Others

రక్షణ కవచానికి తూట్లు.. మనకు పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళితోపాటు సమస్త జీవరాశులకు ఆవాసమైన భూమి విపరీతంగా వేడెక్కుతోంది. వాతావరణం గతి తప్పుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాలవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సంద్రాలు జనావాసాలను ముంచెత్తుతున్నాయి. భూకంపాలతో భూమి బద్దలవుతోంది. అగ్నిపర్వతాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన కారణం పర్యావరణ మార్పులు. పర్యావరణానికి హాని కలిగిస్తూ సహజ సంపదను నాశనం చేస్తుండటంవల్ల కూర్చున్న కొమ్మని తామే నరుకుతున్న చందంగా తయారవుతోంది. అందుకు ఉదాహరణ రక్షణ కవచం ఓజోన్ పొరకు చిల్లులే ఆ నష్టం మరింత పెరిగి, సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకితే జీవజాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఆ రక్షణ కవచం పరిరక్షణ ఆవశ్యకత గుర్తు చేసేందుకు సెప్టెంబర్ 16న ‘‘అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం’’గా నిర్వహిస్తున్నారు.
ఓజోన్ పొరకు ధ్రువప్రాంతాలపైన రంధ్రం పడిందన్నది అందరి భయానికి కారణం. నిజానికి మనం అనుకుంటున్నట్లు అది నిజమైన రంధ్రం కాదు. కొంత ప్రాంతంలో 03 బిందువుల గాఢత తక్కువగా ఉంటుంది. ఇలా ఓజోన్ గాఢత తగ్గినప్పుడు అతి నీలలోహిత కిరణాలు భూమికి చేరే ప్రమాదం ఉంటుంది. ఈ గాఢత తగ్గిన ప్రాంతానే్న ఓజోన్ పొరకు రంధ్రం పడిన ప్రాంతంగా పేర్కొంటున్నారు.
భూమిలోని బాక్టిరియా చేత ఉత్పత్తి చేయబడే దీర్ఘాయుర్దాయం ఉన్న స్థిరమైన వాయువు నైట్రస్ ఆక్సైడ్ (ఎన్2ఓ) భూ ఉపరితలంపై దీనియొక్క ఉద్గారాలు స్ట్రాట్ ఆవరణపై నైట్రస్ ఆక్సైడ్ (ఎన్‌ఓ)ను ప్రభావితం చేస్తాయని 1970లో ప్రొఫెసర్ పాక్రుట్జిన్ అభిప్రాయపడ్డారు. ఆమ్లజని మరో రూపమే ఓజోన్. ఇది విషవాయువు. ప్రతి ఓజోన్ అణువులో 3 ఆమ్లజని పదమాణువులుంటాయి. దీని రసాయనిక సంకేతం ‘ఓ3’ అతినీలలోహిత వికరణ కారణంగా వాతావరణం పై పొరలా ఆక్సిజన్ ఓ2 గా విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సిజన్ పరమాయువు (ఓ) తాడితంలో ఆక్సిజన్ ఆయువుకి చేరి ఓ3 ఆక్సిజన్ పరమాణువుగా మారి ఓజోన్ అణువవుతుంది. ఓజోన్ క్షీణత కారణంగా అతి నీలలోహిత కిరణాలు భూ వతావరణంలోకి రావడం ఎక్కువయితే చర్మ క్యాన్సర్, మొక్కలు నాశనమవడం, మహాసముద్ర కాంతి ప్రాంతంలో ప్లవకజాతులు తగ్గిపోవడం వంటి వివిధ జీవ వరుణ దుష్ప్రభావాలు ఎదురవుతాయని అనుమానిస్తున్నారు. ఓజోన్ స్తంభంలో 70 శాతం వరకు క్షీణతను దక్షిణ ప్రాంత (దక్షిణార్థగోళం) వసంతకాలంలో అంటార్కటిక్‌పై 1985లో ఫార్మాన్ మరియు ఇతరులు తొలిసారి గుర్తించారు. 2008 నాటికి నైట్రస్ ఆక్సైడ్ (ఎన్2ఓ) ఓజోన్ పొర పలచబడటానికి ప్రధాన కారణంగా భావించారు.
మూడు దశాబ్దాల క్రిందట అంటార్కిటికా ఎగువన ఓజోన్ పొరకు చిల్లు పడిందన్న వార్తతో ప్రపంచం నివ్వెరపోయింది. భవిష్యత్తుపై భయం పుట్టింది. ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లుగా శాస్తవ్రేత్తలు 1980లోనే గమనించారు. ఓజోన్ పొరకు హాని కలిగించే పదార్థాల నియంత్రణకు ఈ పొరను పరిరక్షించేందుకు వీలుగా ప్రపంచ దేశాలు 1987లో మాంట్రియల్‌లో సమావేశమయ్యారు. ఇది ఇలాగే పెరిగితే సూర్యుని నుంచి విడుదలయ్యే అతి నీల లోహిత కిరణాలవల్ల భూమిపై ప్రాణులకు క్యాన్సర్లు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముందని వెల్లడైంది. కావున ఒక ఒప్పందాన్ని రూపొందించింది. దీనినే మాంట్రియల్ ఒప్పందంగా పిలుస్తున్నారు. 1990 ప్రాంతంలో హానికారక వాయువులు బాగా విడుదలయ్యేవి. కొనే్నళ్లపాటు ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం పెరుగుతూ వచ్చింది. దీని ప్రభావంవల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని గుర్తించారు. 1995లో సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలు మాంట్రియల్ ఒప్పందానికి కట్టుబడ్డాయి. దీనితో అప్పటి నుంచి సెప్టెంబర్ 16ను ‘ఓజోన్ పరిరక్షణ దినం’గా పరిగణిస్తున్నారు.
మాంట్రియల్ ప్రొటోకాల్‌కు గుర్తుగా..
పర్యావరణం, ఓజోన్ పరిరక్షణ వంటి విషయాలపై మాంట్రియల్‌లో జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరి మూడు దశాబ్దాలైంది. ఈ ఏడాది ఓజోన్ డే సందర్భంగా సరికొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. ‘కేరింగ్ ఫర్ ఆల్ లైఫ్ అండర్ ది సన్’ అన్న నినాదంతో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రువాండలోని కిగాలిలో జరిగిన సదస్సులో భాగస్వామ్య దేశాలు మాంట్రియల్ ప్రొటోకాల్‌లో సవరణలకు ఆమోదం తెలిపారు. హైడ్రోఫ్లోరో కార్బన్ వాయువుల విడుదలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకునేందుకు రువాండా అంగీకరించింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన నేపథ్యంలో పర్యావరణానికి మరింత ముప్పు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొరకు మరింత నష్టం కలగవచ్చు. అదే జరిగితే భూమిపై జీవరాశి ఎన్నో కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఆ వినాశం నుంచి రక్షించబడాలంటే మనమే తొలి అడుగు వేయాలి. పర్యావరణాన్ని ప్రేమించి రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.

-కె.రామ్మోహన్