సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సాలె తాను నేసిన వస్తమ్రుల నమ్ముకొనుటకై బజారునకు బోయి, కొనవచ్చిన వారితో నిట్లు పలుకువాడు: ‘రామేచ్ఛ వలన లాభము బేడ; రామేచ్ఛవలన ఈ బట్ట ఖరీదిప్పుడు రూపాయి ఆరణాలు.’’ జనులాతడేమి వెల చెప్పినను వెంటనే యిచ్చి కొనునంతటి విశ్వాస మాతనియందు గలిగి యుండిరి. నిజముగా నాతడు గొప్ప భక్తుడు. రాత్రులందు భోజనానంతరము భగవంతుని ధ్యానించుచు చాలసేపు భగవనానంతరము భగవంతుని ధ్యానించుచు చాలసేపు భగవన్నామస్మరణ చేయుచుండువాడు.
ఒకనాడు రాత్రి చాల ప్రొద్దుపోయినది. ఆతడింకను నిద్రపోలేదు. చావడిలో ద్వారముకడ గూర్చుండి చుట్టకాల్చుకొనుచు నేకాంతముగా నుండెను. ఒక దొంగల గుంపాత్రోవను బోవుచుండెను. వారికొక మూటలు మోయువాడు కావలసివచ్చెను. ఈసారెవానిని జూడగనే వారీతని లాగికొనిపోయిరి. అనంతరము వారొక యింటిలో జొరబడి చాల సొత్తును దొంగలించిరి; దానిలో గొంత రుూసాలెవాని నెత్తిని బెట్టి మోయుమనిరి. ఇంతలో బోలీసువాడొక డాత్రోవను రాగా దొంగలు పాఱిపోయిరి. నెత్తిని దొంగసొత్తు మోయుచున్న మన సాలెవాడు పట్టువడెను. ఆ రాత్రి యతడు చెఱసాలలో గడపవలి వచ్చెను. మఱునాటియుదయము న్యాయాధికారి యెదుట విచారణకై యాతడు తీసికొని రాబడెను. జరిగిన సంగతిని విని గ్రామస్థులందరును సాలెవానిని జూడవచ్చిరి. వారందఱును న్యాయధికారితో, ‘అయ్యా, ఇతడమాయకుడు, దొంగతనము చేయజాలడు’’ అని యేకగ్రీవముగా జెప్పిరి. అంతట న్యాయాధికారి, ‘‘జరిగినదేమొ చెప్పు’మని సాలెవాని నడిగెను. సాలె యిట్లు పలికెను. ‘‘అయ్యా, రామునియిచ్ఛవలన నేను చావడిలో గూర్చుండి యుంటిని. రామేచ్ఛవలన రాత్రి చాల ప్రొద్దుపోయినది. రామేచ్ఛవలన నేను ధ్యానము చేయుచు వాని పవిత్ర నామమును స్మరించుచుంటిని. రామేచ్ఛవలన దొంగ లావైపు నచ్చి నన్ను దమతో నీడ్చుకొనిపోయిరి. రామేచ్ఛవలన వారొక యింట గన్నమువేసి దొంగలించిన సొత్తును గొంతనానెత్తిని బెట్టిరి. రామేచ్ఛవలన బోలీసువారు నన్ను బట్టుకొని చెఱలోనుంచిరి. రామేచ్ఛవలన నేలిన వారి సన్నిధికి నేటియుదయము విచారణకై తీసికొని రాబడితిని.’’ న్యాయాధిపతి వాని నిష్కాపట్యమును పారమార్థిక చింతను జూచి వెంటనే విడిచి పెట్టెను. బయటికి వచ్చి మిత్రులతో నాతడు, ‘‘రామేచ్ఛ వలన నేను బంధవిముక్తుడనైతిని’’ అని పల్కెను.
నీవు సంసారమును నుండుటకాని సంసారమును త్యజించుట కాని- సర్వము రామేచ్ఛపై నాధారపడియున్నది. కాబట్టి సమస్తమైన భారము ఆ భగవంతుని మీదనే వైచి నీ విహిత కర్మములను నిర్వర్తింపుము.
సాధువేషముచే సాధువైన దొంగ
1097. ఒక దొంగ నడిరేయిని రాజాంతఃపురమున బ్రవేశించినాడు. రాజు తనకుమార్తెను నదీ తీరముననుండు సాధువులలో నొకనికిచ్చి పెండ్లి చేయుదునని రాణితో జెప్పుచుండగా (దొంగ) వినినాడు. విని తనలో తానిట్లనుకొనినాడు: ‘‘ఆహా! నాయదృష్టము పండినది! రేపు నేను సాధువేషము వేసికొని యేటికడనున్న సాధువుల మధ్య గూర్చుందును. ఏమో, రాజు తన కుమార్తెను నాకే రుూయగూడదా?- ఎవరు చెప్పగలరు?’’ మఱునాడు వాడటులనే చేసినాడు.

- ఇంకాఉంది