స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
లోకంలో పాపిగాని, ధర్మాత్ముడుగాని, జ్ఞానిగాని, మూఢుడుగాని ఇలా ఎవరైనాగాని పరమాత్ముడు దయతో అనుగ్రహించిన వస్తుజాలానే్న అనుభవిస్తున్నారు. ఎందుకంటే విశ్వవ్యాపి అన సర్వప్రకృతి భగవంతుని సొత్తే. ఈ జ్ఞానం కలిగియే జ్ఞాని ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే జ్ఞానికి సత్యమైన ఆనందం కలుగుతుంది. లోకంలోని సమస్త వస్తుజాలమూ భగవంతుని సొత్తే అనే జ్ఞానంతో అనుభవించే ఆనందం అట్టి జ్ఞానంలో లేని దశలో ఉన్నవాడికి ఎలా లభిస్తుంది. ఈ భావంతోనే ‘దేవాశ్చిత్తే అసుర్య ప్రచేతసో బృహస్పతే యజ్ఞియం భాగమానశుః’ అని వేదం వర్ణించింది.
పరమేశ్వరుడు జ్ఞాన ప్రవాహానికి పుట్టినిల్లే కాదు. జీవులకు జీవనాధారం కూడా. అటువంటి జీవనోపయోగియయిన జ్ఞానాన్ని (యజ్ఞియ) జీవనాధారమైన పరమాత్మ నుండియే జీవులకు లభిస్తూంది. అలా లభించిన జ్ఞానమే సర్వజీవులలో కంటే మనుష్యులలో విశేషంగా ఉండే ప్రధాన గుణం.
భగవంతునిలో జ్ఞాన సమృద్ధియే కాదు జ్ఞానం చేత అనుభవింపబడే సమస్త వస్తుజాలం కూడా పరిపూర్ణంగా ఉంది. అందుకే వేదర్షి ‘సమస్త సత్య విద్యలకు మరియు పదార్థ విద్యల వలన తెలియదగు సమస్త సత్యవిద్యలకు ఆదిమూలము ఆ పరమేశ్వరుడే’ అని మంత్రంలో స్పష్టపరచాడు.
అభీష్ట ఫలప్రదాత
అధా హిన్వాన ఇంద్రియం జ్యాయో మహిత్వ మానశే
అభిష్టికృద్ విచర్షణిః
భావం:పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. అందువలన సృష్టిలోని సకల జీవులలో వారి ఇంద్రియాలకు నిరాటంకంగా జీవశక్తిని నింపే మహామహిమాన్వితుడై జీవులు కోరుకొనే సకల అభీష్టాలను నెరవేర్చే వరప్రదాతయై వెలుగుచున్నాడు.
వివరణ:అధా హి న్వాన.. మహిత్వమానశే- పరమాత్మ జీవులకు ఇంద్రియాలనీయడమే కాక వానికి నిరంతరము జీవశక్తినిచ్చే మహా మహిమాన్వితుడు. ఒక్కసారి ఆ దేవదేవుడు జీవులకిచ్చే జీవశక్తి ఎంత ఘనమైనదో ఆలోచించండి. ఆశ్చర్యం కలుగక మానదు.
ఎందుకంటే జీవుడు వెంట్రుక కంటే చాలా సూక్ష్మమైనవాడు. ఈ మాట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినా అది వాస్తవమని, వేదం జీవుణ్ణి గురించి అవ్యసః=సర్వత్ర వ్యాపించలేనివాడు; బాలాదేకమణీయస్కమ్=కేశం కంటె చాలా సూక్ష్మమైనవాడు అని వర్ణించింది. అయినా ఆ జీవుని శక్తిమాత్రమపారం. ఎలాగంటె, ఉన్నచోటనే ఉండి కోట్ల మైళ్ల దూరంలో ఉండే గ్రహాలను, గ్రహగతులను, నక్షత్ర మండలాలను చూడగల్గుతున్నాడు. ఇంట్లో కూర్చుండి అమెరికాలో జరిగే గానకచేరిని వినగలుగుతున్నాడు. మరి జీవుని అంటే మనిషి శక్తి అద్భుతమే కదా. ఈ శక్తి అంతా నిజంగా జీవుడిదేనా? కాదు. అది భగవంతుని శక్తియే అని వేదం ఎలుగెత్తి చెబుతుంది. ఆయనే జీవులకావిధమైన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. జీవుల కావిధమైన శక్తిగల ఇంద్రియాలను సర్వేశ్వరుడు అనుగ్రహించకుంటే మానవులేమి సాధించగలరు?
జీవులకు జ్ఞానమంతా ఇంద్రియాల ద్వారా మాత్రమే సమకూరుతూ ఉంది. అసలింద్రియాలే లేకుంటె ఇక జీవులకస్తిత్వమే ఉండదు. కాబట్టి ఇంద్రియాలకు సర్వశక్తులను నిరంతరం ప్రసాదించి జీవుల ఘనతను ప్రకాశింపజేసే భగవానుని మహత్వమెంతని శ్లాఘించగలం? *