిన ‘్ధృ’ అను ధాతువునుండి ధారణ యను శబ్దమేర్పడినది. పతంజలి మహర్షి, ధారణను ‘దేశబంధశ్చిత్త స్యధారణా’ అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ దేశము అంటే, మన శరీరాంతర్గతమైన మూలాధారాది షట్చక్రములలో దేనిపైనైనను ధ్యాస నిలుపుటయని అర్థంచేసుకోవాలి. మన ఇంద్రియ శక్తులన్నింటిని సమాయత్తపరచి ఒకే మార్గమున నడిపించుటయే ధారణ. ఉదాహరణకు అనాహత చక్రమునందు, దృష్టి నిలిపి యుంచినచో హృదయధారణగాను, విశుద్ధ చక్రస్థానమున దృష్టి కేంద్రీకరించినచో, కంఠధారణగాను పేర్కొనవచ్చు. ఆ విధంగా ధారణ నభ్యసించవచ్చును.
ఏ దేవతోపానలోనైనా, ఏ శాస్త్ధ్య్రాయనంలోనైనా పరిణతి సాధించాలంటే, ధారణ లేకుండా అట్టి పరిణతి, దుస్సాధ్యమని చెప్పవలసి వుంటుంది. ముఖ్యంగా, శరీరము, ఆత్మ, రుూ రెండింటికి చైతన్యాన్ని ప్రసాదించే, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ధారణ అత్యవసరమైయున్నది. మన మస్తిష్కంలో, విజ్ఞాన భాండాగారాన్ని అనుసంధానం చేసుకోవడానికి ధారణయోగ మత్యంతావశ్యకమై యున్నది.
శ్రీమద్రామాయణమునందలి, కిష్కింధాకాండలో, శ్రీ ఆంజనేయస్వామివారి, ధారణాశక్తిని, శ్రీరామచంద్రుడు ఎంతగానో ప్రశంసించుటను, మనం గమనించవచ్చును.
ధారణ యోగ ప్రక్రియ, ధారణను అంతరంగంలో సుస్థిరం చేసుకునే విషయమై శ్రీమద్భాగతమునందు, పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని ప్రశ్నించగా, శుకమహర్షి వివరించిన విషయమిక్కడ పరిశీలనార్హమై యున్నది.
ఓ పరీక్షీన్మహారాజా, సాధకుడు అభ్యాసం చేత, సుఖవంతముగా, స్థిరాసనాసీనుడై, శ్వాసమీద ధ్యాస నిలిపి ప్రాణాయామం చేత, ఉచ్ఛ్వాసనిశ్వాసలను క్రమబద్ధముగావించి ఇంద్రియ శక్తులను బుద్ధియందు లయం చేసి, మనస్సును, విశ్వరూపుడైన భగవంతునియందు కేంద్రీకరించాలి. భూత, భవిష్యద్వర్తమాన కాలములతో చేరి, కార్యకారణ సంబంధముతో, సకల చరాచర ప్రాణికోటియందు నిలిచియున్న, బ్రహ్మాండ వ్యాప్తమైన ఆ పరమాత్మ యొక్క స్థూలదేహమే, ఈ జగత్తంతా యను భావనతో, సాధకుడు పరిపూర్ణ విశ్వాసంతో, ధారణయోగాన్ని అభ్యాసం చేయాలి. పంచభూతములు (గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి) అహంకారము, మసత్తు అను సప్త ఆవరణములను తన శరీరముగా కలియున్న పరమాత్మను, తన అంతరంగమందు సాధకుడు, స్థిరముగా నిలుపుకొనవలెను. సృష్టి ప్రారంభమునందు, సృష్టికర్తయైన బ్రహ్మకూడ, పరమాత్మయైన, శ్రీమన్నారాయణు యందు తన బుద్ధిని, స్థిరముగా నిలిపి, హరి ప్రార్థనయనెడి, ధారణశక్తితో సృష్టి కార్యము నిర్వహించెనని, శుకమహర్షి చెప్పెను.
కావున, పతంజలి మహర్షి చెప్పిన ధారణా విధానాన్ని కోరుకునేవారు, ఈశ్వరప్రణిధాన, రూపమైన ధ్యానాన్ని చేయడానికి ఎక్కువ సమయము కేటాయించాలి. యోగభ్యాసంలో ధారణకు, ధ్యానానికి పెద్దపీట వేయబడినది.
‘్ధ్యనావస్థిత, తద్గతేన, మనసా, పశ్యంతి, యం యోగినః’ అనగా, యోగులైన వారు ఏకాగ్రచిత్తంతో, ధ్యానంలో పరతత్వాన్ని దర్శిస్తారు అని చెప్పుటవలన పరమ లక్ష్యమైన పరమాత్మ దర్శనమునకు, ధ్యానమత్యంతావశ్యకమైయున్నది.
మంత్రోపాసన
‘‘మననాత్‌త్రాయతే ఇతి మంత్రః’’ అనగా మననము చేయువానిని రక్షించునది మంత్రము అని అర్థం. జపధ్యానాదులలో, యజ్ఞయాగాదులలో మంత్రము యొక్క పాత్ర, ప్రభావము చాలా ఎక్కువని మనకు తెలుసు. ఒక ప్రత్యేకమైన బీజాక్షర సంయుక్తమైన శబ్దమే మంత్రమనబడును. దీనియందు ఉచ్ఛారణ ప్రాధాన్యమెక్కువ. అర్ధప్రాధాన్యత కంటె మంత్రమందు శబ్దప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుంది. నిర్దేశించిన నిర్ణీత క్రమంలో పలికినపుడు లేక ధ్యానించినపుడు దాని శక్తి వ్యక్తమగును. మన పెద్దలు మంత్రజప విశిష్టతనీ విధంగా వివరించారు.
బీజాక్షర మంత్రములతో దేవతలనారాధించిన సద్యః ఫలము తధ్యము. అందువల్ల దేవతలు విగ్రహ రూపములు బీజాక్షరములతో పొందుపరచిన యంత్రములు పూజార్హములు. కావుననే యంత్రము లేని దేవతా ప్రతిష్ఠలుండవు. మంత్రాన్ని జపించేటపుడు పరమాత్మ జీవాత్మ అనుసంధానము ముఖ్యమైనది. ఉదాహరణకు శివాయనమః రామాయ నమః , నారాయణాయ నమః కృష్ణాయనమః అన్నపుడు, పరమాత్మ వాచకముతో ‘నమః’ను చేర్చి రామనమః, కృష్ణ నమః అనడం లేదు- మధ్యలో జీవాత్మ వాచకం ‘య’ను జోడించి ‘రామాయనమః గోవిందాయ నమః’ అంటున్నాము.
‘‘జపతోనాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, వౌనేన కలహం నాస్తి’’ శబ్దమునకున్న ప్రభావమును గుర్తించిన మన పెద్దలు, అట్టి శబ్దములను ధ్యానించి మంత్రములుగా మనకందించారు. ఆ విధముగాప్రత్యేకముగా ఉచ్ఛరించి, ఉపాసించిన శబ్దములే, బీజాక్షరములుగా సంకేతింపబడినవి. మంత్రమును మంద్రముగానుచ్చరించచుచు, అది ఎచ్చటనుండి ఉత్పన్నమగుచున్నదో గమనించవలెను. అట్లు గమనించకపోగా మనసు ఆ మంత్రమునందు లయమగును.

- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014