స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-128

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతరుల సహాయ సహకారాలను అపేక్షించనివాడనని భగవచ్ఛక్తి సామర్థ్యాలను వివరించింది.
కాని దీనికి ప్రమాణమేది? అన్న వితండవాదం చేసేవారికి సమాధానంగా ‘చక్రుషే భూమిం ప్రతిమానమోజసః’ ‘‘పరమాత్మ ఈ భూమిని తన శక్తిసామర్థ్యాలకు ప్రతి రూపంగా నిర్మించాడు’’అని తార్కాణాన్ని చూపింది. ఇది ఒక్క వాక్యంలో ఉన్నా ఎంతో విశే్లషాత్మకమైన గంభీర విషయగర్భిత వాక్యం.
సాధారణంగా ఒక సన్న సూదిని చూచి దానిని తయారుచేసిన వానిని ఎంతో ప్రశంసిస్తాం. కాని దానికవసరమైన లోహాన్ని సృష్టించి ఇచ్చిన వానిని మరచిపోతాం. అలాగే ఒక కాలువను చూచి దానిని త్రవ్విన వానిని కూడ ఎంతో పొగుడుతాము.
కాని ‘అహన్నహిమన్వప స్తతర్ద’ (ఋ. 1-32-1) మేఘాలను మధించి నీటిని అపారంగా వర్షింపచేసిన వాడిని మాత్రం మరచిపోతాం. ఇట్టి అల్పమైన వస్తువులను చూచియే వాని నిర్మాణంలోని బుద్ధిచాతుర్యాన్ని ఎంతో మెచ్చుకొంటాం గాని సర్వధన సమృద్ధమైనది (వసుంధర) సమస్త్భారాన్ని వహిస్తున్నది మరియు మహావిశాలమైనది అయిన భూమినెవరు సృష్టించారో మాత్రం ఎవరూ దానిని గుర్తించనే గుర్తించరు. అలా గుర్తించనివారినుద్దేశించి వేదం-
‘త్వం భువః ప్రతిమానం పృథివ్యాః’ (ఋ.1-52-13) ‘‘దేవా! ఈ పృథివీ నిర్మాతవు నీవే’’అని ఘోషించింది. ఈ వేద వచనాన్ని కూడ పెడచెవిని పెట్టిన అజ్ఞానిని నిరుక్తకారుడు
‘నైష స్థాణోరపరాధో యదేనమంధో న పశ్యతి’ (నిరుక్తం 1-6-16) ‘‘ఎదురుగానున్న స్తంభాన్ని అంధుడు చూడలేకపోతే అది స్తంభం తప్పుకాదు’’ కాని దానిని చూడలేని అంధుడిది మాత్రమే తప్పు.’’
పురుషాపరాధః సః (నిరుక్తం 1-6-16) అని మందలించాడు.
ఈ విధంగా సృష్టింపబడి కనుల ఎదుట కనబుతున్న భూమిని చూచి కూడ దానిని సృష్టించినవానిని గుర్తింపలేకుంటే అది సృష్టికర్త దోషమా? ఆ విశ్వాత్మకుడు ‘అపః స్వః పరిభూరేష్యా దివమ్’ జలం, ప్రకాశం మరియు ఆకాశంలో అంతట వ్యాపించియున్నవాడు.
ప్రస్తుత మంత్రానికి తరువాతగల మంత్రం కూడ ‘విశ్వామా ప్రా అంతరిక్షం మహిత్వా’ (ఋ.1-52-13) ‘‘విశ్వమూ మరియు సమస్త అంతరిక్షమంతటా విశే్వశ్వరుడు తన మహిమచేత పరివ్యాప్తమై యున్నాడని పునరుద్ఘాటించింది. ఋగ్వేదమింతటితో సంతృప్తిచెందలేదు.
‘సత్యమద్ధా నకిరన్యస్త్వావాన్’ (ఋ.1-52-13) ‘‘నిజంగా నీవంటి దైవం మరొకడు లేనే లేడు’’అని దైవ ఏకైకత్వాన్ని శ్లాఘించింది. ఎవడు సాటిలేనివాడో అతడు స్వకీయతేజస్సుతో ప్రకాశిస్తాడు. ఆత్మరక్షణకై ఆయనకు ఇతరుల అపేక్ష (సహాయం) అవసరమే లేదు.
**
వనాలలో భగవదేకాంతసేవ
స ఇద్వనే నమస్యుభిర్వచస్యతే చారు జనేషు ప్రబ్రువాణ ఇంద్రియమ్‌
వృషా ఛందుర్భవతి హర్యతో వృషా క్షేమేణ ధేనాం మఘవా యదిన్వతి॥
ఋ.1-55-4॥
భావం:- భక్తునిచే ఆరాధింపబడిన దైవం ఆ భక్తుడికి క్షేమకరుడై సుఖప్రదాయకుడై సంరక్షకుడనని వాగ్దానంచేస్తాడు. ఆ దైవమే జనులలో భగవచ్ఛక్తిని లేదా ప్రేమను ప్రబోధిస్తూ తనకు ప్రణమిల్లే భక్తుల ద్వారా ఏకాంత వన ప్రదేశాలలో ప్రబోధించేందుకు సుముఖుడై యుంటాడు. తనను ప్రార్థించే భక్తులకు సుఖప్రదాతగా, సంరక్షకుడిగా వాగ్దానం చేస్తాడు.
వివరణ:- భక్తజనులు ఏకాంత ప్రదేశాలలోనే భగవత్సేవ లేదా ధ్యానం చేసేందుకిష్టపడతారు. ఉపదేశంచేసినా ఆ ఏకాంతంలోనే చేయాలని భావిస్తారు.
దీనికి కారణమేమంటే ‘చారుజనేషు ప్రబ్రువాణ ఇంద్రియమ్’ ఏకాంతంలోనే ప్రేమ పూర్వకమైన భగవత్ సందేశం హృదయానికి వినిపిస్తుంది. జనసమ్మర్ధంలో మనోవృత్తులు బహిర్ముఖమై హృదయగతమైన భగవంతుని అంతర్వాణి చెవిన సోకదు. అందుచేతనే భక్తజనులు ‘స ఇద్వనే సమస్యుభిర్వచస్యతే’ ఏకాంత ప్రదేశాలైన వనాలలోనే కూడి పరస్పరం ధ్యాన-చర్చాదులు చేసికొనేందు కిష్టపడతారు. మరియు భగవత్ప్రేమమయమైన సమాన మనోవృత్తిగల వారితో మాత్రమే వారు మిత్ర సంభాషణ ప్రాప్తిని కోరుకొంటారు. ఇట్టి సందర్భంలో మహర్షి గౌతముడు-
జ్ఞానగ్రహణాభ్యాస స్తద్విద్యైశ్చ సహ సంవాదః (న్యాయదర్శనం- 4-2-47)
ఆధ్యాత్మ విద్యాగ్రహణమూ, అభ్యాసమూ అన్నీ ఆధ్యాత్మికవేత్తలతో కూడి చర్చించడం చేతనే వృద్ధిపొందుతుంది అని హితవుచెప్పాడు. నిజమేకదా. అజ్ఞానులతో చర్చిస్తే ఏమిలాభం? ఎవరు నిజంగా పరమాత్మను కోరుకొంటారో వారికి ఆయన ‘వృషా ఛందుర్భవతి హర్యతః’ సుఖాలను వర్షించి సంరక్షకుడై యుంటాడు.
గౌతముడు చెప్పిన ఈ మాట. ‘మాత్వాయతో జరితుః కామమూనరుూః’ (ఋ.1-53-3)
‘సత్య పరాక్రముడు తన భక్తజనుల కోరికలను అసంపూర్ణంగా చేయడు’ అన్న ఋగ్వేద వచనానికి వాక్యాంతరమే. బ్రహ్మజ్ఞుడైన పరమాత్మ భక్తుల కేకాంతంలో జ్ఞానోపదేశం చేయడమేకాదు. ‘క్షేమేణ ధేనాం మఘవా యదిన్వతి’ క్షేమంతోబాటు రక్షకుడిగా కూడ వాగ్దానంచేస్తాడు. అంటే ఆ భక్తుని యోగక్షేమాల భారాన్ని కూడ తానే వహిస్తాడన్నమాట.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు