స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-149

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పృథివి కంటె జలమయమైన సాగరం చాలా విశాలమైనది. దానిలో ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి. కాని అది ఉప్పొంగక స్థిరంగా ఉంటుంది. ఇట్టి సముద్రాన్ని దృష్టాంతంగా తీసుకొన్న మనిషి ‘న రిష్యతి సవనమ్’ చేసే యజ్ఞం లేదా పురుషార్థం నిష్ఫలం కాదు. అతడి కన్ని విషయాల్లో వృద్ధియే ప్రాప్తిస్తుంది. ఏ విధమైన హాని కూడ ఉండనే ఉండదు. అయితే ఇది ఎవరికి సిద్ధిస్తుంది? అంటే ‘యత్ర మతిర్విద్యతే పూత బంధనీ’ ఎవని బుద్ధి పవిత్రమైయుంటుందో వానికి మాత్రమే. తాత్పర్యమేమంటే- ప్రతి మనిషి తాను చేసే పని విఫలం కాకూడదు. సఫలమే కావాలి అని ఆశిస్తాడు. కాని సత్ఫలితాలు ఊరికే సిద్ధిస్తాయా? తదనుగుణంగా ముందు తన బుద్ధిని పవిత్రంగా చేసుకొన్నప్పుడు మాత్రమే సిద్ధిస్తాయి. అపవిత్రమైన బుద్ధితో ఉంటే సిద్ధించిన ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి. కారణం అట్టి మనస్సు చాల చంచలమై యుంటుంది. ఏది ఏ విషం మీద కూడ స్థిరంగా ఉండదు. బుద్ధి పరిశుద్ధమూ పవిత్రమూ అయ్యేది కేవలం జ్ఞానం చేతనే ‘బుద్ధిః జ్ఞానేన శుద్ధ్యతి’ (మను.5-109) అని మనువు చక్కని ఉపాయాన్ని సూచించాడు. గీతా శాస్త్రం కూడా (4-38)న ‘హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ ‘‘జ్ఞానం కంటె లోకంలో పవిత్రమైన వస్తువు లేదు’’అని మనువు సూచననే సమర్ధించింది.
కాబట్టి జ్ఞానార్జనే లక్ష్యంగా గల మనిషి దానికెన్ని సాధనాలున్నాయో వాని నన్నింటిని అనుసరించి జ్ఞానార్జనాపరుడు కావాలి. ఆ సాధనలలో వేద- శాస్త్రాలు ప్రధానమైనవి. బుద్ధిని పవిత్రపరచుకొనగోరిన మనిషి తత్సాధనమైన జ్ఞానభండాగారమైన వేద శాస్త్రాలను సదా అధ్యయనం చేయవలసి యుంది. ఎవడు జ్ఞానం చేత పరిశుద్ధమైన నిర్మలబుద్ధితో కార్యక్షేత్రం లోనికి అడుగిడతాడో ‘అత్రా న హార్ది క్రవణస్య రేజే’ అట్టి క్రియాశీలుని హృదయంలో భావాలు సుస్థిరమై యుంటాయి. ఆ విధంగా సుస్థిరం కాని వాని హృదయంలోని భావాలు చాల దుర్బలంగా ఉంటాయి. వానివలన ఆరంభింపబడిన కార్యాలు మధ్యలోనే సమాప్తమైపోతాయి. కాని జ్ఞానం చేత పవిత్రమైన బుద్ధి సంపన్నతగల కార్యసాధకుడు కార్యసాధకమైన - కార్యబాధకమైన విషయాలేవో ముందే గ్రహించగలిగి కార్యసిద్ధిని పొందుతాడు. పరలోకపరమైన ఈ కార్యసిద్ధి మాట అటుంచం భౌతిక సుఖ జీవన సిద్ధికోసం చేసే కార్యసాఫల్య విషయంలోనైనా మనిషి బుద్ధి జ్ఞానం చేత పరిశుద్ధమైన పవిత్రతను పొందవలసి యుంది. కాబట్టి బుద్ధిని పవిత్రంగా సిద్ధపరచుకోమన్న ఈ వేద సందేశాన్ని మానవులారా! మరువకండి.
***
శరీర ధర్మ శాస్త్రం
ఇదం వపుర్నివచనం జనాసశ్చరంతి యన్నద్యస్తస్థురావః
ద్వే యదీ బిభృతో మాతురనే్య ఇహేహ జాతే యమ్యా సబంధూ॥
ఋ.5047-5॥
భావం:- సమస్తమైన జలాశయాలలోని నీరు నదులలోనే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జనులు ప్రశంసనీయమైన శరీరంలో (ఆత్మను ధరించి) సంచరిస్తున్నారు. ప్రకృతి మాత నుండి పుట్టిన భిన్న స్వభావం కలిగిన జంట లెనె్నన్నో పుట్టి ఈ శరీరాన్ని దృఢంగా ధరిస్తున్నాయి.
వివరణ:- సమస్త జలాలకు నది ఉప లక్షణం. నీరు సమస్త నదులలో ఉన్నట్లుగా ఆత్మలు సకల శరీరాలలో ఉండి సంచరిస్తున్నవి. అందుచేత శరీరం చాల ప్రశస్తమైనది. విశేషించి మానవ శరీరం అన్నింటికంటె చాల ప్రశంసనీయమైనది. వేదాలలో ఈ శరీరం రథం, కలశం, అపరాజిత, నగరి, అయోధ్య, దేవపురి, బ్రహ్మపురి, నౌక మొదలైన వివిధ నామాలతో ప్రస్తావించబడింది. ఐతరేయ బ్రాహ్మణంలో ఈ శరీర మహిమను గురించి ఒక అందమైన గాథ కనబడుతుంది. అదేమంటే- ఆత్మకు ముందు గోవు మున్నగు వివిధ జంతువుల శరీరాలు తీసుకొని రాబడ్డాయి. ఆత్మ వానిలో దేనిని ఇష్టపడలేదు. తదుపరి మానవ శరీరం తీసుకొని రాబడింది. అప్పుడాత్మ ప్రసన్నమైన ‘సుకృతం బత ఇతి’. ఇది చాలా ప్రశస్తమైనది అని ప్రశంసించింది. మనిషి శరీరమా ప్రశస్తికి తగినదే. మరియు అది అద్భుతమైనదే. ఎందుకంటె సర్వేంద్రియాలు సమస్థానాలలో, సమాన సౌష్ఠవ వంతమై, సుందరమై, సుకుమారమై ఉంటాయి. అన్నింటినిమించి లక్షలాది జీవరాశుల శరీరాలలోలేని విశేషమైన ప్రత్యేకమైన వాగింద్రయముంది. దానివలన ఏ జీవి సృష్టిలో తన మనోభావాలను ప్రకటింపజాలని శక్తికలిగి మానవుడు సకల జీవులకంటె సర్వోన్నతుడైనాడు. అంతేకాక సకల జీవులు ‘వ్యక్తవాక్కులు’ కాగా మానవుడు మాత్రం ‘వ్యాక్తవాక్కుగా’ ఘనత వహించాడు.
ఈ శరీరంలో ప్రకృతి మాతకు ముద్దుబిడ్డలైన వారిద్దరు నివాసముంటున్నారు. వారొకే తల్లి బిడ్డలైనా స్వభావంచేత భిన్న భిన్నమైనవారు. వారే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మొదటివాడు బయటగల జ్ఞానాన్ని శరీరంలోనికి చేరవేస్తాడు. రెండవవాడు లోపలున్న భావాలను బయటకు ప్రకటిస్తాడు. వీరిద్దరూ ఒకే ప్రకృతి సంతానమై జంటగా ఉండే బంధువులు. శరీరంలోనికి ఆత్మ ప్రవేశించినంతనే శరీరంలో ప్రకృతిమాత ఈ ఇద్దరిని సృష్టిస్తుంది. తల్లి గర్భంనుండి మనిషి బయటపడినంతనే ఈ జ్ఞాన-కర్మేంద్రియాలు రెండూ అతనిలో సిద్ధమై యుంటాయి. అందుకే వేద మీమంత్రంలో ఈ జంటను ‘యమ్యా’అని ప్రస్తావించింది.
ఇదే రీతిగా ప్రాణం-అపానం అన్నవి వాయుమాత సంతానమై జంటగా ఈ దేహంలో ఉంటాయి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు