సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృణ్మయమే చిన్మయం
ఈ దేహమనేటటువంటిది మట్టి పాత్ర. ఈ మట్టిపాత్రలో అమృతం నింపబడింది. ఈ ప్రకృతి అనేది బంగారు పాత్ర. దీని నిండా విషమే ఉన్నది. నీవు బంగారు పాత్రను చూస్తావా? విషమును చూస్తా?అయితే ఈనాడు బంగారు పాత్రకై భ్రమించి విషమును తాగుతున్నావు. ఇది సరైనదికాదు. ఇది మట్టి పాత్ర అయినప్పటికి ఇందులో అమృతం ఉన్నది. అందువలననే మృణ్మయమే చిన్నయము అన్నారు. ఇది కేవలం మట్టిపాత్ర కాదు. చిన్మయమైన పాత్ర కనుక మనం ఈ భ్రమల చేతనే సత్యమును అసత్యమును గాను, అసత్యమును సత్యముగాను విశ్వసిస్తున్నాము.
సర్వమత సారం
అన్ని మతములూ చేసే బోధలు ఒకటే. సత్య ధర్మాలను కాపాడండి. నీతి నిజాయితీలను అభివృద్ధిపరచండి. మానవత్వాన్ని పెంచండి. ఇదే అన్ని మతముల సారము. అన్ని మతములూ మంచివే ఆనీ మన మతులే మనల్ని చెడగొడుతున్నాయి. భేదము మతిలో ఉన్నదిగానీ మతంలో లేదు.
సత్యం వైపు సాగు
అసత్యాన్ని వదిలి సత్యం వైపు పయనించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. అవిద్యను అంత చేయి. ఈ దేహం గురించిన ఆదుర్దా వదిలి పెట్టు. ఇది ఎలాగూ నశించేదే. నశించని ఆత్మను గురించి తెలిసికో. నిత్యమైన ఆత్మవు నీవే. ఇదే సాధన. ఇదే మోక్షానికి మార్గం.
అవధూత
ఈ లోకం నిండా పిచ్చివాళ్లే వున్నారు. అయితే వాళ్లు పిచ్చాసుపత్రులలో లేరు. బయటే వున్నారు. ఒక్కొక్కసారి ద్వేషం ప్రబలితే, సామాన్య ప్రజలుకూడా కసాయి వారిలాగా ప్రవర్తిస్తారు. పిచ్చాసుపత్రులలో వుండే పిచ్చివాళ్లు కొందరు ఒక మూల కూచుంటారు. మిగిలినవాళ్లు చేసే పిచ్చి కళలను చూస్తుంటారు. అలాటి వాళ్లు డాక్టర్లకు నయం. వాడికి వారు చేయాల్సింది ఏమీవుండదు. అతనివల్ల బాధలేదు. అలాటివాడు జ్ఞానికావచ్చు. లేదా పిచ్చివాడు కావచ్చు. ఇద్దరికీ తేడా కనుక్కోడం కష్టం. అవధూత కూడా అలాగే వుంటాడు. అందుకే అవధూతను పిచ్చివాడనుకుంటారు. నిజానికి ఈ పిచ్చి లోకంలో మంచివాడు ఆయన వొక్కడే!
తెర తీయగ రాదా!
మానవునిలో వున్న ఆత్మను గురించిన జ్ఞానాన్ని ఒకరివ్వలేరు. మరొకరు పుచ్చుకోలేరు. అజ్ఞానం అనే తెరచాటున అది సదా దాగివుంటుంది. మాయ తొలగగానే సత్యం గోచరిస్తుంది. మబ్బుచాటునుండి వచ్చిన సూర్యుని వలె ప్రకాశిస్తుంది. నీవు చేయవలసినదేమిటి? ఆ తెరను తొలగించటమే. చైతన్యం అనే సూర్యుడు వెలువడి నీ మనోవాక్కాయ కర్మలను ప్రకాశింపచేస్తాడు.
మనోజ్ఞానం- ఇంద్రియ జ్ఞానం
ఇంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్నిబట్టి మనసుకు లభించే జ్ఞానం ఎప్పుడూ అసంపూర్ణమే. ఆత్మజ్ఞానం అలాకాదు. అది సంపూర్ణం. సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ‘సర్వం అల్విదం బ్రహ్మ’ అంతటా భగవంతుని దర్శిస్తుంది. నీవు యితరులూ అంతా ఆయన స్వరూపమే అని తెలుసుకుంటుంది.
ఇంద్రియ జ్ఞానాన్ని మనోజ్ఞానం అనవచ్చు. మనోజ్ఞానం వున్నవాళ్లు తాము యితరులకన్న వేరు అనుకుంటారు. వారికి భగవంతుడు ఎక్కడో కాశీలోనో తిరుపతిలోనో మాత్రమే వుంటాడు. వాళ్లు ఆధ్యాత్మికంగా కిండర్‌గార్టెన్ దశలో వుంటారు.
పునీతం
మన దేహాన్ని శుభ్రం చేసికోవడం ఎలాగ? పళ్లు తోముకొని నీళ్లతో కడుగుకోటం ద్వారా. వాక్కును శుద్ధిచేసుకోడం ఎలాగ? మాటల్లో నిజం నిండి వుంటే వాక్శుద్ధి కలుగుతుంది. మానవ జీవితాన్ని పునీతం చేసికోడం ఎలాగ? తపస్సు ద్వారా. అలాగే మన బుద్ధిని ఆవరించిన మాలిన్యం ఏమిటి? అజ్ఞానం. దానిని జ్ఞానం ద్వారా పోగొట్టి మన బుద్ధిని శుద్ధి చేసికోవచ్చు.
ఏ దారిన నడుస్తావు?
జ్ఞాన మాధుర్యాన్ని మానవుడు ఎలా ఆస్వాదించగలడు? అది ఎవరూ బయటనుంచి ఇంజక్షన్ చేసేదికాదు. ఎవరికివారు ప్రయత్నించి సాధించుకోవలసింది. బయటనుంచి కొంతవరకే సాయంచేయవచ్చు. కాని అధిక భాగం అంతర్ముఖత్వం వల్లనే సాధ్యం.
అందుకు ఒక మార్గం సత్సంగ్. ఏకాంతంగా సాధన చేయదలచుకున్నావా? ధ్యానం ఉత్తమమార్గం. ఏ మార్గాన్ని అవలంబిస్తావో నీ యిష్టం! ఏ మార్గమైనా సరే, నీ లోపల తిష్ఠవేసిన ఆరుగురు శత్రువులున్నారే. కామక్రోధాదులు - వాళ్లను జయించకుండా జ్ఞానఫలం చేజిక్కదు.

ఇంకా ఉంది