సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశములో నొకప్పుడు గొప్ప అనావృష్టి బాధ సంభవించినది. వ్యవసాయులందఱును దమ పొలములకు గాలువలు త్రవ్వి నీరు పెట్టుకొనుటకై తీవ్ర ప్రయత్నములు చేయుచుండిరి. వారిలో నొకడు, గట్టి పట్టుదలగలవాడు, తన కాలువ నేటితో గలుపువఱకు నాగకుండ ద్రవ్వనిశ్చయించుకొనెను. స్నానమునకును భోజనమునకును వేళయైనను నాతడు లక్ష్యపెట్టక యదేపనిగా ద్రవ్వుచుండెను. అంత వాని భార్య కొమార్తె చేతికిచ్చి స్నానమునకై నూనె పంపినది. కూతురు వచ్చి, ‘‘నాన్నా! మిట్ట మధ్యాహ్నమైనది. ఇదిగో చమురు, స్నానము చేయుము, రమ్ము’’ అని బతిమాలుకొనెను. ‘‘ఉండు, నాకింకను బనియున్నది’’ అని తండ్రి బదులు చెప్పెను. రెండుగంటలు దాటినను నాతడు స్నానము మాట కాని, భోజనము మాట గాని తలపెట్టడాయెను. తుదకు వాని భార్యయే పొలమునకు వచ్చి, ‘‘ఏల మీరింకను స్నానము చేయుటకు రారైతిరి? అన్నము చల్లాఱిపోవుచున్నది. మీ కెప్పుడును వేలము వెఱ్ఱియే. చాలును, ఇప్పుడైనను రండు, భోజనము చేసిన తరువాతనో, రేపో మిగిలిన పని జూచుకోవచ్చును’’ అనెను. కాలరుద్రుడై యాతడు తిట్టుచు, పాఱచేత బుచ్చుకొని యామెను దఱిమి వేయసాగెను. ‘‘ఓసీ! బుద్ధిహీనురాలా! చేనెండిపోవుచున్నది. మీరిక పస్తుండి చావవలసి వచ్చును. కండ్లగపడుక లేదా? నేనీనాడు చేనికి నీరెక్కించి తీరవలెను. అటుపిమ్మటనే మఱే పనియైనను-ఏయాలోచనైనను!’’ అని యాతడఱచెను. వాని యాగ్రహమును గాంచి యామె పరుగెత్తుకొని పోయెను. భగీరథ ప్రయత్నముచేసి తుట్టతుదకు, అర్ధరాత్రివేళ కతడు తన పంతము నెగ్గించుకొనగలిగినాడు. ఏటినీరు గలగలలాడుచు తన పోలములోనికి ప్రవహించుట జూడ వాని యానందమునకు మేర లేకుండెను; అనంతర మాతడింకిబోయి, స్నానము చేయుటకై భార్యను చమురు తెమ్మనెను. స్నానమును భోజనమును ఐన పిమ్మట సుఖముగా నాతడు గుఱ్ఱువెట్టి నిద్రించినాడు. ఇటువంటి స్థిర సంకల్పము తీవ్ర వైరాగ్యమునకు లక్షణము.
మఱియొక వ్యవసాయియును అదే పనియందు నిమగ్నుడైయుండెను. కాని వాని భార్య వచ్చి, యింటికి రమ్మనగానె పాఱ భుజమున బెట్టుకొని, ‘‘సరి, నీవు వచ్చి పిలిచినప్పుడు నేను రావలయునుగదా’’ అని మాఱు మాటాడక యామెను వెంబడించినాడు. అతడు సకాలమున బొలమునకు నీరు పెట్టుకొనలేకపోయినాడు. మందవైరాగ్యమనగా, సోమరి తనమనగా ఇటువంటిది.
దృఢ సంకల్పము లేనిదే పొలమునకు నీరు పెట్టుకొనుట సాధ్యముకానియట్లు తీవ్రపరితాపము లేనిదే పరమానంద ప్రదమగు బ్రహ్మసాక్షాత్కారమెవ్వనికిని లభ్యము కానేరదు.
సాధువువలె నటించిన పల్లెవాడు
1103. ఒకప్పుడొక పల్లెవాడు రాత్రివేళ రహస్యముగా నొక పెద్దమనుష్యుని తోటలో బ్రవేశించి యందలి దొరువులో చేపలు పట్టసాగెను. యజమానుడెట్లో యాసంగతి తెలిసికొని తోటచుట్టును తన సేవకులను గావుంచి, దివిటీలు వేయించుకొని దొంగను బట్టుకొనుటకై తోటలో ప్రవేశించెను. ఇంతలో ఆ పల్లెవాడు, తప్పించుకొను తెరవుగానక, ఒడలెల్ల బూడిదె పూసికొని సాధువువలె ఒక చెట్టుక్రింద గూర్చుండెను. అంత జనులు వచ్చి చూడగా వారికెచ్చటను దొంగ కానరాలేదు కాని భస్మధారియై చెట్టుక్రింద ధ్యాననిమగ్నుడై యున్నటుల తోచు సాధువు కానవచ్చెను.

- ఇంకాఉంది