సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱియొకనాడు నేను బండి యెక్కి ‘మేచాబజారు’నుండి పోవుచుండ అమ్మ ‘షోకుగా’ వేషము వేసికొని జనులను మోహింపజేయుటకై సంసిద్ధమై సుందరివలె గాన్పించినది. నుదుట కస్తూరీ తిలకమును, తలలో సవరమును ధరించి యామె విలాసముగా హుక్కా పట్టుచుండెను. ‘‘అమ్మా! ఈ రూపమును గూడ నీ వెన్నుకొంటావా!’’అని నేనాశ్చర్యముతో లోకేశ్వరినడిగి యామెకు సాష్టాంగ ప్రణామమాచరించితిని.
1002. బ్రహ్మమును ప్రత్యక్ష సత్యముగా, నా కన్నులార చూచుచుండగా నేనిక తర్కించుటెందులకు? అఖండబ్రహ్మమే మన చుట్టునున్న సర్వము నైయున్నదని నేను స్వయముగ జూచుచున్నాను; బ్రహ్మమే ప్రత్యగాత్మగను దృశ్యప్రపంచముగను గూడ గోచరించుచున్నది! ఈ సత్యమును గనుటకు ఎవ్వనికైనను ఆత్మప్రబోధము కలుగవలయును. బ్రహ్మమును ఏకైక సత్యముగా గాంచునంతవఱకు, ‘‘నేతి, నేతి-ఇది కాదు, ఇది కాదు’’ అని వివేచన చేయుచుండవలయును. ‘‘బ్రహ్మమే ఈ సర్వమునై యున్నదని నేను నిస్సందేహముగా గ్రహించినాను’’అని కేవలము చెప్పుట చాలదు, చాలదు (అది వాచావేదాంతము). దైవానుగ్రహమువలన ఆత్మప్రబోధము కలుగవలయును. ఆత్మప్రబోధము వెనువెంటనే సమాధి దశ ప్రాప్తించును. ఈ దశలో శరీరస్పృహయే లేకుండును; ప్రాపంచిక విషయములయందు- అనగా కామినీ కాంచనములందు- రాగము నశించును; భగవదితర విషయములను వినుటకు మనసొప్పదు; లౌకిక విషయములను వినవలసి వచ్చిన పక్షమున చాల వెగటుగ తోచును-బాధగా తోచును. ఆత్మప్రబోధము కలిగినంతనే పరమాత్మను దర్శించుటయే పై మెట్టు. ఆత్మదర్శనమును జేయునది ఆత్మయే.
1003. నరునందు నారాయణునిగాంచునప్పుడే సంపూర్ణ జ్ఞానము కలుగునని వైష్ణవ చరణుని వలన అనేక సంవత్సరముల క్రితమే వింటిని. నారాయణుడే వివిధ రూపములతో- ఇపుడు పెద్దమనుష్యునివలెను, మఱియొకప్పుడు పరమ దుర్మార్గునివలెను, ఇపుడు యోగ్యునివలెను, మఱియొకప్పుడు వట్టి తుంటరివలెను- క్రీడించుచున్నాడని నాకిపుడు ప్రత్యక్షముగ గాన్పించుచున్నది. కాబట్టి, ‘‘పెద్ద మనుష్యుడైయున్న నారాయణుడు, పంచకుని రూపముననున్న నారాయణుడు, పాపియైయున్న నారాయణుడు, పోకిరి రూపముననున్న నారాయణుడు’’ అని చెప్పుచుందును. ఇపుడు వీరందఱను సంతుష్టిపరచుట యెట్లనునది నాకున్న సమస్య. అన్నపానీయాదులచే అందఱను సంతృప్తులను జేయుటయే నా యిచ్ఛ. అందుచే ఒకసారి యొక్కని నాయొద్దనుంచుకొని వానిని సంతుష్టుని జేయుచుందును.
1004. కులీనురాలును సుశీలవ్రతయునగు స్ర్తిని గాంచినప్పుడు పవిత్రతా రూపమున నిరాడంబర వేషమును దాల్చిన జగజ్జననియే నాకామెయందు గోచరించును;

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
- ఇంకాఉంది