స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-145

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలు, టెలిగ్రాము, ఓడ, విమానం, ఫోను, విద్యుద్దీపాలు, నూనె, నెయ్యి తయారుచేయడం, అన్నం వండటం, బెల్లం, పంచదార, ఫలహారాలు, బంగారు ఆభరణాలు, కారు, పెట్రోలు, కిరసనాయిలు, ఇత్తడి, రాగి, పాత్రలు, లోహాలతో ఉపకరణాలు శస్త్ర, అస్తల్రు, వివిధ లోహాల భస్మాలు, సిమెంటు, సిమెంటు ఉపకరణాలు ఇలా ఎన్నని లెక్కపెట్టాలి? ఇవన్ని మనిషియే సృష్టించాడు. కాబట్టి మనిషిని చిన్నో- పెద్దో ఒక బ్రహ్మగా అంగీకరించడంలో తప్పేమీలేదు.
ఈ వస్తువులన్నింటిని మనిషి తనకోసం, తనలాంటి సాటి మనుషుల సుఖం కోసం నిర్మించాడు. అందుకే ఈ వేద మంత్రం ‘వృషాహి అసి’ ‘‘ఓ మనిషీ! నీవు నిజంగా సుఖాలను వర్షించేవాడవు’’ అని ప్రస్తుతించింది. అసలు మనిషి స్వభావమే తనకుతాను సుఖించడం మరియు ఇతరులకు సుఖం కలిగించడం. ఈ స్వభావం చేతనే మనిషి ఎన్నో సుఖసాధనాలను నిర్మించి అందరకు సుఖాన్ని కలిగించాడు. అలాకాక మనిషి స్వార్థపరుడై కేవలం తన జీవిత సాధనయే లక్ష్యంగా చేసుకొంటే లోకంలో ఎంతో భయంకరమైన సంఘర్షణ తలెత్తేది. మనిషి ఎప్పుడైతే ఇతరుల సుఖాలను గూడ విచారిస్తాడో అప్పుడే అతడి ససాయకారులైన పరివారజనమెంతో వృద్ధిచెంది వెంట నడుస్తుంది. దానితో ఆతడుగూడ సర్వసమృద్ధుడవుతాడు. లక్ష్యసిద్ధిని చేకూర్చే సాధనాలను సమీకరించుకోవడం మనిషి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటె ఆ విధంగా చేయాలని, ‘రాధసే జజ్ఞిషే’’ ‘‘కార్యసిద్ధి పొందేందుకే నీవు జన్మించావు’’ అని మనిషిని వేదమెన్నో వేల ఏండ్ల క్రిందటనే ఉత్సాహపరచింది.
అసలు నరత్వం సిద్ధించింది కూడ ప్రపంచానికి అవసరమైన సుఖసామగ్రిని ఉత్పత్తి చేసి దాని ద్వారా అభివృద్ధి పొందేందుకే. మానవులమైన మనమంతా మన పూర్వీకుల బుద్ధివైభవాన్ని, వృత్తి కౌశలాన్ని గ్రహించి ఎన్నో విధాలుగా ప్రయోజనాలను పొందియున్నాం. సాపేక్షకంగా పూర్వులకంటే మనం భావితరంలకోసం ఎంతో సంపదను కూడబెట్టి వారికీయడంలోనే మన జీవన సాఫల్యత ఇమిడి యుంది. పశుసమూహాలలో సామాజిక జీవన ఛాయలలో ఎంతో కొంత ఉంటుంది. కాని ఒకరి సుఖదుఃఖాలలో మరొకరు పాలుపంచుకోవడం, తమ సంతానానికి తాము కూడబెట్టిన సుఖసామగ్రిని దాచిపెట్టి వారికి శుభ్రంగా ఈయడమనేది మానవ సమాజంలో కనబడే ఏ సహజ లక్షణాలున్నాయో అవి ఆ పశుసమూహాలలో కనబడవు.
మానవుడు జన్మసాఫల్యసిద్ధికోసమే జన్మించాడు. కాని అసాఫల్యంకోసం కాదు అని వేదం దృఢవిశ్వాసంతో ‘అజైష్మాద్య’ (అథర్వవేదం 16-6-1) నేడే మన విజయం అని అథర్వణవేదం దృఢంగా చెప్పింది. ఔను నిజమే. విజయంకోసం రేపటివరకు ఎందుకు నిరీక్షించాలి? మరి రేపన్నదెలా ఉంటుందో కదా! ఐతే నేడే విజయం సిద్ధాంచాలంటె బలమెంతో అవసరం. అది ‘వృష్టి తే శవః’ ‘‘ప్రబలంగానూ ఉఖప్రదాయకంగానూ ఉండాలి’’ అని వేదం సూచించింది. ఎందుకంటె ఆ బలం ‘స్వక్షత్రమ్’ తప్పిదాలను సరిదిద్దుకొనే రీతిలో ఉండాలి. అప్పుడే అది వృష్టి సుఖదాయకం కాగలదు. అలా కావాలంటే మానవుడా! నీ మన్సు ‘్ధృషత్’ ప్రౌఢమూ మరియు ‘సత్రాహం పౌంస్యమ్’ సదాచరణయందు వీరత్వ సమన్వితమై ఉండాలని హెచ్చరించింది.
ఈ చివరి వాక్యంలో మానవుని జీవసామర్థ్యం చెప్పబడింది. దీని నెన్నడు విస్మరించరాదు. సత్య స్వరూపమైన ఆత్మ నిజంగా సత్యహీనమైతే, అప్పడది తన స్వస్వరూపానే్న కోల్పోతుంది. ఆ విధంగా నా ఆత్మ సత్యస్థితి నుండి పతనమైతే ఆత్మకు పాప స్పర్శ ఏర్పడుతుంది. దానివలన ఆత్మకు ఆత్మికమైన మృత్యువు కలుగుతుంది. దానివలన ఏ లక్ష్యసాధనకోసం ఆత్మ రుూ లోకంలోనికి వచ్చిందో అది సిద్ధించక వంచితవౌతుంది.
***
సమస్త వేద విజ్ఞానమూ మానవుల కొఱకే
అస్మా ఇత్‌కావ్యం వచ ఉక్థమింద్రాయ శంస్కమ్‌
తస్మా ఉ బ్రహ్మవాహసే గిరో వర్థంత్రత్యయో గిరః శుంభంత్యత్రయః॥
ఋ.5-395॥
భావం:- వేదం ఒక గొప్ప సుందరకావ్యం. అది కేవలం జీవుని కొఱకు మాత్రమే దైవం సృష్టించింది. జ్ఞాన స్వరూపుడు, వేదవేత్త, బ్రహ్మనిష్ఠుడు అయిన జీవుని కోసమే మిథ్య, పరుష అసంబద్ధాలనే త్రిదోష రహితంగా వేద వచనాలు వర్థిల్లుతున్నాయి. అంతేగాక ఆ వేదమే అతడికి ఇహలోక సంబంధమైన అన్న- వస్త్రాది భోగ- భాగ్యాలను ప్రదానం చేస్తూ శుభదాయకమవుతున్నది.
వివరణ:- ‘కవిర్మనీషీ’ (య.వే.40-8) అన్న శుక్లయజుర్వేద వచనానుసారం భగవంతుడే కవి. ఆయన సుందరంగా నిర్మించిన కావ్యమే వేదం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు