సబ్ ఫీచర్

హంస దౌత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథుడు తన శృంగార నైషధంలో చక్కగా
హంస దౌత్యం చేశాడు. నలునికి-దమయంతీకీ మధ్య హంస రాయబారం నిర్వహించి, వారి మనుగడకు ఎంతో కృషిచేసిందని చక్కటి వర్ణనతో రచించాడు.

దౌత్యం అని చెప్పగానే ఎవరికీ అర్థంకాదు. ఈ పదంతో చాలా సమస్యలు తొలగిపోతాయి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమనుగానీ, లేదా రెండు ఊర్ల మధ్యగానీ, రెండు జిల్లాల మధ్య గానీ, రెండు రాష్ట్రాల మధ్యగానీ లేదా రెండు దేశాల మధ్య గొడవలను, యుద్ధాలను ఆపడానికి ఒక్క దౌత్యంతో సాధ్యమవుతుంది. అనగా రాయబారంతో అని. అలా దౌత్యంతో రాయబారాలు నిర్వహించేవారు ఉన్నపుడు ఎంతటి పెద్ద సమస్యకు అయినా సమాధానం దొరుకుతుంది. చరిత్రలో చూస్తే భారతంలో శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారంగా వెళ్లాడు. అలాగే రామాయణంలో చూస్తే హనుమంతుడు లంకకు వెళ్లి రాయబారం నడిపాడు. వ్యక్తులు నిర్వహించిన రాయబారాలు చాలావరకు రాజకీయ కారణాలతో సాహిత్యంతో కనిపిస్తాయి. మనుష్యేతర వస్తువులు రాయబారాన్ని నిర్వహించినవి ఎక్కువగా ప్రేమికుల మధ్య ఉండడం గమనించవచ్చు. మహాకవి కాళిదాసు ‘మేఘసందేశం’ ద్వారా, జాషువా కవి ‘గబ్బిలము’ ద్వారా తమ రాయబారాలు నడిపారు. అలాగే శ్రీనాథుడు రచించిన శృంగార నైషధంలో నల-దమయంతుల మధ్య రాయబారం నెరపినది హంస క్షీర-నీర న్యాయం తెలిసిన దివ్యపక్షి. (నలునికి చిక్కి దమయంతి గురించి ఇలా చెప్పసాగింది.)
ఆకస్మికంగా హంస వచ్చి చెంతను రెక్కల శబ్ధం చేయగా ఆటలో నిమగ్నమయిన చెలికత్తెలకు ఒక్కసారిగా చెవికడ భేరి వాయించినట్లయింది. ఏంటది అని కలవరపడి హంసను చూసి దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా హంస తప్పించుకున్నది. తరువాత దమయంతి ఆ బంగారు పక్షిని పట్టుకుంది.
కలువ వంటి నేత్రాలుగల దమయంతీ! బ్రహ్మ తబేలాలోని గుఱ్ఱాలు (హంసలు) మాకు వంశకర్తలు, పువ్వు వంటి మేనుగలయో దమయంతీ! ఆకాశగంగ పసిడి తామరల నాళములు మా మేనులు! ఓ కమలముఖీ! బ్రహ్మ నివాసమయిన సత్యలోకము. చతుర్ధశ భువనాలు మా విహార స్థానాలు. సాటిలేని మేను గలదానా! తియ్యని అక్షరములు గలవి అమృతాహారులైన దేవతల మాటలు అమృతం వంటివి. వాగీశ్వర వాహనములు గావున వాక్పటిమగలవి. మదపుతేనుగుల నడక వంటి నడక కలదాన! సరస్వతీదేవి సహధ్యాయి మాకు. ఓ జవరాల. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల రాజమార్గము మాకు. నేను అబద్ధం ఆడను. ఏ త్రాళ్లకు లొంగను. సుగుణాలనే త్రాళ్లకు లొంగుతాను. భూలోకంలో నృప ముఖ్యులలో కొందరితో స్నేహం ఉంది. అందులోనూ నిషద దేశాదీశ్వరుడు నలుడన్న రాజుమీద ఎక్కువ పక్షపాతం కలిగి ఉంటా ను, అని దమయంతికి నలుని గురించి రాయబారం చేసి చెపుతుంది. ఇంకా ఓ చంద్రముఖీ! బ్రహ్మకైనా భుజశౌర్యాన్ని పొగడటం సాధ్యమా? శత్రురాజు సమూహ సంబంధంగల ప్రాణవాయువు అతని అమ్ముల వాదర లనెడి పాముకు ఆహారం. వాయువును పాములు మాపినట్లు ఇతని బాణాలు వైరుల ప్రాణమును మాపును, రంబ అనే అప్సరస నలమహారాజు గుణాలు విని ఆయనపై మరులుకొన్నది. కాని కోరిక తీర్చుకొనుటకు భూలోకానికి రావడానికి సాకు ఏమీదొరకలేదు. అంత రంబ నలుని మీద కోరికతో నలుని గాకపోయిన ఆ శోభనమైన పేరుతో సంబంధంకలవాడు ‘నలకూబరు’అనే దేవ కుమారుని వరించి నలుని మీద తన కోరికను కొంచెం తీర్చుకుంది.
ఆ రాజు దగ్గర నాకు చాలా చనువు ఉంది. దమయంతీ! మన్మథుడు, వాత్స్యాయనముని, కూచిమారుడు అనువారు రచించిన శాస్త్రగ్రంథాల మర్మాలను నేర్చినవాడను. భార్యాభర్తలకు సరసత్వాలను కలిగిస్తారు. ఆ రాజు రాణీవాసపు కాంతల సమూహానికి మెల్లమెల్లని నడకలు నేర్పిస్తాను.
రాణీవాస స్ర్తిలకు నాయందు మిక్కిలి నమ్మకము. వారు తమతమ రహస్యకార్యాలను నాతో చెప్పుకుంటారు. నన్ను సామాన్యమైన పక్షిగా తలచి, బ్రహ్మ ముఖ తామరసం నుండి వెలువడిన నానాశాస్త్రాల సంస్కారంతో నిండిన చెవులుగలవాడను. బ్రహ్మదేవుని సృష్టి శ్రమ పార్వతీ-పరమేశ్వరుల యెడలను లక్ష్మీనారాయణల యెడల సఫలమైనట్లుగానే మీ ఇద్దరి కూటమీ చక్కగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మీ ఇద్దరు దంపతులు కాగలరని మీ నుదుట రాసాడు. ఈ భూమిలో నిషథ నాథుని భార్యగా ఒక్క దమయంతీకే ఆ అర్హత ఉంది అని నలమహారాజు గురించి హంస దమయంతీతో చెప్పి వారి కూటమికి కారణమైంది.
ఇది శ్రీనాథుడు తన శృంగార నైషధంలో చక్కగా హంస దౌత్యం చేశాడు. నలునికి-దమయంతీకీ మధ్య హంస రాయబారం నిర్వహించి, వారి మనుగడకు ఎంతో కృషిచేసిందని చక్కటి వర్ణనతో రచించాడు. శ్రీనాథుడు 15వ శతాబ్దంన జీవించాడు. ఆ యుగాన్ని శ్రీనాథ యుగంగా పిలిచేవారంటే శ్రీనాథుడు ఎంత గొప్ప రచనలు చేశాడో మనకు అర్థం అవుతుంది. తన కావ్యాలను ఎక్కువ మంది రాజులకు అధికారులకు అంకితం ఇచ్చాడు.
ఇలా రాయబారంతో ఎన్నో యుద్ధాలను ఆపవచ్చు. పూర్వ పావురాలతో, గ్రద్దలు రాబందులతో ఇంకా చిలుకలు వాటితో రాయబారాలు నడిపేవారు. రానురాను వార్తాహరుడుతో రాయబారం జరిపి యుద్ధాలను ఆపేవారు. వీటివల్ల అనేక ప్రాణికోటికి రక్షణ కల్పించిన వారం అయ్యింది. ఒక రాయబారంతో ఎక్కువ మొత్తంలో జరిగే నష్టాన్ని నివారించి ప్రకృతిని, అనేక జీవకోటిని రక్షించవచ్చు.

-తాల్క ఉషశ్రీ