సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగ యోగం
‘త్యాగ’రాజు
వామనావతార సందర్భంగా వచ్చిన పండుగ ఓనం. వామనుడు బలిని నిగ్రహించాడు. అనుగ్రహించాడు కూడ. బలి బలదర్పితుడు. ముల్లోకాలను జయించాడు. భగవంతుడు చిట్టి వడుగు వేషంలో ఆయన దగ్గరికివచ్చి మూడడుగుల నేలను దాన మిమ్మని అడిగాడు. ఇంతలో ఆయన గురువు శుఖ్రాచార్యులు బలిని వారించాడు. ‘వచ్చినదెవరో కాదు, విష్ణువే; నీ రాజ్యాన్ని సర్వం హరిస్తాడు’అని హెచ్చరించాడు. అయినా బలి వినలేదు. మూడడుగులమేర దానంచేశాడు. తాను రాజునే కాదు ‘త్యాగ’రాజుననిపించుకొన్నాడు. వామనుడు వెంటనే త్రివిక్రముడై పెరిగిపోయి ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో పాదం ఎక్కడ పెట్టాలి?’’అని బలిని అడిగాడు. బలి తన తలపై పెట్టుకుని, తన శిరస్సును చూపాడు. విష్ణువు ఆవిధంగా బలి రాజ్యాన్ని మొత్తం తీసుకొని, అతడిని పాతాళానికి పంపాడు. బలి బలగర్వం భంగమైంది. అయితే విష్ణువు బలిచేసిన త్యాగాన్ని మెచ్చుకొని, పాతాళంలో తన రక్షణలో సకల భోగాలతో గడపమని బలిని అనుగ్రహించాడు.
‘బలి’ అనగా సుంకము. పన్ను. బలి యిచ్చిన సుంకం ఏమిటి? మూడు అడుగులు వామనునికి ఇచ్చివేశాడు. అంటే తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తినంతా భగవంతునికి ధారపోశాడు.
భగవంతుని ఒక పాదం భూలోకమంతా ఆక్రమించిందట. ఇక రెండవ పాదం ఆకాశమును ఆక్రమించిందట. ఇక మూడవ పాదం బలి చక్రవర్తి తలపైన పెట్టాడట. ఆకాశమెంత పెద్దది? భూమి ఎంత పెద్దది? బలి చక్రవర్తి చిన్న తలకాయమీద వామనుడు అంత పెద్ద కాలుపెట్టాడా? అనగా ఏమిటి? శారీరకంగా అతని భ్రాంతిని దూరం చేశాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా-మూడింటియందును తానే ప్రవేశించాడు. ప్రతి మానవునికి శరీర భ్రాంతి ఉంటుంది. అసలు శరీర భ్రాంతి వలననే మానవునికి రాగద్వేషములు అభివృద్ధి అవుతున్నాయి. ఈ శరీరమును భగవదర్పితం గావించినప్పుడు, ఇంక భ్రాంతి అనేటటువంటిది ఉండదు. ఎప్పుడు భ్రాంతి వుండదో అప్పుడు బ్రహ్మము చాలా దగ్గరవుతాడు. అదియే ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ బ్రహ్మాన్ని తెలుసుకుంటే, బ్రహ్మానివే అవుతావు. అన్నింటికీ శరీరమే మూలకారణము. ఈ పాంచభౌతికమైన శరీరము అనేక విధములైన భ్రాంతులను కల్పించి, దైవత్వాన్ని మరిపించి, మానవత్వమే సత్యమని విశ్వసింపజేస్తుంది. ఈ లోకములో తన కాలమునంతా వ్యర్థం చేసుకుంటున్నాడు. అలాంటి మనిషి బలికి కళ్ళు తెరిపించి దివ్యత్వాన్ని నిరూపింపజేసినటువంటివాడే వామనుడు.
మానవత్వం
‘్భర్భువస్సువః’ అంటే భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం. ఈ మూడు లోకాలనూ మూడు పాదాలతో ఆక్రమించినవాడు త్రివిక్రముడైన వామనుడు. ‘్భలోకం’ అంటే ఏమిటి? మన శరీరమే. ఇది పంచ భూతాత్మకం. దీనినే ప్రకృతి అంటున్నాం. పంచ భూతాత్మకమైన దేహాన్ని కదలింపజేసేది ఒకటుండాలి. అదే మనస్సు. అదే భువర్లోకం. ఈ మనస్సుకు శక్తిని సప్లైచేసేదింకొకటుండాలి కదా! అదే ప్రజ్ఞానం. అది స్వర్గలోకం. మానవుని యందే ఈ మూడు లోకాలూ వున్నాయి. మూడు తత్వాలు కలిసిందే మానవత్వం. అదే ముల్లోక తత్వం.
నేడే ప్రారంభించు!
అందరికీ ఆనందం పంచండి! అందుకు ప్రేమేమార్గం. ప్రేమ భగవానునే దగ్గరకు తెస్తుంది. మనుషులను కలపటం దానికొక లెక్కా? అందుకే సాయి చెబుతున్నాడు.. వినండి! ప్రేమతోనే రోజును ప్రారంభిద్దాం! ప్రేమతోనే రోజంతా గడుపుదాం! ప్రేమతోనే రోజును ముగిద్దాం! భగవంతుని చేరే మార్గం ఇదే!
ముక్తికి బాట
నేను చేసే మిరకిల్స్ (అద్భుతాలు) గురించి వినే వుంటావు. నేనది చేశాననీ, యిది చేశాననీ, మీరు కోరిన కోరికలు తీర్చాననీ, సుస్తీలు నయంచేశావనీ నీకు ఎవరన్నా చెప్పి వుండవచ్చు. అవన్నీ అంతముఖ్యం కావు. నేను మీలో పెంపొందించాలనుకున్న సత్వగుణం అంత చెప్పుకోదగినవి కావు. ఆ మిరకిల్స్. ఆరోగ్యం గురించి, సంపదల గురించి మీపై నేను వరాలు కురిపించటం మీలో సంశయాలను పోగొట్టి మీరు మరింత విశ్వాసంతో మరింత చిత్తశుద్ధితో, మీ సాధనాలను నిరాటంకంగా సాగించాలనే. భక్తి శక్తినిస్తుంది. శక్తియుక్తినిస్తుంది. యుక్తి రక్తిపొందేందుకు దోహదం చేస్తుంది. చివరకు ముక్తినిస్తుంది.
ప్రేమతత్త్వాన్ని పెంచుకోండి! పరమాత్మను ప్రేమించండి!

ఇంకా ఉంది