సబ్ ఫీచర్

అన్నీ పరస్పరాధారములే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డాల్టన్ జాన్’ (1766-1884ఎడి) అను ఆంగ్లేయుడు అణు సిద్ధాంతమును కనిపెట్టినట్లు చెబుతున్నారు. లక్షల సంవత్సరముల పూర్వమే గౌతమ మహర్షి తన ‘న్యాయదర్శనమను గ్రంథమునందు’ అణువులే రుూబ్రహ్మాండమందలి చరాచర సృష్టి కంతటికి కారణమని నిరూపించెను. ఈ అణు స్వరూపమును గురించి మన వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్తమ్రుల యందు వందల కొలది శ్లోకములు వివరించుచున్నవి.
భౌతిక పదార్థ పరిశోధనలకు అంతం లేదు. పదార్థపు అంచులు చూడగల మేమోగాని, యదార్థము చూడలేము. అందుకే ముందు తనను తాను (తానెవరో) తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్తలందరు తేల్చినదేమంటే, ప్రపంచమంతా, శబ్దము, వెలుగుతో నిండి వుందని. మనం అంతర్ముఖులమైతేనే కాని, లోపలి శబ్దాన్ని వెలుగును చూడలేముకదా! వైజ్ఞానిక దృష్టితో విశే్లషించి, విమర్శించి చూస్తే దృశ్యమాన జగత్తంతయు (ఇంద్రియ గోచరమయ్యే ప్రపంచమంతయు) ముఖ్యంగా, స్థలము, కాలము అను రెండు విధములుగా నున్నట్లు తెలుస్తుంది. ‘‘సర్ జేమ్స్ జీన్స్’’ అనే శాస్తవ్రేత్త తన ‘‘ది న్యూ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ సైన్సు’’ (The new back ground of Science) అనే ఘ్రంథంలో ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త ‘‘ఐన్‌స్టీన్’’ ప్రతిపాదించిన ‘సాపేక్ష సిద్ధాం’ ఆధారంగా జరిగిన ప్రయోగాల ఫలితాలనిట్లా వివరించాడు. స్థలము, ( (Space) మనఃకల్పనా మాత్రమేనని తెలుస్తుంది. మన శరీరాలన్నీ స్థలము నందున్న పదార్థములు మాత్రమే కదా! ప్రకృతిలోని అస్మత్ ప్రత్యయము యొక్క అసంగత విస్తరణయే స్థలము. ఈ స్థలం వల్లనే, మనం చూసే పదార్థముల ఆకారాన్ని అమరికను అర్థం చేసుకొని వివరించగలుగుతున్నాము. కాలము ద్వారా మనకు జరిగే సంఘటనలు ఏ క్రమంలో జరజిగాయో వివరించగలుగుతున్నాము. యిది రెండవ కల్పన. యథారాథనికి సామాన్యార్థంలోకాలమనేథి, ఒకమిధ్య మాత్రమే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం స్థలకాలములను, స్థలకాలములు లేకుండా... ఉండజాలవు. కనుక అవియును మనః కల్పితములే అవుతాయి. సామాన్యంగా పదార్థానికి మనం అపాదించేఘన పరిమాణ విషయంలో కూడా, ఆధునిక ప్రయోగాత్మకైన భౌతిక శాస్త్రం చేసిన నిర్ణయాల ద్వారా జవాబు దొరుకుతుంది.
మనం నివసించేఈ విశ్వమంతాఒక శరీరము వంటిదని విశ్వరసాయన శాస్త్రం చెబుతున్నది. ఎందుకంటే మన శరీరంలోని భాగాలు వేరు వేరుగా వేటికవి విడిగా జీవించడం లేదు. మన శరీరమొక సజీవమైన ఏకత్వం. శరీరంలో నొక భాగానికి దెబ్బతగిలినా బాధ కలిగినా , లేక మనసుకు బాధ కలిగినా శరీరమంతా స్పందిస్తుంది. 1950వ సంవత్సరంలో జార్జిజియార్డీ అనే శాస్తజ్ఞ్రుడు విశ్వ సంబంధిత రసాయన శాస్త్రం అనే కొత్త శాస్త్రాన్ని ప్రారంభించాడు. ఇతడు ఎన్నో ప్రయోగాలు చాలాకాలం నిర్వహించి విశ్వమంతా సజీవమైన యేక వస్తువుని నిరూపించాడు. అంటే యే ఒక్కటి విడిగా నిలువలేదు. అన్నీ పరస్పరా ధారాలే. ఎంతో దూరాన ఉన్న సూర్యుడు, చంద్రుడు తదితర గ్రహాలు, నక్షత్రాలలో మార్పులు జరిగినపుడు మన శరీరంలో కూడా మార్పులు సంభవసితాయ. చంద్రుడి కళలో జరిగిన మార్పును బట్టి భూమిపైన అమావాస్యపౌర్ణమిలలో సముద్ర జలాలలో వచ్చే ఆటపోట్లు మనకు తెలిసినవే.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590