సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి గోడలు ఇవా?
ఇంట్లో పెద్దలకు దైవభక్తి లేదు. ఇంటి గోడల నిండా అందమైన స్ర్తిల చిత్రాలుండే క్యాలండర్లు తగిలిస్తారు. ఇంటిలోవారి మధ్య గొడవలు, పరస్పరం అనుమానాలు, ఆశ, లోభం తాండవిస్తుంటాయి. ఆ వాతావరణంలో పెరిగే పిల్లలకు హాయి, ఆరోగ్యం, మంచి మానసిక స్థితి కలగటం ఎలా? పిల్లలకు చూపించే సినిమాల నిండా కొట్లాటలు, హింస, రక్తపాతం, కుట్రలూ, కుతంత్రాలూ వుంటాయి. వాటిని చూసేవారిలో సానుభూతి, ప్రేమ ఎలా అంకురిస్తాయి?
సాయి సంకల్పం
సాయి అభిప్రాయం యువత ఆలోచనలనూ, ధోరణులనూ సరియైన పంథాలో తీర్చిదిద్దటమే. భారత ప్రగతికోసం, సంక్షేమంకోసం వారు కృషిచేసేలా చేయాలనే. విద్యార్థులే నా ఏకైక సంపద. నా ఆశలన్నీ వారిపైనే వున్నాయి. వారిని సంస్కరించి, సత్ప్రవర్తనకు తార్కాణంగా వారిని తీర్చిదిద్దాలనేదే సాయి సంకల్పం. ఇదే పదే పదే నే చెప్పే మాట.
శాస్త్రం సంగతి
నీవు నడిచే దారిలోవున్న అడ్డంకులను గురించి శాస్త్రాలు వివరిస్తాయి. ఇబ్బందులలో వున్నప్పుడు నీకు ఊరటనిస్తాయి. నైతికంగా సంశయంలో పడినప్పుడు, నీ కర్తవ్యాన్ని బోధిస్తాయి. నీవెలా నడుచుకోవాలి, నీ కట్టూబొట్టూ ఏమిటి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలామెలగాలి, పరస్పరం ఎలా సామరస్యంతో వ్యవహరించాలి- ఇవన్నీ శాస్త్రాలు నీకు తెలియజేస్తాయి. అందుకే శాస్త్ర జ్ఞానం అవసరం.
నీ బాగు చూసుకో
మనిషి రోజురోజుకూ ఆశ పాతకుడవుతున్నాడు. వారి సంగతీ, వీరి సంగతీ చెప్పుకోటంలో సరిపోతోంది. ఇంకొకళ్ల విషయాలలో ఆసక్తి చూపుతున్నాడే గాని తన సంగతి పట్టించుకోడం లేదు. తానెలా బాగుపడాలో యోచించుకోడం లేదు.
నీలో ఏముంది?
వేదాలను అధ్యయనం చేయటం ఉన్నతమైన విద్య. అంతకన్న మించిన చదువులేదు. వేదం మృత్యువును జయించటం ఎలాగో చెబుతుంది. జనన, మరణ చక్రంనుంచి బయటపడే మార్గాన్ని చెప్పేది వేదం. నీవెవరవో తెలుసుకునేందుకు అంతర్ముఖుడిని చేస్తుంది వేదం. మిగతా చదువులన్నీ పొట్టకూటికే. ఎలా సంపాదించాలో, ఎలా ఖర్చుపెట్టాలో, జమాఖర్చు లెక్కలురాసి పెట్టుకోటం, ఒక ట్రిక్కుచేసి కాస్త సంబరపడటం, మరో ట్రిక్కుచేసి కాస్త అపనయించుకోడం యిలాటివి నేర్పుతాయి అవి.
వేదాలు అలాకాదు. అమృతపథాన్ని చూపుతాయి. జనం చైనా గురించీ, రష్యా గురించీ, అమెరికా గురించీ చదువుకుంటారు. పసిఫిక్ సముద్రంలో ఉన్న అగ్నిపర్వతాల గురించీ, ఆర్కిటిక్ ప్రాంతంలో ద్వీపాల గురించీ వారికి తెలుసు. కాని తమ అంతఃకరణలో ఏం వుందీ- తానెవరోనన్న సంగతీ యిసుమంత కూడా తెలియదు.
సంస్కరణ
దేశమంటే మట్టికాదు. దేశాభివృద్ధి అంటే దేశంలోవుండే ప్రజల అభివృద్ధి అని అర్థం. ప్రజలను సంస్కరించి మంచి మార్గంలోకి నడిపే ఉత్సాహం ఎక్కువగా విద్యార్థులలో కనిపిస్తుంది. అందుకు వారికి ప్రోత్సాహం యివ్వాలి. సంస్కరణ అంటే చెడుపనులనూ, చెడు అలవాట్లనూ మాన్పించి మంచి పనులనూ, మంచి అలవాట్లనూ నేర్పటం. తననుతాను సంస్కరించుకోటంలోనే ఒక మనిషి విలువ తెలుస్తుంది. అతని విలువ పెరుగుతుంది.
ప్రస్తుతం ప్రజలను ప్రభుత్వం సంస్కరించ లేకపోతోంది. ప్రభుత్వాన్ని ప్రజలూ సంస్కరించలేకపోతున్నారు. ఇదొక అవాంఛనీయ పరిణామం.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది