అక్షరాలోచన

ఆపదలో అరిటాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-నాశబోయిన నరసింహ
9542236764

పురిటిలో
జీవం పోసినప్పటి నుంచి
నిర్మానుష్య స్మశానం దాకా
అనుక్షణం కరువైన రక్షణ
వివక్ష గాయాలతో
హక్కుల కోసం రాజీలేని పోరాటం
తల్లీ చెల్లీ - ఇల్లాలు బామ్మ
ఆమె రూపాంతరాలే
కృషి పట్టుదల ఆమె స్థిరాస్థులు
గర్భస్థ పిండమైనా
పసిమొగ్గైనా
వదిలించుకునే మాయా జ్వాలలో
ఆమే ఓ సమిధ

అత్యాచార అఘాయిత్యాలు
ఆమ్లదాడుల హింసోన్మాదాల మధ్య
నకనకలాడే సింహం నోట్లో
ఆమే గజగజ వణికే జింకపిల్ల

ఒకరికి ప్రాణం పోస్తుంది
వేరొకరికి ఊడిగం చేస్తుంది
అనుబంధాల బంధనాలతో
అణువణువు సమర్పించి
అనునిత్యం ప్రేమ చంద్రిక పంచే
ఆమె రాహువు మింగిన జాబిల్లి

ప్రకృతి సమతుల్యత కోసమే
ఆడ-మగ భౌతికాంతరం
బాధ్యతల తేడా సమాజ కల్పితమే
తరిగిపోతున్న ఆడ శిశు నిష్పత్తి
ఏదోనాడు అమ్మలేని అనాధ చందం

ఇప్పుడు... ఆమె జీవితానికి భద్రత కావాలి
ఆత్మగౌరవం సమానత్వం వికసించాలి
ఆర్థిక స్వావలంబన రావాలి
అమ్మ ఋణం తీర్చగలవా?
అమ్మాయిగా పుడితే చాలు!

వీడుకోలు
-కోడూరి రవి
గలగలలతో
ఎన్ని కలలు రేపావు ఒకనాడు
నీ చరణ మంజీరముల
సవ్వడిలో
నా నవ నాడుల
మన్మథ బాణాలు రువ్వి
నీ మృదు స్పర్శతో
నా తనువంతా మునిగోట దువ్వి
నిదురించిన
నిగారింపు తలపుల లోతులు
తవ్వినావు

నీ చెలమతో కుదిరిన
చెలిమిని
మించిన కలిమి లేదు
నీవే కాదు -
నీ సకుటుంబ సపరివారమూ
బంధజన లోలురే
దానగుణ శీలురే

నా మది నీ అలలపై
తేలియాడ..
అలసిన మనసుకు జోలపాడి
రాగరంజితమైన నీ పరువం
కమ్మని కలలకు
వారధియై నిలిచింది
మధురోహల సారథియై *

అర్ధాంగి

-గులాబీల మల్లారెడ్డి
9440041351
ఆమెపై నేను ఏ మన్మథ బాణాలు వేసింది లేదు
ఏనాడూ పూల వర్షం కురిపించింది లేదు
నాతిచరామి అంటూ తాళి ముడి వేసేవరకు చూసింది లేదు
ఆమెతో మాటాడింది లేదు
అపరిచిత అయితేనేమి-
ఆమె రాక నా జీవితాన ఒక ఏరువాక
నా కోసం పొయ్యిలో కట్టె అయి మండింది
గినె్నలో అన్నమై ఉడికింది
ఆమెనే పప్పై ఉప్పై చారై
వేయి ఘుమఘుమల రుచులతో
బతుకుంతా విందు చేసింది
నిజానికి నా చేదు బతుకులో
ఆమె ఒక మకరందపు ఝరి
ఏ పూలతో పూజింపను
ఆ సహస్ర దళాల విరిని
ఏ నామముతో జపించను
ఆ కోటి నామాలా దేవతను

ఈర్ష్య మొలకెత్తేనా?

-్భత్‌పూర్ చంద్రశేఖర్
9640037003
ప్రపంచ ప్రజలందరికీ
ఈర్ష్యద్వేషాలు
దేహాంతర్గత
మనోబుద్ధులకు సంబంధాలు

డాక్టర్ల కంతుచిక్కని రోగమిది
మందూ మాకూ లేని
మరణతంత్రమిది
సాధించి శోధించినా

సప్తరుషుల వలే
యోగమార్గంలో
ఆత్మ, దేహం కలిపి
ఈర్ష్య జననం ఎలాంటిదో

ద్వేషం పుట్టుక ఎలాంటిదో
ఏ దేశ వాసులకైనా శూన్యమే
మానవుల దృక్పథాల్లో
భిన్నత్వం ఉండొచ్చు
సుప్రీంకోర్టులోని జడ్జికైనా
ఈర్ష్యాద్వేషాలు ప్రస్ఫుటిస్తాయి
శరీరపు శక్తుల్ని
రూపుమాపే సాధన
ప్రక్రియ ఫలితం శూన్యం
సమస్త జనావళి
శాంతి కాంక్షిస్తూ జీవించాలి సుమా!