సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సాధువు జనాకీర్ణమైన వీధినుండి పోవుచు, పొరపాటున ఒక దుష్టుని కాలి వ్రేలిని త్రొక్కెను. ఆ దుష్టుడు కోపావేశపరవశుడై సాధువును స్మృతి తప్పి పడిపోవునటుల నిర్దయుడై మోదెను. ఆ సాధువు శిష్యులు అనేకోపచారములు సలిపి యాతనికి స్మృతిగలిగించుటకై చాల శ్రమపడిరి.
కొంచెము స్మృతి వచ్చుచుండుట గాంచి వారిలో నొకడాతని నిట్లు ప్రశ్నించెను: ‘‘స్వామీ! మీకు ఈ యుపచారములు చేయునదెవరో గుర్తింపగలరా?’’ ‘‘ఆహా! నన్ను కొట్టినయతడే. (పరమాత్మయే.) సందేహమేమి?’’అని సాధువు సమాధానించెను. నిజమైన సాధువునకు శత్రువని, మిత్రుడని భేదభావము ఉండదు.
969. బ్రహ్మసాక్షాత్కారము నొందినవాడు, ‘ఇది శౌచము, ఇది యశోచము’ నను భేదభావములేక యొకప్పుడు పిచ్చివానివలెను మఱియొకప్పుడు పిశాచమువలెను సంచరించుచుండును; బాహ్యాభ్యంతరములందంతటను బ్రహ్మమును గాంచుచు, ఒకప్పుడు స్థాణువువలె నిశే్చష్టుడై యూరకుండును; ఒక్కొక్కప్పుడు పసివానివలె బట్టలను చంకను బెట్టుకొని తిరుగులాడుచు దేనియందును అసక్తుడు గాకుండును; కాని పరహితార్థమై కృషిచేయునపుడాతడు సింహపరాక్రముడై యొప్పును.
970. సమాధి స్థితిని బొందిన వెనుక సర్వకర్మములును తొలగిపోవును- బాహ్యపూజలు, తావళముతో జపించుట, లౌకిక కార్యములు మొదలగునవన్నియు తొలగిపోవును. ప్రారంభ దశలో కర్మాడంబరము విశేషముగా నుండును. కాని భగవత్సాన్నిధ్యమును బొందినకొలదియు ఈ గందరగోళము తగ్గిపోవును; తుదకు ప్రార్థన, భగవన్నామ సంకీర్తనమునుగూడ అంతరించును. (సాధారణ బ్రాహ్మసామాజికుడగు శ్రీ శివనాథశాస్ర్తీని సంబోధించుచు): (సభ జరుగునపుడు) మీరు సభకు రాకుండునంతవఱకు మీ గుణగణములను గూర్చియు, పేరుప్రతిష్టలను గూర్చియు సభ్యులు చెప్పుకొనుచుందురు; కాని మీరు లోనికి వచ్చినంతనే ఆ ప్రసంగములన్నియు కట్టువడును. అందఱును మిమ్ములను జూచి యానందముతో, ‘‘ఇదిగో, శివనాథబాబు వచ్చుచున్నారు’’అని మాత్రమే పలుకుదురు- తదితర ప్రసంగములన్నియు అంతరించును.
971. క్రొత్తగా కాపురమునకు వచ్చిన యువతి గృహకృత్యములలో మునిగితేలుచుండును- కాని యిదియంతయు నామెకు బిడ్డపుట్టువఱకే. బిడ్డ పుట్టినంతనే ఆమె సామాన్య గృహకృత్యములను విడిచివేయ నారంభించును- వానియందామెకు ఉత్సాహము ఉండదు. అందులకు బదులు ఆమె తన బిడ్డను దినమంతయు లాలనచేయుచు, ఆనందముతో ఎత్తుకొని ముద్దులాడుచుండును. ఇదే తీరున అజ్ఞాన దశలో నున్నంతవఱకు నరుడు నానావిధ కర్మములను జేయుచు తీఱికయనునది లేకుండును. తన హృదయమున భగవంతుని యునికిని గాంచినంతనే వానికిక కర్మకలాపమున రుచితగ్గిపోవును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి