మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
జంట నగరాల్లో పదివేల సిసి కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు. దీనికి మీరేమంటారు?
ఆ కెమెరాలను ఎత్తుకుపోతే...?

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
ఎన్నో దశాబ్దాల వెనుక ఆంధ్రపత్రిక యజమాని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు సంవత్సరాంతాన ఒక బృహత్తర సంచిక ప్రచురించేవారు. అది ఎందరో సాహిత్య శిఖామణులను ఆకర్షించేది. అలా మీరు కూడా సంవత్సరాంతంలో ఒక సంచిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఏమంటారు?
మంచి సూచనే. ఆలోచిద్దాం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
భారత్‌లో ఉగ్రవాద దాడుల గురించి నిఘా వ్యవస్థ ఎన్నోసార్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు వాటిని అడ్డుకోలేక పోతున్నారు? కొంతమంది పట్టుబడిన ఉగ్రవాదులు తాము రెండు నెలలకు ముందే దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, రెక్కీలు నిర్వహించి అనంతరం దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. కేంద్రం ఈ విషయంలో ఎందుకు ఉదాసీన వైఖరి కనబరుస్తోంది?
దమ్ము లేక. గద్దెనెక్కాక కాంగ్రెసు నీళ్లు వొంటబట్టి.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
హిందువులు తమను తాము సంరక్షించుకొనుటకు 1.మతమార్పిడి నిషేధం 2.హిందూ ఆచార వ్యవహారములు అవలంబించుట 3.మాతృభాషను గౌరవించడం.. ఈ లక్షణాలు ముఖ్యంగా ఆచరణలో ఉంచితే ‘హిందూ సమైక్యత’ వికసించదా?
తప్పక.

జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, పట్ట్భా సీతారామయ్య (జె.వి.పి.) కమిటీ నిర్ణయం వలన ‘మద్రాసు’ ఆనాడు ఆంధ్రప్రదేశ్‌కు దక్కకుండా పోయిందని విన్నాను. పటేల్ కూడా ఆ కమిటీలో వున్నారా?
ఉన్నారు.

ఎం.కనకదుర్గ, తెనాలి
ఎసిబి వలలో పడుతున్న అవినీతిపరుల ఆస్తుల వివరాలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. నెలకు ముప్పై వేలు జీతగాళ్లకు యాభై కోట్ల ఆస్తి సంపాదించడం ఎలా సాధ్యం? అనే్నసి సంవత్సరాలు నిరాటంకంగా డబ్బు దోచేస్తుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? సామాన్యులు యాభై వేలు బ్యాంకు నుండి డ్రా చేస్తే నోటీసులు ఇచ్చే ఆదాయపు పన్ను విభాగం వీరిని ఎందుకు పట్టుకోలేక పోతోంది?
అవినీతిపరులదే రాజ్యం కనుక.

వరిగొండ కాంతారావు, హనుమకొండ
‘గుడుంబా, కల్తీ సారాలకు బానిసలు కావద్దు. మీ పిల్లలకు అన్యాయం చెయ్యొద్దు’ - ఇది తెలంగాణ ప్రభుత్వం వారు రాష్ట్ర రహదారి రవాణా సంస్థ బస్సులపై రాయించిన ప్రకటన. ప్రభుత్వం వారమ్మే మద్యానికి బానిసలు అయిన వారి పిల్లల మాటేమిటి?
వారికి అన్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది.

ఎం.స్వాతి, విజయవాడ
ఈ మధ్య వచ్చిన ఓ ఘరానా సినిమాలో నరకం నుంచి వచ్చిన తండ్రి ఆత్మ కొడుకు శరీరంలో దూరి కొడుకుని సరసుడిని చేస్తుంది. కొడుకు నోటితో తన పాతప్రియురాలితో సరసాలాడుతుంది. మీరే కనక ఈ సినిమా చూస్తే ఏమంటారు?
తెలుగు సినిమాకు దయ్యం పట్టింది.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
కోర్టును ధిక్కరించి కోడి పందాలు ఆడటం, ఎ.పి. ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పి ‘నేతాశ్రీ’లే పాల్గొని ఎంకరేజ్ చెయ్యడం భావ్యమా?
కొన్ని సామాజిక వ్యసనాలు కోర్టులు ఆపితే ఆగవు.

కోళ్లపూడి కోనయ్య, బాపట్ల
ఈ జనవరి 18 నుండి నాలుగైదు రోజులపాటు ఆంధ్రభూమి దినపత్రిక నాకు రాలేదు. లోకల్ ఏజెంట్‌కు ఫోన్ చేస్తే పలకలేదు. నాకు పత్రిక సక్రమంగా అందేట్టు చేయగలరా?
అలాగే.

పి.రామకృష్ణ, రాజమండ్రి
మా ఊరిలో మధ్యన ఇసుక రాంప్ ఉంది. 24 గంటలు లారీలు. ఏం అనలేం. రోడ్డు పట్టనన్ని ఆటోలు. వారి వెనుక యూనియన్ నాయకులు. వారిని వదిలేసి హెల్మెట్ ధారణ పేరుతో ద్విచక్ర వాహనదారులను వేధించడం ఎంతవరకూ సబబు?
తేరగా దొరికేది సామాన్యుడే మరి.

‘పద్మ’ అవార్డుల కోసం మీరు ప్రయత్నించలేదా?
పైరవీలు చేతకాదు.

ఎం.డి.రవూఫ్, కడప
టెక్నాలజీ తెలివిమీరిపోతున్న నేటి కంప్యూటర్ యుగంలో, యువతరం యావత్తూ లభించే విజ్ఞానాన్ని మంచికి తక్కువ, చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తోంది. కొందరు చేతులారా తమ జీవితాలను కొవ్వొత్తిలా ఆర్పేసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే టెక్నాలజీ మానవుని ఉద్ధరణకా? మరణానికా?
వాడుకునేవాడి వివేకాన్నిబట్టి.

బి.నారాయణ, సికిందరాబాద్
ముక్కుపచ్చలారని పసిపిల్లలు బోరుబావి గుంటల్లో పడి, ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ పాపం ఎవరిది? బోర్‌వెల్లర్స్‌దా? వారిపై కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వాలదా?
స్థానిక పెద్దల అశ్రద్ధ, తల్లిదండ్రుల అజాగ్రత్త కూడా.

పి.ఆర్., రాజమహేంద్రవరం, తూ.గో.జిల్లా
గత ఏడాది ‘ఖబడ్దార్’ అంటూ పరస్పరం కత్తులు దూసుకున్న చంద్రద్వయం ప్రస్తుతం ఒకటయ్యారు. తెర వెనుక వీరిద్దరికీ సయోధ్య కుదిర్చిందెవరు?
ఏమో! ఏ రాజగురువు పుణ్యమో.

సీతారామారావు కొడాలి, హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణం దారుణమే కానీ అసలు వివాదానికి మూలమైన కసాబ్‌ని సమర్థిస్తూ చేసిన విద్యార్థులపైన దేశద్రోహం కేసు పెట్టకుండా ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నట్టు? ఇప్పుడేమో ఎవ్వరూ దాని గురించే మాట్లాడటం లేదు?
ఔను. ప్రభుత్వానిదే తప్పు. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com