సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మము వీనికన్నింటికిని అతీతము. ప్రపంచమందలి కీడుమేళ్లు బ్రహ్మమునకు కీడుమేళ్లు కావు. మంచి చెడుగులకు సంబంధించు మనయొక్క నీతి నియమములను బ్రహ్మమునకు అనువర్తింపజేయజాలము, వానినిబట్టి బ్రహ్మము యొక్క స్వభావమును ఎంచదగదు.
840. జ్ఞానాజ్ఞానములు, పుణ్యపాపములు, ధర్మాధర్మములు- వీని కన్నిటికిని బ్రహ్మము అతీతము. అయ్యది సమస్త ద్వంద్వాతీతము.
841. బ్రహ్మము మనస్సునకును వాక్కునకును అందరానిది (అవాజ్మానసగోచరము); ధ్యాన ధారణాతీతము; తెలివి, తెలియువాడు, తెలియదగినది- అను నీ మూటికిని అతీతము; సదసత్తులకు రెంటికినిగూడ అతీతము; వేయేల, సమస్త ద్వంద్వములకును అతీతము.
842. సుగంధమును దుర్గంధమునుగూడ వహించుచు వానిచే కళంకితముకాని వాయువు వంటిది బ్రహ్మము.
843. బ్రహ్మము ఒక్కటియే సత్యము, నిత్యము. జీవజగత్తులు అసత్యము, అనిత్యము.
845. జగత్తు మాయయని చెప్పుట చాల సులభము. కాని నిజముగా దీనియర్థమేమో తెలియునా? కర్పూర నీరాజనము వెలుగగా, వెనుక నేమియు మిగులకుండుట వంటిది. ఇయ్యది కఱ్ఱ మండిన పిమ్మట బూడిదె మిగిలియుండుట వంటిది కూడ కాదు. సద సద్విచారము ముగియు, నిర్వికల్పసమాధి ప్రాప్తించునపుడు మాత్రమే ‘నీవు, నేను, జగత్తు’ అను స్ఫురణము సమసిపోవును.
846. శిష్యునకు బోధించుచు గురువు రెండువ్రేళ్లను ఎత్తిచూపెను,- బ్రహ్మము, మాయయునను ద్వంద్వము నాతడట్లు సూచించెను. అపుడు ఒక వేలు దింపి మాయ నివర్తించినంతనే జగత్తును నివర్తించుచున్నదని బోధించెను. ఉండునది బ్రహ్మమొక్కటియే.
847. అవ్యయము, అఖండమునగు బ్రహ్మము సమాధి స్థితియందు మాత్రమే గోచరించును. అపుడంతయు వౌనము- పద సత్తులు, జీవజగత్తులు, జ్ఞానాజ్ఞానములు- ఈ ద్వంద్వ సంబంధమైన ప్రస్తావమంతయు సమసిపోవును. అపుడు అస్తిత్వముదక్క మఱేమియు మిగులదు. ఉప్పుబొమ్మ అనంత సాగరమందైక్యమొందిన పిమ్మట దాని ప్రస్తావనమేది? బ్రహ్మజ్ఞానమనగా ఇటువంటిది.
848. ప్రశ్న: అఖండాత్మ తాను భిన్నభావమును బొంది ప్రత్యగాత్మగా భావించుకొను భ్రాంతి యెటుల జనించినది?
ఉ. కేవల తర్కముపై నాధారపడు సద్వైతి యుక్తులను నమ్ముకొనియున్నంతవఱకు ‘‘నే నెఱుగను’’అని యిందులకు సమాధానము చెప్పును. సాక్షాత్కార సమాధానమే యిందు తుది మాట- సరియైన సమాధానము. ‘‘నే నెఱుగుదును’’అని కాని, ‘‘ఎఱుగను’’ అని కాని చెప్పుచున్నంతవఱకు నిన్నునీవు ఒక వ్యక్తిగా భావించుకొనుచుందువు. ఆ స్థితిలో భేదమలు వాస్తవములనియే యంగీకరింపవలయును కాని భ్రాంతియని కొట్టివేయరాదు. వ్యక్తిత్వ భావన పూర్తిగా రూపుమాపినప్పుడు సమాధి స్థితిలో బ్రహ్మసాక్షాత్కారమగుచున్నది. అపుడే ‘‘జగత్తు సత్యమా? మాయయా?’’ అనునిట్టి సమస్యలన్నియు శాశ్వతముగా సమసిపోవును.
849. నీ వొక వ్యక్తివై యున్నంతవఱకు నీవు బ్రహ్మమను దానిలో జగత్తును, నిత్యమను దానిలో లీలయు, ద్రవ్యమను దానిలో గుణములును, నిర్గుణమనుదానిలో సగుణమును, ఏకమను దానిలో మఱియొకటియు ఇమిడియే యుండవలయును.
850. నీవు ద్వైతభావముతో నున్నంతవఱకు ‘వెన్న’ను ‘మజ్జిగ’ను గూడ (అనగా బ్రహ్మమును జగత్తును గూడ) అంగీకరింపవలసినదే.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి