సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకుంఠం
భగవంతుని నివాసం వైకుంఠమనీ, కైవల్యమనీ, కైలాసమనీ, స్వర్గమనీ- అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ కేవలం భ్రాంతులే. భగవంతుని స్వస్థానం ఏమిటి? ‘మద్భక్తః యత్ర గాయన్తి. తత్ర తిష్ఠామి నారద!’ (నా భక్తులు ననె్నక్కడ గానం చేస్తుంటారో నేనక్కడ వుంటాను.) అన్నాడుగదా పరమాత్మ. భక్తునియొక్క హృదయమే ఆయన హెడ్ క్వార్టర్స్. మిగతావన్నీ బ్రాంచీలే. కైలాసం, వైకుంఠం ఇవన్నీ బ్రాంచిలే. ‘ఓ కైలాసవాసీ!’అని ప్రార్ధిస్తే ఆ కైలాసవాసికి చేరుతుందో లేదో కాని ‘హృదయవాసీ!’అంటే వెంటనే చేరుతుంది. నిస్సందేహంగా చేరుతుంది. భగవంతుడు ఉండేటటువంటిది వైకుంఠము. అనగా కుంఠితము కానటువంటిది. మార్పు చెందనటువంటిది వైకుంఠము. హృదయము మార్పు చెందేటటువంటిది కాదు. మనిషి ఎంతైనా మార్పుచెందవచ్చు. మనసులు మారవచ్చు. భావములు మారవచ్చు. హృదయం మాత్రం మార్పు చెందదు. అట్టి నిర్గుణ నిరంతరమైనటువంటి తత్త్వమే భగవంతుని నివాసము. అదే వైకుంఠము.
ద్వారకానాథ?
మీకు తెలిసినా తెలియకపోయినా నేను మీ అందరిలోనూ వున్నాను.
తనను నిండు సభలో కౌరవులవమానించినప్పడు ద్రౌపది ‘ద్వారకానాథా! రక్షించు!’అని మొరబెట్టుకుంది. కృష్ణుడు ఎక్కడో ద్వారకలో లేడు. ఆమె హృదయంలోనే వున్నాడు. తన భక్తురాలు ‘ద్వారకానాథ!’ అన్నది కనుక ఆమె మాటకోసం ఆయన ముందు ద్వారకకు వెళ్లి, అక్కడి నుంచి హస్తినాపురంలోవున్న ద్రౌపది వద్దకు వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆమెను ఆదుకోడం కొంచెం ఆలస్యమైంది. ద్రౌపది ‘ద్వారకానాథా!’అనకుండా ‘హృదయవాసా’అనుంటే మరుక్షణమే కృష్ణుడువచ్చి ఆమె నాదుకొనేవాడు!
ఏకాదశి
ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి అనగా కేవలం నెలకు రెండుసార్లు వచ్చే పవిత్రమైన కాలమని మాత్రమే భావించరాదు. అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, ఒక మనసు ఈ పదకొండు తత్త్వములతో కూడినటువంటిదే ‘ఏకాదశి రుద్ర స్వరూపము’.
భగవదిచ్ఛ
శ్రీకృష్ణ జననంకాగానే తండ్రి వసుదేవుని సంకెళ్ళు వాటంతట అవే వూడి కిందపడ్డాయి. జైలు తలుపులు వాటంతట అవే తెరచుకున్నాయి. కాపలా భటులు మైమరచి పడుకున్నారు. చీకట్లను చీల్చుకొంటూ, అద్భుత జ్ఞానకాంతులు విరిశాయి. దుమ్ము అణగిపోయేటట్లుగా, కలాపి చల్లినట్లు, ఆకాశం నుంచి సన్న చినుకులుపడ్డాయి.
అదంతా భగవదిచ్ఛ! ఆయనను కాదని ప్రకృతి నడుస్తుందా? నిలుస్తుందా?
ఏనాడు ఏ తీరో?
పాండవ సోదరులు ఎంతో అదృష్టవంతులు. ధర్మజుడు చక్రవర్తి అయాడు. భీమునికి అజేయమైన గదా దండం లభించింది. అర్జునుడు దేవేంద్ర తనయుడు. ఆయనకు సాక్షాత్తు భగవంతుడే సారథిగా పనిచేసేందుకు వొప్పుకున్నాడు. ఏం లాభం? అన్నివిధాల కాలం కలిసివచ్చినా, పాండవులు అనేక కష్టాలుపడ్డారు. దుర్భరమైన అవమానాలకు గురయ్యారు.
దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి? ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పగలరు. అనుభవించుట సిద్ధమన్నా!’అనేదే! భగవదిచ్ఛ ఎలావుంటే అలా జరుగుతుంది! తప్పించుకోవటం ఎవరి తరం?
అనాథ!
నీ ఆవేశకావేశాలను అదుపుచేసికో- నీ ఆధ్యాత్మిక సాధనలభారం భగవాన్ వహిస్తాడు. కాస్త ఓపిక పట్టాలి.
‘నాకు నాథుడు లేడు, రక్షకుడు లేడు’అనుకోవద్దు. ‘అనాథ’ ఎవరన్నా వుంటే అది భగవంతుడే. అందరికీ ఆయనే నాథుడు. ఆయనకు నాథుడెవరు?
ఆయన ఎక్కడో లేడు. నీలోనే వున్నాడు. మంచీ, చెడూ నీకనుక్షణం తెలియజెప్పే అంతరాత్మరూపంలో, నీకు తోడునీడగా వున్నాడు.
‘అంతా ఆయనే చేశాడు’అని చివరకు నింద భగవంతుడిపై వేయకు. అంతా బాగా జరుగుతున్నంత సేపూ ‘్భగవంతుడు నావెంటేవున్నా’డంటావు. కాస్త ఏదైనా పెడ తిరిగితే, దేవుడు నన్నొదిలేశాడంటావు. ఆయన అలా కాసేపు దగ్గరగా, కాసేపు దూరం జరిగేవాడు కాదు. నీవాయనకు ఎంత దూరంలో వుంటావో, ఆయన నీకూ అంతే దూరంలో వుంటాడు. గ్రహించు. కీర్తించు. ఆయన నీ ఆత్మే-కఠినుడూ కాడు, మెతకా కాదు- ‘తత్ త్వం అసి’.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల - కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది