సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు మారాలి
మీరందరూ మంచిబుద్ధితో, మంచి మనసుతో జీవించాలి. మంచి మనసు అంటే ఏమిటి? శాంతముతో కూడిన మనసు, ప్రేమతో కూడిన మనసు, దయతో కూడిన మనసు. బుద్ధుడు ఒకసారి శవాన్ని చూచాడు. మరొకసారి వృద్ధుణ్ణి చూచాడు. ఇంకొకసారి రోగిష్టిని చూచాడు. అతని మనసు మారిపోయింది. బుద్ధుడయినాడు.
ఈనాడు మనం అనేక శవాలను చూస్తున్నాం, రోగిష్టులను చూస్తున్నాం, వృద్ధులను చూస్తున్నాం, కాని మన మనస్సులు మాత్రం మారటంలేదు. మారాలి. పరివర్తన రావాలి. అప్పుడే నీవు మహనీయుడవవుతావు.
మాధవకర్మ ఏది?
భగవంతుని వేపు వెళ్లేదారిలో చాలా ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రహ్లాదుడు తండ్రికి ఎదురుచెప్పవలసి వచ్చింది. విభీషణుడు తన అన్న కెదురు తిరగవలసి వచ్చింది. పరశురాముడు తన తల్లినే వధించాల్సి వచ్చింది. మీరా తన భర్తనే ధిక్కరించాల్సి వచ్చింది. భగవంతుడినే వారు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కనుక కాదన్నవారిని వారెదిరించక తప్పలేదు.
యువకులు కొందరికి పెండ్లి దగ్గర యిలాటి చిక్కువస్తుంది. తల్లిదండ్రులు నిన్ను ఫలానా పిల్లను పెండ్లిచేసుకోమని తొందరపెడతారు. నీకది యిష్టం వుండదు. అప్పుడు నీవు వారిని నెమ్మదిగా చెప్పి వొప్పించాలి. ఆది శంకరులు తన తల్లిని వొప్పించే కదా, సన్యాసం స్వీకరించింది!
శతాబ్దులుగా భారతదేశం కర్మభూమిగా పేరొందింది. ఇక్కడ ఉన్నతాదర్శాలే రాజ్యమేలాయి. అందుకే ఇది యోగభూమిగా ప్రసిద్ధిచెందింది. ఇదే త్యాగభూమిగా ఖ్యాతిపొందింది. సర్వాన్నీ త్యజించి తపస్సుకు అంకితమైన యోగులతో, ఋషులతో ఆదర్శప్రాయమైన పవిత్రభూమి ఇది.
అటువంటిది ఇది ఇప్పుడు భవన భూమి అవుతోంది. ఆకాశమంటే కాంక్రీటు భవనాలు, ఎయిర్ కండిషన్లు, టిన్డ్ఫుడ్ (డబ్బాలలో నిలవచేసిన ఆహారం) లతో, క్రమశిక్షణ యెరుగని జనంతో, పుట్టిన నేలనుండి పెకలించబడి విదేశీ సంస్కృతిలో నాటబడిన ప్రజానీకంతో గత అమూల్య వారసత్వానికి అపచారంగా తయారవుతోంది.
ఈ పరిస్థితిని మార్చాలి. మానవుడే మాధవుడు. అయితే మానవుడు మానవకర్మ చేస్తున్నంతసేపూ మానవుడుగానే వుంటాడు. మాధవకర్మ చేస్తేనే మాధవుడౌతాడు. నారాయణతత్వాన్ని అప్పడే అవగాహన చేసికోగలుగుతాడు. మానవకర్మచేస్తూ, ఒక్కోసారి దానవకర్మ కూడా చేస్తూ ‘మానవుడే మాధవుడు’అంటే కుదురుతుందా?
శీలం నీ ఊపిరి: సత్ప్రవర్తన నీ వెనె్నముక. ఇవి లేకుండా ఏ పుణ్యం ఫలిస్తుంది? శీలం లేని వ్యక్తి చిల్లుకుండలాంటివాడు. అందులో నీరేం నిలుస్తుంది?
అందుకే వైరాగ్యాన్ని సాధించు. శాంతిని చేపట్టు.
ఇంట గెలిచి
‘లోని శత్రువులకు లొంగిపోయినవాడు, బయటి రిపులనెట్టు పట్టగలడు?’ లోపల ఉన్నటువంటి దుర్గుణములనే శత్రువులకు లొంగిపోయినవాడు, ఇక బయట వానిని ఏ రీతిగా సాధించగలడు? మొట్టమొదట నీ అంతర్ ఇంద్రియములను అరికట్టు. అప్పుడే నీవు బయటి శత్రువులను సులభంగా లోబరచుకోగలవు.
ఇంటిలో శాంతి లేకపోతే వీధిలో ఎట్లావస్తుంది శాంతి? ఇంటిలో ఆనందం లేకపోతే దేశంలో ఎట్లా వస్తుంది శాంతి? కనుక మొదట మనం ఇంటిలో ఆనందాన్ని అనుభవించాలి. తిరిగి దేశంలో ఈ ఆనందాన్ని పంచాలి.
జెర్రి కాళ్లు
నీ శరీరాన్నీ, మనస్సునూ శుద్ధంగా వుంచుకో. చెడిపోయిన కార్లను మరమ్మతు చేసే వర్క్‌షాపులాగా వుంది. రుూ స్థలం! ఇక్కడ చెడు ఆలోచనలూ, చెడు పనులు తగవు. జీవితం పవిత్రమైంది. సంతోషంగా హాయిగా బ్రతుకు. విచారంగా మొహం వేలాడేసుకొని కూచోకు. సంతోషంగా వుండటం అంటే భగవంతునితో తాదాత్మ్యం చెందటం. ఇప్పుడే హాయిగా వుండలేకపోతే, యిక ముసలి వాడివైన తర్వాత హాయిగా ఎలా వుంటావు? ఇప్పుడు నీకున్నవి రెండే కాళ్లు. హాయిగా గెంతగలవు. కాని పెండ్లి చేసికోగానే నీకు సంసారం తయారవుతుంది. అప్పుడిక జెర్రిలాగా అనేక కాళ్లు తయారవుతాయి.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.