సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచ్చిదానందమయునందు చిత్తము లయమందకుండునంతవఱకు నరుడు భగవత్ప్రార్థనమును సంసారమున కర్మమును- రెంటిని గూడ చేయవలసి యుండును. కాని భగవానునియందు చిత్తము లయమందినవాడిక నే కర్మమును చేయనక్కరలేదు. ఉదాహరణమునకు సంకీర్తనమును గైకొందము. ‘‘నితాయ్ అమార్ మత్తాహతి’’ (మత్తగజము నా నిత్యానందుడు) అనుకీర్తనము నొకడు పాడనారంభించును. మొదట పల్లవిని పాడునపుడు గాయకుడు రాగతాళాది వివరములనన్నిటిని గూర్చియు శ్రద్ధవహించును. కాని కీర్తనయం దాత డించుక తన్మయుడైనంతనే కేవలము ‘‘మత్తాహతి, మత్తాహతి’’అనుచుండును. ఇంకను తన్మయుడైనప్పుడు కేవలము ‘‘హతి, హతి’’అనుచుండును. బాగుగా తన్మయుడైనప్పుడు ‘‘హా, హా’’అని మాత్రమే ఉచ్చరింపగల్గును.
835. కాబట్టి నేను చెప్పినదేమన, ప్రారంభ దశలో కర్మసంబంధమైన గందరగోళము ఎక్కువగానుండును. కాని నీవు భగవానుని సమీపించినకొలదియు కర్మము క్షీణించుచుండును. తుదకు సంపూర్ణమైన కర్మపరిత్యాగమును సమాధిస్థితియు లభించును. సాధారణముగా సమాధి స్థితినిబొందిన వెనుక శరీరము విశేషకాలము నిలువదు. కాని కొందఱి విషయము వేఱు. లోకమునకు బోధించు నిమిత్తము వారి శరీరము నిలుచును. నారదుని వంటి మహర్షులును శ్రీ చైతన్యుని వంటి అవతార పురుషులును ఇట్టివారు. నూయి త్రవ్విన వెనుక తట్టలు, పాఱలు మొదలగు పరికరములనన్నిటిని కొందఱు పాఱవేయుదురు. కాని మఱికొందఱు ఇరుగుపొరుగువారికవి పనికివచ్చునని వానిని భద్రముగా దాచియుంతురు. అట్టి మహనీయులు లోకులను జూచి జాలిపడుదురు, పరితపింతురు. తమ జ్ఞానప్రాప్తిని మాత్రమే చూచుకొనునంతటి స్వార్థపరులు కారు వారు.
బ్రహ్మతత్త్వము
బ్రహ్మము
836. బ్రహ్మ స్వరూప భావన యెటులుండును? అది మాటలచే నిరూపింప శక్యముకానిది. ఎన్నడును సముద్రము జూచి యుండనివానికి అది యెట్టిదో యొకడు తెలుపవలసి వచ్చినయెడల ఆతడు, ‘‘అదియా, విశాలమగు నీటిపట్టు నీటి మయమగు పెద్ద తావు; అది యెటు చూచినను నీరే’’అని మాత్రమే చెప్పగలుగును గదా!
837. మానవులు పదే పదే పఠించుటచేతను వారి నోటినుండి వెలువడుట చేతను వేదములు, తంత్రములు, పురాణములు, మఱి రుూ లోకములోని మత గ్రంథములన్నియు ఉచ్ఛిష్టములైపోయినవని చెప్పవలసి యున్నది. కాని బ్రహ్మము మాత్రము అట్లు ఉచ్ఛిష్టము కాలేదు. ఏలన అది యిట్టిదని యింతవఱకెవ్వరును మాటలచే నిరూపింపజాలినది లేదు.
838. బ్రహ్మమనగా నెట్టిది? అది గుణరహితము, చలింపజేయరానిది, మేరుపర్వతమువలె సుస్థిరమైనది.
839. బ్రహ్మము అసంగము. పుణ్యపాపములు, సుఖదుఃఖములు మొదలగు సమస్త ద్వంద్వములకును బ్రహ్మము అతీతము. బ్రహ్మము దీపమువంటిది, దాని వెలుతురులో నీవు భాగవతమును జదువుకొనవచ్చును, దొంగ దస్తావేజులనుగూడ సృష్టింపవచ్చును. మఱియు బ్రహ్మము పామువంటిది. పాము కోఱలందు విషమున్నచో పామునకేమి బాధ? విషమువలన దానికి హానిలేదు, అది దానిని చంపదు. అది కఱచునట్టి జంతువులకు మాత్రమే విషము ప్రాణాంతిక మగును. ఇట్లే పామము, దుఃఖము మఱియు లోకమున మనకు గోచరించు సమస్తమైన దోషములును మనలను మాత్రమే బాధించును.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి