సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ తిండికి ఆ త్రేనుపు
ఈనాడు ఎవరైనా సరే భగవత్ భక్తులు కాగోరే వారు, భగవత్ భక్తులమని విశ్వసించేవారు మాంస భక్షణను వదలాలి. కారణమేమిటి? ఈ పశుమాంసము పశుగుణములనే పెంచుతుంది. ఎలాంటి తిండో అలాంటి త్రేనుపు. మామిడిపండు తింటే దోసకాయ త్రేనుపు వస్తుందా? మామిడిపండు త్రేనుపే వస్తుంది. కనుక దుర్మార్గములైన గుణములతో కూడినటువంటి క్రూరమృగముల యొక్క మాంసము భుజించడం చేత మనలో కూడనూ ఆ క్రూరత్వం అధికమవుతుంది. ఇది ఒక్కటే కాదు. పంచభూతములలో శబ్దస్పర్శ రూపరస గంథాదులతో జీవించేటటువంటి వాటి ప్రాణము తీయటము ఎంత పాపము? ఈ పాపం చేతనే మానవునికి తాపమేర్పడుతుండాలి. కనుకనే ఆనందాన్ని ఆశించేవారు మాంసభక్షణ పూర్తిగా వదలాలి. స్వదేశీయులు గాని, విదేశీయులు గాని, నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేవారు మాంసభక్షణను తక్షణమే విసర్జించాలి.
మద్యపానం
మద్యపానం మహాక్రూరమైనది. తనను తాను మరిపిస్తుంది. తన గౌరవాన్ని తీసి వేస్తుంది. మానవత్వాన్ని విస్మరింపజేస్తుంది. దివ్యత్వాన్ని మరిపిస్తుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. తాగి ‘ఊ...’ అని ఊగుతుంటాడు. నిజంగా వాని చూస్తే ఎంత అవమానమేస్తుంది? నవ్వు వస్తుంది. కొన్ని కొన్ని కుటుంబాలే నాశనవౌతున్నాయి. సంపాదించిన ధనమంతా ఈ మద్యపానమునకే వినియోగించి తల్లిదండ్రులను గాని, బిడ్డలను గాని, భార్యనుగాని పోషించనటువంటివాడు ఉండి ఏం ప్రయోజనం?
పర ధనాన్ని ఆశిస్తే...?
సీత భూమి సుత. అనగా, ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి పరమాత్ముని సొత్తు. కనుక, సీత పరమాత్ముడైన రాముని సొత్తు. కాని, రావణుడు రామునిపై ద్వేషం పెంచుకొని సీతను అపహరించడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా భగవంతుని ద్వేషించి ప్రకృతిని ఆశించడంవలన కడపటికి అతనికి దక్కిన ఫలితమేమిటి? తనతోపాటు తన వంశమును, రాజ్యమును కూడా నాశనం గావించుకొన్నాడు.
విశ్వమానవ ప్రేమ
సాంకేతిక పరిజ్ఞానం భారతీయ సంస్కృతిలోని ఉన్నతాదర్శాల సాధనకు అంకితం కావాలి. సంస్కృతీ నేపథ్యం కరువయితే విద్యావంతులు కూడా విదేశీ సంస్కృతికి బానిసలవుతారు. ఏ దేశానికి చెందినవారు ఆ దేశానికి వుండు ప్రత్యేక పరిస్థితులనుబట్టీ, వనరులనుబట్టీ నడచుకోవాల్సి వుంటుంది. అయినప్పటికీ అంతా దేవుని పిల్లలే కదా? అందుకే విశ్వమానవ ప్రేమ అందరికీ ఆదర్శం కావాలి. జాతుల మధ్య తేడాలను ఎంచుకుంటూ కూచోకుండా విశ్వమానవ ప్రేమను పెంపొందించుకోవాలి.
ప్రేమను పెంపొందించుకో
ప్రేమను పెంపొందించుకో, అది నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. ప్రేమ నీలో పొంగి పొరలితే, ప్రతి వ్యక్తీ భగవంతునిగా కనిపిస్తాడు. అన్ని పనులూ భగవత్పరంగానే వుంటాయి. బయట ప్రపంచం నీపట్ల ఎలా నడచుకున్నా, నీకు అందులో ప్రేమ గోచరిస్తుంది. అమృత మాధుర్యం స్ఫురిస్తుంది.
అందరిలోనూ వున్న భగవంతుని నీవు ప్రేమించు. భగవంతుడు అందరి రూపాల ద్వారా నీ పట్ల ప్రేమ చూపుతాడు. నిన్ను తిరస్కరించిన వారిని, నిందించిన వారిని కూడా నీవు ప్రేమించు. ప్రేమ మాత్రమే మనసుకు పట్టే మకిలను తొలగిస్తుంది. దేవుని ఆరాధించటం నీకు ఇష్టమైన ఒక్క పేరుతో, ఒక్క రూపంలో చేయి. కాని అలాగని నీ దృష్టి ఆ రూపానికే, ఆ నామానికే పరిమితం కానక్కరలేదు. నీ ప్రేమను అందరికీ పంచు.
భగవంతుని సామ్రాజ్యానికి ఎల్లలులేవు. అది విశ్వమంతటా మాత్రమే కాదు. విశ్వపరిధిని అధిగమించి వ్యాపించి వున్నది. పురోషోత్తముని రూపం అద్భుతం. ఆయన రూపాలూనామాలూ అనంతం. అర్చనామూర్తి ఆయన అనంతతత్వానికి కేవలం ఒక ప్రతీక. అంతేకాని దైవత్వం అంతకే పరిమితంకాదు. మరో పేరూ. మరో రూపంగల అర్చనామూర్తులను యితరులు విశ్వసిస్తూ వుండవచ్చు. వారితో నీకు వైరుధ్యం లేదు. ఇతరుల మార్గాలను అసహ్యించుకోవద్దు. అసహ్యం అసత్యానికీ, ఆతురతకూ, సంశయాలకూ, చివరకు ఘర్షణలకూ దారితీస్తుంది. నీ శాంతిని భంగపరుస్తుంది. తైలం లేని దీపంలాగా, అది వ్యర్థం. విసరకుండానే సోకే మలయానిలంలా నీ మనస్సును శాంతి సేద తీరుస్తుంది. నీ మనసు ప్రశాంతంగా లేకపోతే నీ చుట్టూవున్న వారిని చూసి నీకు ఉద్రేకం కలుగుతుంది. నాడి వేగంగా కొట్టుకొంటుంది. నెత్తురు వురుకులు, పరుగులు పెడుతుంది. ఈ స్థితి నుంచి నిన్ను తప్పించేది ప్రేమ వొక్కటే. ప్రేమ వొక్కటే భయాన్ని పోగొడుతుంది. ఆతురతను తగ్గిస్తుంది.
అందరికోసం ప్రార్థన
ఏ గుళ్లోగాని, ఏ క్షేత్రంలో గాని, ఏ తీర్థంలో గాని, ఏ యజ్ఞాలలో గాని కోట్లాది మంది రుూ దేశంలో చేసే ప్రార్థన ఏమిటో తెలుసా? ‘సర్వే జనాః సుఖినోభవంతు’-(అంతా సుఖంగా వుండాలి)- అని: ‘సమస్త లోకాః సుఖినో భవంతు’ (అన్ని లోకాలూ సుఖంగా వుండాలి)-అని. అంటే నీవు ప్రార్థించవలసింది నీకోసం మాత్రమేకాదు. అందరినీ ప్రేమించాలి. అన్ని దేశాలవారికోసం, అందరికోసం ప్రార్థించాలి.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.