సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొక్కితే రాయి- మొక్కితే దైవం!
ఒక కొండలో ఒక పెద్ద గుండు ఉంటున్నది. దానిని చూచినప్పుడు మనకు ఏమాత్రం ఆరాధన చేయాలనిపించదు. ఒక శిల్పి వెళ్ళి దానిని చక్కగా కృష్ణుని మాదిరి ఒక బొమ్మగా తీర్చిదిద్దుతాడు. అది విగ్రహంగా రూపొందుతుంది. ఆ విగ్రహాన్ని తీసికెళ్ళి దేవాలయములో ప్రతిష్ఠ చేస్తాము. ఆ విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆ గుండులోనున్న కొన్ని రాతి ముక్కలు ఆ కొండలోనే పడిపోతాయి. అప్పుడు ఆ ముక్కలు ఏం చెబుతాయట?
‘‘ఆ గుడిలో ఉండినటువంటి ఆకారము మేమే’’ అంటాయట! ‘‘మా గుండులోనున్న ముక్కలు ఇక్కడ కొన్ని పడిపోయాయి. ఒక ముక్క విగ్రహ రూపంలో అక్కడకుపోయి ప్రతిష్ఠ అయింది. ఆ ముక్కకు ఆకారము వచ్చింది, మాకు ఆకారము లేదు. అంతే తేడా!’’ అంటాయి.
ఆకారమునకు మాత్రమే ఆరాధన వస్తున్నది కానీ, నిజంగా యోచిస్తే ఆకారములేనిది కూడానూ దైవమే.
మనకు విశ్వాసము లేనంతవరకునూ దేవుడెవరో, జీవుడెవరో తెలియదు. ఈ విశ్వాసముతో ఆరాధన సల్పిన తరువాత జీవుడే దేవుడు, దేవుడు జీవుడు. సంబంధం ఏర్పడనంతవరకే ఈ భేదములు. సంబంధము ఏర్పడిన తరువాత అభేదమే.
దివ్యత్వానికి రాజమార్గం
పితృ ఋణం, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకొనటం ఎలా అన్న సంగతిని మీరు శాస్త్రాల ద్వారా తెలుసుకొనే వుంటారు. మానవత్వం నుంచి దివ్యత్వానికి పోయేందుకు ముళ్లులేని మంచి బాటను సనాతన ధర్మం చూపించిందని కూడా మీకు తెలుసు. ముళ్లుండనీ, లేకపోనీ, అంతా ఆ బాటను సంపూర్ణ విశ్వాసంతో నడవాల్సిన వారే!
ఆత్మాభిమానం ఏది?
ఈనాడు ప్రపంచం అనేక అశాంతులతో కుమిలిపోతున్నది. దీనికి మూల కారణమేమిటి? ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే. దేహాభిమానమును పెంచుకుంటున్నామే కాని, ఆత్మాభిమానమును పెంచుకోవటంలేదు. దేహం అశాశ్వతము. ఇది నీటి బుడగలాంటిది. ఏ క్షణంలో మాయమవుతుందో ఎవరికీ తెలియదు. మనస్సు పిచ్చి కోతి, కనుక మనస్సును మనం అనుసరించకూడదు. దేహమునూ అనుసరించకూడదు. హృదయాన్ని మాత్రమే అనుసరించాలి.
ఐకమత్యం
ప్రపంచంలోనే కాదు, మన దేశంలో కూడ పరిస్థితి ఎలా వుంది? ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుంది. ఐకమత్యం లేదు. కలసిమెలసి వుంటే ఎంత బాగుంటుంది? ఒక్క వేలుతో భోజనం చేయగలవా? అయిదు వేళ్లు కలిసి కలిపి పెడుతుంటే కడుపు అయిదు నిమిషాల్లో నిండిపోతుంది. పరస్పర విశ్వాసమే ఐకమత్యం. ఐకమత్యం అంటే సంగం కాదు. అదో కోరికాకాదు. ప్రతిఫలాన్ని ఆశించి చేసేదీ కాదు. అందరి సంక్షేమంకోసం అందరూ కలిసి పాటుపడాలి. ఫలితాలను చక్కగా బేరీజువేసికొని, చిత్తశుద్ధితో కలిసిమెలసి పనిచేస్తే, ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.
భగవద్వాణి
నమ్మకం ఏ పనికైనా మూలం. క్షురకుడు కత్తి తీసుకోగానే నీవు భయంతో పారిపోతావా? పోవు. ఎందుకని? అతడు నీకు క్షవరం చేస్తాడే కానీ ఏ హానీ తలపెట్టడనే నమ్మకం నీకుంది కనుక. అందుకే అతడు నీ తల నెట్లా వంచినా, తిప్పినా మాట్లాడకుండా క్షవరం చేయించుకుంటావు. రజకునికి ఖరీదైన దుస్తులను వేస్తావు. ఉతికి ఇస్ర్తిచేసి తీసికొని వస్తాడనే నమ్మకం ఉండబట్టే ఖరీదైన గుడ్డలను అతనికి వేస్తున్నావు. నీ కారు నడిపే డ్రైవరు మీదా, మీ యిల్లుకట్టే ఇంజనీరు మీదా నీకు నమ్మకం ఉండబట్టే అవి వారికి అప్పచెప్పగలిగావు. అలాగే, నీకు లోపలనుంచి చైతన్యం ఇస్తున్న ఆత్మపైనా, అంతర్వాణి పైనా నమ్మకం ఉంచు. అదే భగవద్వాణి!
దేహీ - దేహి
తాత్కాలికమైన సుఖాలకోసం చెడుమార్గాలను అవలంబించకు. ఓపిక పట్టు, భగవంతుని యందు విశ్వాసం వుంచు. ఆయన నీకు కావలసినవి చూస్తాడు.
కొంతమంది వారి దగ్గరకూ వీరి దగ్గరకూ వెళ్ళి ఆ సహాయం, ఈ సహాయం కావాలని దేబిరిస్తుంటారు. చేయిచాచి ‘దేహీ’!అని యాచిస్తుంటారు. ‘దేహి’! అంటే యింకో అర్ధంకూడా వుంది. దేహలో వుండేవాడు ‘దేహి’! అంటే ఆత్మ. బయట చేయి చాపి దేహీ అని చెప్పి, లోపల వున్న పరమాత్మను చిన్నబుచ్చకు. లోపల వున్న దేహినే ‘దేహీ’ అనడుగు. ఆయన నీ కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు.
ఎర
మీలో చాలామందికి ఏవో సమస్యలు ఉంటూనే వుంటాయి. కొందరికి వంట్లో బాగుండదు. కొందరికి యింకేవో మనాదులు. ఇవన్నీ ఏమిటి? మిమ్మల్ని యిక్కడికి రప్పించేందుకు వేసిన ఎరలు. మీరు భగవాన్ సన్నిధికి వచ్చి, ఆయన అనుగ్రహాన్ని పొంది మీ విశ్వాసాన్ని బలపరచుకొనేందుకే ఈ ఏర్పాటు. కష్టాలవల్ల వినయం కలుగుతుంది. భక్తి పెరుగుతుంది. కనుక ఒక విధంగా అవి ఆహ్వానించదగినవే.
ఇంకా ఉంది