సబ్ ఫీచర్
రక్తహీనతను తగ్గించొచ్చు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచ దేశాల్లో రక్తహీనత బారిన పడుతోన్న మహిళలు.. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్‌లోనే ఎక్కువట. ఏ వయసు వారైనా రక్తహీనత బారిన పడొచ్చు. ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం కావచ్చు. రక్తంలో ఎర్రరక్తకణాలు తక్కువ కావడానే్న రక్తహీనతగా చెప్పొచ్చు. రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రాణవాయువును ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రాణవాయువు అన్ని భాగాలకు సక్రమంగా చేరదు. దాంతో అలసట, నీరసం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత సమస్య ఎక్కువకాలం కొనసాగితే రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి గుండె, మెదడు, ఇతర అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. సమస్య తీవ్రతరం అయితే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఎదురు కావచ్చు.
రక్తం తక్కువగా ఉండటం, ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం, ఎక్కువ మొత్తంలో ఎర్రరక్తకణాలు నాశనమవడం.. ఇలా రక్తహీనత సమస్య మూడు రకాలుగా ఉంటుంది. వీటివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎనీమియా రావడానికి ముఖ్యకారణం రక్తం లేకపోవడమే.. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య రావొచ్చు. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. అలాగే శస్తచ్రికిత్సలు, గాయాలు, కేన్సర్ వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవడమనేది సహజంగా జరగొచ్చు. లేదా కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా తలెత్తొచ్చు. అలానే కొన్ని కారకాలు ఎర్రరక్తకణాలు ఏర్పడకుండా శరీరాన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఇలా జరగచ్చు. ఇక తీసుకునే ఆహారం, హార్మోనులు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, గర్భం ధరించడం వంటివాటివల్ల కూడా ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. తీసుకునే ఆహారంలో ఇనుము, ఖనిజాలు, విటమిన్లు లేకపోవడం, పోషకాలను శరీరం స్వీకరించలేకపోవడం వల్ల కూడా రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. రక్తం తయారుకావడానికి ఎరిత్రోపయోనిక్ అనే హార్మోను అవసరమవుతుంది. ఇది తక్కువ స్థాయిలో ఉన్నప్డు రక్తహీనత రావచ్చు. ఎర్రరక్తకణాలు నాశనమవడం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడినప్పుడు శరీరం ఎర్రరక్తకణాలను తయారుచేసుకోలేదు.
పోషకాల లోపం..
రక్తహీనత ప్రధానంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపం వల్ల ఎదురవుతుంది. ఆ పోషకాలను ఆహార రూపంలో అందుకోవాలంటే ఒకే తరహా ఆహారపదార్థాల నుంచి కాకుండా పోషకాలను కలిపి తీసుకోవాలి. ఇనుము ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు, మినరళ్లూ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పు్ధన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి. అప్పడు శరీరం బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివాటిని సులువుగా స్వీకరించగలుగుతుంది.
ముఖ్యంగా కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువగా అవసరం అవుతుంది. నెలసరి మొదలయినప్పటి నుంచీ దీని అవసరం రెట్టింపు ఉంటుంది. పైగా మన దేశంలో ఈ పోషకం వల్ల రక్తహీనతకు గురయ్యేవారే ఎక్కువ. అయితే ఇనుముని ఏ రూపంలో తీసుకున్నా కూడా దాన్ని శరీరం సులువుగా గ్రహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సప్లిమెంట్ వేసుకున్నా, ఆహారమే తీసుకున్నా వెంటనే కాఫీలు, టీలు తాగకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారం, పచ్చళ్లు వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వీటిల్లో ఉండే టానిన్ ఇనుమును శరీరం అందుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఐరన్‌ని మాత్రల రూపంలో తీసుకునేవారు ఖాళీ కడుపుతో వేసుకోవాలి. దానివల్ల ఆ పోషకం త్వరగా అందుతుంది. లేదంటే పళ్లరసంతో తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే టాబ్లెట్ వేసుకున్నాక విటమిన్ సి ఎక్కువగా లభించే జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోవాలి.
* మాంసాహార పదార్థాలైన చికెన్, లివర్, గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. అదే శాఖాహారులు అయితే వేయించిన సెనగపప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసలు, ఎర్రపప్పులను ఎక్కువగా తీసుకోవాలి. గోరుచిక్కుడులో ఐరన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అలాగే కరివేపాకు, గోంగూర, పుదీన, మెంతికూర, మునగాకు, తోటకూర వంటివాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు ఏ రూపంలో తిన్నా మంచిదే.. రోజూ చెంచా నువ్వులు, బెల్లం, పల్లీలు తినాలి. ఉదాహరణకు రోజూ కనీసం ముప్ఫై గ్రాముల పల్లీలు తినగలిగితే వాటినుంచి 1.5 మిల్లీగ్రాముల ఇనుము శరీరానికి అందుతుంది. ఎండుద్రాక్ష, నల్లద్రాక్ష, ఖర్జూరం వంటివి తినచ్చు.
*చుక్కకూర, పాలకూర, పుదీనాలలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చి బఠాణి, గోరుచిక్కుడు, కమలాపండు, పప్పు్ధన్యాలు వంటి వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది.
*బీ12 శాఖాహార పదార్థాల నుంచి అందే అవకాశం చాలా తక్కువ. మాంసాహారంలో పీతలు, చేపలు, లివర్, కోడిగుడ్డుతో పాటు కొంత మొత్తంలో పాల పదార్థాలైన చీజ్ల నుంచి బీ12 లభిస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన పాలు, పెరుగుని ఎక్కువగా తీసుకోవచ్చు. *