నమ్మండి! ఇది నిజం!!

ఆత్మహత్యల అడవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్యలు అధికంగా సంభవించే దేశం గయానా. తర్వాతి స్థానాలు సౌత్ కొరియా, శ్రీలంకవి. దీన్లో జపాన్ స్థానం (17) ఇండియా (11) తర్వాతే. జపాన్ సంస్కృతిలోనే ఆత్మహత్య ఓ భాగంగా చాలాకాలంగా ఉంది. ఇది జపాన్ జాతీయ పెద్ద సమస్యల్లో ఒకటి. 2014లో సగటున రోజుకి 70 మంది జపనీస్ ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో మగవారే అధికం (71%). వీరి సగటు వయసు 20-44 మధ్య. వీరి ఆత్మహత్యలకి ప్రధాన కారణాలు నిరాశ, సామాజిక వత్తిళ్లు, ఉద్యోగం పోయిన వారిలో 65.3% మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యోగపు వత్తిళ్లు తాలూకు నిరాశ వల్ల మిగిలిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జపనీస్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ పేర్కొంటోంది.
ఆత్మహత్య చేసుకోడానికి జపాన్‌లో కొన్ని ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జపనీస్ మెయిన్ లేండ్‌లో గల వౌంట్ ఫ్యూజీ పరిసర ప్రాంతం. జపాన్‌కి ఫ్యూజీ సింబల్‌గా నిలుస్తోంది. జపనీస్ ప్రజలందరూ దాన్ని గౌరవిస్తారు.
బయటి ప్రపంచానికి తెలీని ఓ విషయం, దాని చుట్టుపక్కలగల ఓ అడవిలో జరుగుతోంది. ఎంతో శాంతిగా ఉండే ప్రాంతమైన వౌంట్ ఫ్యూజీ పాదాల దగ్గర ఓ అడవి ఉంది. దాని పేరు అవోకి జహరా - జుకాయ్. జపాన్ సంస్కృతిలో ఆత్మహత్యలకి, ఈ అడవికి అనాదిగా ఓ సంబంధం ఉంది. గతంలో ఆర్జించలేని వృద్ధులని, అంగవికలురు, పిచ్చివాళ్లని కుటుంబ సభ్యులు ఈ అడవికి తీసుకొచ్చి వదిలి వెళ్తూండేవారు. ముఖ్యంగా చుట్టుపక్కల స్థానికులు ఇలా చేసేవారు. దట్టంగా చెట్లు అలముకుపోయిన ఈ అడవిలోంచి బయటపడటం దాదాపు అసంభవం. దాంతో బయటికి రాలేక, ఆహారం అందక వారు మాడి మరణిస్తారు. దీన్ని ‘ఉబాసూట్’ అంటారు. వారి అరుపులు కూడా బయటి ప్రపంచానికి వినపడవు. నేడు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లు ఈ అడవికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నారు. జీవితం మీద విరక్తి పుట్టిన వారు స్వచ్ఛందంగా ఈ అడవిలో ప్రవేశిస్తున్నారు. మనసు మార్చుకుని వాళ్లు బయటికి రావాలన్నా గమ్యం తెలియని దాంట్లోంచి ఇక రాలేరు.
అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా వల్ల 3500 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పడ్డ ఈ అడవి నేల రాళ్లతో, నేల మీద పెరిగే చెట్లతో నిండి ఉంటుంది. రాళ్ల వల్ల చెట్ల వేళ్లు భూమిలోకి పాతుకోలేక, పాములా పైనే మెలికలు తిరిగి బయటికి కనిపిస్తూంటాయి. ఇక్కడ 200కి పైగా గుహలు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం చెట్ల మీద కురిసిన లావా వల్ల ఏర్పడ్డాయి. చెట్లు కాలిపోయాక, ఘనీభవించిన లావా గుహగా ఏర్పడుతుంది. వీటిలోని కొన్ని గుహల్లో వేసవిలో కూడా మంచు ఉంటుంది. వన్యమృగాలు ఇక్కడ ఎక్కువ కాలం జీవించలేవు. పక్షుల పాటలు కూడా వినపడకుండా ఈ అడవి స్మశాన నిశ్శబ్దంతో నిండి ఉంటుంది.
పని మీద ఈ అడవిలోకి వెళ్లేవారు రంగు టేప్‌ని వదులుతూ ముందుకి నడుస్తారు. మళ్లీ ఆ టేప్ ద్వారానే వెనక్కి దారిని కనుక్కుంటారు. పర్యాటకులని ఇలా కాలినడకన తీసుకెళ్లే గైడ్లు ఉన్నారు. దారిలో వారికి ఆత్మహత్య చేసుకున్న తమ వారి జ్ఞాపకార్థం కు టుంబ సభ్యులు, మిత్రులు వదిలిన పూలగుత్తులు అనేకం కనిపిస్తూంటాయి.
‘ఉబాసూట్’ వల్ల కొన్ని వందల ఏళ్లుగా జరిగిన మరణాల మీద 1960లో ‘కురోయ్ జుకాయ్’ అనే నవల వచ్చింది. 1993లో పటారు సురుముయ్ అనే జపనీస్ రచయిత రాసిన ‘ది కంప్లీట్ సూయిసైడ్ మేన్యువల్’ అనే పుస్తకం వెలువడింది. ఈ పుస్తకం అప్పట్లో వివాదాన్ని సృష్టించింది. అందులో అవోకి జహరా ఆత్మహత్యకి చక్కటి ప్రదేశం అని అతను పేర్కొన్నాడు. జపనీస్ ప్రభుత్వం 2016లో ఆత్మహత్యల శాతాన్ని 20కి తగ్గించడానికి కృషి చేస్తోంది. స్కూళ్లల్లో, కార్యాలయాల్లో ఆత్మహత్య నివారణ, అవగాహనా సదస్సులని నిర్వహిస్తోంది. ఇది ఆత్మహత్యకి అనువైన స్థలం అనే ఉద్దేశం ఎవరికీ కలగకూడదని స్థానిక ప్రభుత్వం ఆ అడవిలోని ఆత్మహత్యల సంఖ్య, ఇతర వివరాలు మీడియాకి అందకుండా చేస్తోంది. ప్రపంచంలో ఆత్మహత్యలు అధికంగా జరిగే ప్రదేశం శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. తర్వాతి స్థానం ఈ అడవిదే. అక్కడ సెడర్, పైన్, బాక్స్ ఉడ్ వృక్షాల సమీపంలోని జలపాతం మీంచి కిందకి దూకి మరణించడం సాధారణంగా జరుగుతూంటుంది.
నేలలో విస్తారంగా గల ఇనుప ఖనిజాల వల్ల, ఇక్కడ దిక్సూచి కానీ, జిపిఎస్ పరికరం కానీ సరిగ్గా పనిచేయవు. ఫారెస్ట్ గార్డ్స్ ఉద్యోగరీత్యా అడవిలోకి నిత్యం వెళ్లి వస్తూంటారు. ఎప్పుడో మరణించిన వారి అస్థిపంజరాలు తరచూ వాళ్ల కళ్లబడుతూంటాయి. కొద్ది కాలం క్రితం ఆత్మహత్య చేసుకున్న వారి శవాలు చెట్ల కొమ్మలకి వేలాడుతూ, లేదా పురుగులు తిని కనిపిస్తూంటాయి.
ఆ శవాలని తెచ్చి వాళ్లు తమ స్టేషన్‌లోని శవాల గదిలో ఉంచుతారు. అందులో రెండు మంచాలు ఉంటాయి. ఒకటి శవం కోసం. రెండోది శవం పక్కన ఒకరు నిద్రించడం కోసం.
అవును. మీరు సరిగ్గానే చదివారు. శవాన్ని వొంటరిగా నిద్రించనిస్తే, ఇంకా పైకి చేరని వొంటరి ఆత్మ రాత్రంతా అరుస్తూనే ఉంటుందని, లేదా ఆ శవం తన ఇంటికి వెళ్లి నిద్రిస్తుందని జపనీస్ మూఢ నమ్మకం. అక్కడ మరణించిన వారి శవాలని అధికంగా చూసిన స్థానిక పోలీస్ ఆఫీసర్ పేరు అసుజా హయానో.
*

పద్మజ