సబ్ ఫీచర్

త్యాగశీలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి జీవులను చాలా తీవ్రంగా ఓర్పు మహిమనూ, ధర్మాన్ని, ఇంద్రియాల మీది అదుపునూ పాడుచేస్తుంది. నీవు మాత్రం ఈ రెండింటిలో చిక్కలేదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గాన అది జీవితాన్ని నిలబెడుతుంది. నీవు మాత్రం బ్రతుకుమీది కోరికను త్యాగం చేశావు. నిన్ను పొగడటానికి నాకు మాటలు చాలవు. ఈ స్థితిలో నేను ఎలాంటి
మాటలతో నిన్ను పొగడగలను?

ఆంధ్ర మహాభారతంలో అరణ్యపర్వంలో ఎఱ్ఱన మహాకవి ఒక పద్యం ద్వారా త్యాగశీలాన్ని వర్ణించిన తీరు అమోఘం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. అరణ్యంలో పాండవులు పడుతున్న కష్టాలకు మదిలోనే బాధపడుతూ, వాత్సల్యంతో వేద వ్యాసులవారు వారివద్దకు వచ్చారు. మహర్షులూ- యోగులూ- మహాత్ములూ కనబడినంతనే ధర్మరాజు హృదయం జ్ఞాన సముపార్జనకోసం ఆరాటపడుతుంది. తెలుసుకోవాలనే కోరికతో భక్తిశ్రద్ధలతో ప్రశ్నిస్తూ వుంటాడు. దీనినే పరిప్రశ్న అంటారు.
గురుభావంతో ధర్మరాజు తన సందేహాన్ని వెలిబుచ్చుచూ, స్వామీదానము తపము అనే వాటిలో దేనివలన మంచి, గొప్పఫలం కలుగుతుందో వివరించండని అడిగాడు. ధర్మరాజు సందేహంలో ధర్మముందని భావించి రాజా! నీవడిగిన దానిలో దానమే గొప్పదని అంటూ వ్రీహిద్రోణం అనే ఒక కథను విన్పించాడు. ఈ ఉపాఖ్యానంలో ‘ముద్గలుడు’ అనే వ్యక్తి అతిథి ప్రియుడు. నియమ నిష్ఠలు గలవాడు. వ్రతనిష్ఠ గలవాడు. కురుక్షేత్రంలో కుటుంబంతోపాటు ఉంఛవృత్తి అవలంబించి జీవిస్తున్నాడు. పదిహేనురోజులకొకసారి మాత్రమే భోజనం చేసేవాడు. అతిథులకు పెట్టి మిగిలితే తినేవాడు.
అనుకోకుండా ఒక రోజు దేవపూజ- అతిథి పూజ మొదలైనవి అయిన తదుపరి, భోజనానికి సిద్ధమతున్న సమయంలో పరమ కోపిష్టి అయిన ముని దుర్వాసుడు ముద్గలునికి యింటికి అతిథిగా వచ్చాడు. ముద్గలుడు, తానూ, తన కుటుంబం తినబోయే అన్నాన్ని ఆ మునికి నివేదన చేశాడు. ఆ ముని కడుపారా తిని, మిగిలిన దానిని శరీరం అంతా రాసుకొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి వచ్చి అలాగే తిని వెళ్ళేవాడు. ముద్గలుడు ఆనందపడుచూ, కుటుంబంతోబాటు ఉపవాసాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అలా ఆరు పూర్ణిమలు సాగిపోయాయి. ముద్గలునిలో ఏ వికారం- ఏ బాధాకనబడలేదు. దుర్విసమునికి. ముద్గలుని త్యాగశీలాన్ని నోరారా ప్రశంసిస్తూ ఇలా అన్నాడు.
‘చవులకు బ్రేముడించునని శంబును నాలుక; దాల్మిపెంపుధ
ర్మువును శమంబుద్రెక్కొను సముద్ధతి నాకలి- వీని రెంటనున్
ద వులవు, జీవిత స్థితి విధాయకమన్నాము, నీవు జీవితే
చ్ఛ విడిచి, తిప్పుడేమని- ప్రశంస యొనర్తునినుందపోనిధీ!
అంటూ, తపస్సు ముద్దగట్టిన మహానుభావా! మానవ శరీరంలో భాగమైన నాలుక ఎల్లప్పుడూ రుచులనే కోరుకుంటుంది.
ఆకలి జీవులను చాలా తీవ్రంగా ఓర్పు మహిమనూ, ధర్మాన్ని, ఇంద్రియాల మీది అదుపునూ పాడుచేస్తుంది. నీవు మాత్రం ఈ రెండింటిలో చిక్కలేదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గాన అది జీవితాన్ని నిలబెడుతుంది. నీవు మాత్రం బ్రతుకుమీది కోరికను త్యాగం చేశావు. నిన్ను పొగడటానికి నాకు మాటలు చాలవు. ఈ స్థితిలో నేను ఎలాంటి మాటలతో నిన్ను పొగడగలను? అని ముద్గలుని ప్రశంసించాడు. పరమ కోపిష్ఠిగా పేరుపొందిన దుర్వాసుని మహావాక్యం యిది. ఆ ముని శివాంశతో భూమికి వచ్చిన తేజోరావి. ఆ మహర్షి మాటలు పరమప్రసన్నంగా ముద్గలుని విషయంలో ఋజువైనది. ముద్గలుని, ముని చాలా ఘోరంగా పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలో ఆ మునిలో అణుమాత్రమైననూ లోపం రాలేదు. కనబడలేదు. ఆ గెలుపును జయపత్ర రూపంగా మహర్షి దుర్వాసుడు పలికాడు. ఇంక ముద్గలుని విషయంలో ఉంఛ వృత్తినే ఎన్నుకొని, రైతులు తాము పండించిన రిపంటలను ఇళ్ళకు గొంపోయిన పిదప, చేలలో మిగిలిన గింజలను ఏరుకని, భోజనంగా ఏర్పాటుచేసుకొనే పద్ధతి. పశుపక్ష్యాదులు ఇలాగే బ్రతుకుతాయిగదా! దాచుకోవడం వుండదు. కడుపారా తిండి దొరుకుతుందనే నమ్మకం ఉండదు. భావిగతి ఏమిటనే భావన ఉండదు. ఉంఛ వృత్తిలో వున్న గొప్ప గుణాలు యివి.
ముద్గలుడు ధర్మసాధనాలలోప్రధమమైన శరీరాన్ని ఉపేక్ష చేయగూడదు గాన ఆ విధంగా దాన్నిపోషిస్తున్నాడు. ఆయన దృష్టిలో శరీరం ధర్మంకోసమే కానీ, ధర్మం శరీరంకోసం కాదు. దుర్వాసుడు ఈ నిష్ఠను చూడాలనే భావన కల్గి ముద్గలుని పరీక్షించాడు. కఠినమైన పరీక్షలకు గవురిచేసిన ముని, ముద్గలునిలోని తపస్సు ఏ ప్రమాణంలో వుందో తెలుసుకున్నాడు. ముద్గలుని అణువణువునా మునికి ఆతని తపస్సే కన్పించగా, దానిని దర్శించిన, ఆ ముని నోటినుండి తపోనిధి! అనే సంబోధన వెలువడినది. జీవులకు నాలుక, కడుపు అనే ద్వారానికి రిరిద్వార పాలకుని వంటిది. దాని అనుమతి లేకుండా ఏదీ లోపలికి చేరలేదు. రుచులనే వివాదానికి లంచంగా యిస్తే తృప్తి, నిద్రలో కూడా, నిద్రలేచినప్పుడు కూడా రుచులకోసం ఎదురుచూస్తూ వుంటుంది. యజమాని చచ్చినట్లు తృప్తిపరచాలి.
ఇక ఆకలి విషయంలో దాన్ని ఉపశమింపచేయటానికి ఏదో ఒక పదార్థాన్ని దానికి అందించాలి. ఆ విషయంలో ఓర్పు- ధర్మమూ, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం అనే మంచి లక్షణాలన్నీ తలవంచి, తప్పుకోవలసిందే. ఆకలిని తీర్చడమంటే ఓర్పు నేర్పులను బలిపెట్టవలసిందే. దాన్ని తృప్తిపెట్టవలిందే.
అదే మంచి స్థితి. ఆ స్థితి లేకుండా మనిషి మనిషే గాడు.ఇది ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటంలో నాలుకా, ఆకలీ గెలుస్తూ ఉంటాయి. ముద్గలుడు తన తపోదీక్షతో వీటిపై గెలుపు సాధించాడు. ముని పరీక్షించి తెలుసుకున్నాడు. ఈ యుగంలోనే కాక భవిష్యయుగంలో కూడా ధర్మాన్ని సాధించడంకసమే జీవులు బ్రతకాలి. అంటే అన్నం కావాలి. ముద్గలా! అన్నగతమైన చూపూ లేకపోవడమే పరమధర్మం. అది నీకు సిద్ధించింది. ప్రారబ్ధమే దేహాన్ని పోషిస్తుంది అని నమ్మిన వారు దేహధ్యాసను విడిచి ఆత్మారాముడై జీవనం సాగిస్తున్నాడు.
వేదవ్యాసులవారు ఈ విషయాన్ని యిలాగట్టిగా తెలిపారు.
‘న జాతు కామాన్న భయాన్నలోభాతే
త్యజేద్ధర్మం- జీవితస్యా పిహేతోః
ధర్మో నిత్యఃసుఖ-దుఃఖేత్వ నిత్యే
జీవోనిత్యో హేతురస్య త్వనిత్యః అంటూ
మానవుడెన్నడూ కామంచేతనో, భయం చేతనో, లోభం చేతనో చివరకు జీవితంకోసం కూడా ధర్మాన్ని వదలరాదు. ధర్మము నిత్యమైనది. సుఖ దుఃఖాలు వస్తూపోతూ వుంటాయి. జీవుడు నిత్యుడు. ఆ జీవుడు శరీర ధారణ చేయటం అనిత్యం. వీటికి బద్ధుడై నిలబడి త్యాగశీలుడైనాడు ముద్గలుడు. అలాంటి త్యాగశీలుని పొగడటానికి నాకు శక్తిచాలడంలేదని దుర్వాసముని ప్రకటించాడని, ఒక చక్కని ఈ కథ ద్వారా వ్యాసుడు ధర్మరాజుకు త్యాగశీల మహాత్మ్యముని వివరించి, లోకానిక్కూడా సందేశమందించాడు.

-పి.వి.సీతారామమూర్తి