సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకారదైవము ఘనీభవించిన సచ్చిదానంద రసమని చెప్పవచ్చును. జలాంతర్భూతమగు మంచుగడ్డ జలమున నిలిచియుండి పిమ్మట దానిలో కరగిపోవునటుల నిర్గుణ బ్రహ్మాంతర్భూతమగు సాకారదైవము బ్రహ్మమునుండియే వెలువడి, అందు నెలకొని యుండి, మఱల అందే లీనమై, అదృశ్యమైపోవును.
883. అగ్నికి ప్రత్యేక రూపము లేదు, కాని భగభగ మండు కట్టెలందది వివిధ రూపములను దాల్చుచున్నది. ఇట్లు నిరాకారాగ్ని సాకారముగా గాన్పించును. ఇట్లే నిరాకారబ్రహ్మము ప్రత్యేక రూపములను వహించుచుండును.
కొన్ని బ్రహ్మస్వరూపములు
884. భగవంతుడనేక రూపములనుదాల్చి ప్రసన్నుడగును.- ఒక్కొక్కప్పుడు మానవ రూపమునను ఒక్కొక్కప్పుడు చైతన్య రూపమునను ప్రసన్నుడగును. కాని భగవద్రూపములు యథార్థములని నమ్మవలయును.
885. సచ్చిదానందమయుడెట్టివాడో ఎవ్వరును చెప్పజాలరు. ఆతడు మొట్టమొదట అర్థనారీశ్వర రూపమునుదాల్చెను. ఇందులకు కారణమేమో తెలియునా?
ప్రకృతియు పురుషుడును తానేయని తెలుపుటకై సచ్చిదానందమయుడటులొనర్చెను. తన మహోన్నత స్థితినుండి కొంచెము క్రిందికిదిగి యాతడు అనేక పురుషులుగను ప్రకృతులుగను భాసించుచున్నాడు.
886. దూరమునుండి చూచునప్పుడు సముద్ర జలము వినీలమై కాన్పించును; కాని ఒక్కింత నీటిని పుడిసిటబట్టి చూచితిమా, ఏ రంగును లేక స్వచ్ఛముగానుండును. ఇట్లే శ్రీకృష్ణ్భగవానుడు దూరమునకు నీలవర్ణుడుగా గాన్పించును, కాని నిజముగా నాతడట్టివాడుకాడు. శ్రీకృష్ణ్భగవానుడు అకలంకుడు, వర్ణరహితుడు, శుద్ధబ్రహ్మము.
887. శ్రీకృష్ణునకు త్రిభంగనామము కలదు; త్రిభంగుడు అనగా మూడు వంపులు తిరిగినవాడనియర్థము. మెత్తని వస్తువు మాత్రమే యిట్లు వంపగలదు. కాబట్టి శ్రీకృష్ణుని రుూ రూపము ఆతడే కారణముచేతనో మెత్తబడెనని తెలుపుచున్నది. ఈ మెత్తదనమునకు ప్రేమయే కారణమందురు.
888. ఒక భక్తుడు: జగజ్జనని యోగమాయయందురేల?
శ్రీగురుదేవుడు: యోగమాయయనగా ప్రకృతి పురుషుల సంయోగమన్నమాట. లోకమున నీకు గోచరించు సర్వము ఈ ప్రకృతి పురుష సంయోగమేకాని మఱియొకటి కాదు. కాళిశివునిపై నిలువబడి యుండు శివకాళీ విగ్రహమును నీవు చూడలేదా? శివుడందు శవమువలె- అచలుడై- పడియుండ, కాళి వానిని తదేకముగా లక్షించుచు నిలువబడి యుండును, దీనికంతటికిని ప్రకృతి పురుష సంయోగమనియేయర్థము. పురుషుడు అకర్త, అచలుడు; కావుననే శివుడు శవమువలె అచలుడై పడియున్నాడు. కాని వానితోడి సంయోగ ప్రభావముచేతనే ప్రకృతి సృష్టి స్థితిలయములను సర్వము చేయుచున్నది. రాధాకృష్ణ విగ్రహమునకుగూడ నిదియే యర్థము.
889. భగవంతుని నీవు సమీపించిన కొలదియు వాని వైభవాతిశయము వెనుకబడుచున్నట్లు గోచరించును. పది తలలతోగూడిన జగదీశ్వరి (దుర్గాదేవి) మొట్టమొదట సాధకుడు దర్శించునట్టి దివ్యరూపము. ఆ రూపమున దివ్యశక్తియు వైభవమును విశేషముగా ప్రకాశించుచుండును. పిమ్మట నామె రెండు చేతులతో ప్రత్యక్షమగును. వివిధాయుధములతో గూడిన ఇరువది చేతులును ఇక నందు గాన్పింపవు. పిమ్మట లభించునది గోపాలరూప సాక్షాత్కారము. ఇందు శక్తియ వైభవాతిశయమును ఎంత మాత్రము గోచరింపవు: ఇయ్యది కేవలము ముగ్ధుడగు పసిబాలుని రూపము. ఇంతకంటెను ఉత్తమ సాక్షాత్కారముగలదు- అదియే పరంజ్యోతి యొక్క సాక్షాత్కారము.
890. భగవంతుడందఱయందును గలడు, కాని యందఱును భగవంతుని యందు లేరు, అందుచేతనే వారు బాధపడుచున్నారు.
891. సర్వము నారాయణుడే. మానవుడు నారాయణుడు. మృగము నారాయణుడు, మహర్షి నారాయణుడు, మోసగాడు కూడ నారాయణుడే, ఉన్నదంతయు నారాయణుడే.

- ఇంకాఉంది