సబ్ ఫీచర్

మానవసేవే మాధవసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనులంతా మొట్టమొదట గడ్డిపరకల కోసమూ తపించిన వారే. రామకృష్ణపరమహంస కూడా చిన్నతనంలో దారిద్య్రాన్ని చవిచూసినవారే. వారు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీజిల్లా కామర్పుకూర్ అనే కుగ్రామంలో సాంప్రదాయ కుటుంబంలో క్షుధీరామ్, చంద్రమణీదేవి అనే దంపతులకుపుత్రుడయ్యారు. రామకృష్ణపరమహంస చిన్నప్పడు గదాధరుడు. ఈ గదాధరునిగా ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా పరిక్షించి కాని నమ్మేవారుకారట. కాని ఎవరైనా ఆ ఊరికి సాధువులు, సన్యాసులు వస్తే వారికి ఎంతో సేవ చేసేవారట. ఈ రామకృష్ణపరమహంస తనకు ఉపనయం జరుగుతున్నప్పుడు మొట్టమొదట భిక్ష నేను ఒక శూద్రవనిత దగ్గర మాత్రమే తీసుకొంటానని పట్టుపట్టారట. ఎందుకలా అంటే నేను భిక్ష స్వీకరిస్తానని మాటిచ్చాను. దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇక నేను బ్రాహ్మణుడిని ఎలా అవుతానని పట్టపట్టి మరీ తానుననుకొన్నట్టుగానే భిక్షను స్వీకరించారట. ఆ గదాధరుడే ఒకానొక పరిస్థితుల్లో దక్షిణేశ్వరంలోని కాళికానిలయంలో పూజారిగా నియమింపబడ్డాడు. నేను రోజు నిర్వర్తించే ఈ పూజాదికాలు కేవలం రాతిబొమ్మకా లేక ఇందులోని సజీవ మూర్తికా అన్న సందేహించాడాయన. దీనికోసం నిరంతరం తపించాడు. రాత్రిళ్లు అడవుల్లో ఏకాంతంగా తపస్సు చేశాడు. రాతిశిల్పంలో ఉంది అనిభావించే అమ్మవారి ప్రత్యక్ష రూపు నాకు కనిపింపచేయి అమ్మా అని వేడుకొనేవారు. అట్లా ఎన్నో యేళ్లు అమ్మ రూపం కనిపించాలని తలచిన ఆయనకు అమ్మకరుణ దక్కింది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం ఇచ్చేవారు. ప్రతిరోజు సాధారణ మనిషికి చేస్తున్నట్లే అమ్మవారి సేవను చేసేవారు. మన హిందూ ధర్మంలో ఇంత భగవంతుని రూపం కనిపించిందిగదా. మరి అన్ని మతాల ల్లోనూ ఒకే దేవుడున్నాడా లేక వేర్వేరుదేవతలున్నారా అని సందేహించి సర్వమతాల సారం కోసం పాటుపడ్డారు. తోతాపురి లోని నాగా సాంప్రదాయపు సాధువు రామకృష్ణులకు అద్వైతామృతాన్నిబోధించారు. ఆ తరువాత సర్వమతాలల్లోని భగవంతుని స్వయంగా చూడాలని అనే్వషించి చివరకు భగవంతుడు ఒక్కడే. ఆయన్ను ఆర్తిగా పిలిస్తే మన చెంత నిలుస్తాడు అని తెలుసుకొన్నాడు. తన శిష్యులకు కూడా ఇదే బోధించారు. స్వామి వివేకానందులు వచ్చి ఈచర్మచక్షువులతో భగవంతుని చూశారా అని అడిగితే చూశాను. నీవు కూడా చూడవచ్చు అని చెప్పి మరీ దర్శనం చేయించిన సద్గురువు రామకృష్ణులు. ఆయన ఎన్నో ధార్మిక ప్రబోధాలు చేశారు. తన అర్థాంగిని కూడా భగవంతుని స్వరూపంగా భావించి పూజించేవారు. ఎన్నో యేళ్లు తపస్సు చేసి కూడాపొందలేమేమో అనుకొన్న నిర్వికల్పసమాధి స్థితిని రామకృష్ణుడు కేవలం మూడురోజుల్లో పొందారు. అంతటి ఘనులు రామకృష్ణులు. చిన్న చిన్న కథలరూపంలో తన దగ్గరకు వచ్చిన వారికి మంచిని బోధించేవారు. ఎన్నో సంఘ సంస్కరణలకు తాను చేయూతనిచ్చారు. సామాజిక సేవ చేశారు. మానవసేవే మాధవ సేవ అని నొక్కి చెప్పారు. రామకృష్ణ పరమహంస నేడు ఈభువి పై లేకపోయినప్పటికీ కూడా రామకృష్ణ మిషనరీస్ ఆయన బోధను ప్రచారం చేస్తూనే ఉన్నాయి. సత్యబోధ చేసి హైందవ ధర్మపు ఔన్నత్యాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్తున్నాయి.

- ఆర్. పురంధర్