సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి రాజు తనకడకు రండని వారికి గబురుచేయగా, ‘‘రాజునే యిక్కడకు రమ్మనుడు’’అని జవాబు చెప్పిరి. కాని తరువాత వారు పెండ్లిండ్లు చేసికొనసాగిరి. అంత నిక రాజునకు వారిని బిలువనంపవలసిన యగత్యమే లేకుండబోయినది! వారు తమంతతామేపోయి, ‘‘మహారాజా! ప్రభూ! మిమ్ము దీవింపవచ్చితిమి. మీకొఱకై దేవాలయమునుండి ప్రసాదమును దెచ్చితిమి; స్వీకరింపుడు’’అని వేడుకొనువారు. వారటుల జేయక తప్పినది కాదు. పాపము. ఆ నిర్భాగ్యులేమి చేయగలరు? ఒకనాడు ఇల్లుకట్టుకొను నక్కఱ, మఱియొకనాడు పిల్లలకు అన్నప్రాశనము చేయు ముచ్చట, ఇంకొకనాడు కుమార్తెలకు పెండ్లిండ్లు- ఇట్లు అడుగడుగునను ఆవశ్యకములే ఆయెను! వీనికై డబ్బు కావలయునుగదా! అందులకై రాజుగారిని యాచింపక తప్పదాయెను! ఒరుల యొద్ద సేవ చేయుచు మీరెట్టి నీచస్థితిలోనున్నారో మీయంతట మీకే తెలియగలదు. పాశ్చాత్యపద్ధతి ప్రకారము బాగుగా విద్య నేర్చిన మీ యువకులు- మీ యాంగ్ల విద్యాపండితులు- నోరెత్తకుండ అధికారులచే తన్నులు తినుచున్నారు! ఈ యవమానములకును ఈ బానిసత్వమునకును మూలకారణమేమో తెలియునా? ‘కామిని’- కామినీ వ్యామోహము.
ఉద్యోగ సంపాదనము
1069. ఒక పేదవాడు ఉద్యోగము దొరకక చాలా బాధ పడుచుండెను. అనేక పర్యాయములొక ఆఫీసునకు బోయి అచటి పెద్ద గుమాస్తాను (లేక కార్యనిర్వాహకుని) దర్శించి పడిగాపులు పడియుండి, ఏదేని ఉద్యోగము నొసగుడని వేడుకొనెను. ఉన్నదని కాని, లేదనికాని ఖండితముగా జెప్పక యాతడు ‘‘ఈదినము కాదు, రేపు రమ్ము’’, ‘నన్నప్పుడప్పుడు చూచుచుండుము’’ అనుచునే కాలము గడుపుచుండెను. ఈ విధముగా జాలదినములు గడచిపోయినవి. ఒకనాడా పేదవాడు తన బాధలను గురించి ఒక స్నేహితునితో జెప్పుకొనెను. ఆ స్నేహితుడు వెంటనే, ‘‘నీవెంత తెలివితక్కువవాడవు! ఆ నిర్భాగ్యుని దర్శించి దర్శించి నీ కాళ్లు అరిగిపోయి యుండును. గోపమ్మ దగ్గరకు బోయి దానిని బతిమాలుకో. నా మాట నమ్ము. రేపే నీకు ఉద్యోగము దొరకును అని యుపాయము చెప్పెను. ఆ పేదవాడు అమితాశ్చర్యముతో, ‘‘అటులనా, ఇప్పుడే పోయి యామె కాళ్లమీద బడుదును’’ అనెను. గోపమ్మ ఆ ఉద్యోగస్థుని యంపుడుకత్తె. ఆ బీదవాడామెయొద్దకుబోయి, ‘‘అమ్మా! నేను చాలా దుర్దశలో ఉన్నాను. నీవు తప్ప నన్ను రక్షించువారు లేరు. నేను బ్రాహ్మణుడను. నాకితరమగు నాధారము లేదు. అమ్మా! చాలాకాలమునుండి ఉద్యోగము లేక బాధపడుచున్నాను. ఆలుబిడ్డలు ‘అన్నమో రామచంద్రా!’ అని పలవించుచున్నారు. నీ వొక్కమాట చెప్పితివా, నాకు ఉద్యోగము లభింపగలదు. ఈ పుణ్యము గట్టుకొనుము అని బతిమాలుకొనెను. గోపమ్మ యిట్లనెను: ‘‘సరే కాని, ఎవరితో జెప్పిన, కార్యము సానుకూలమగును?’’

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి