స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-186

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచేత ‘శ్రుధీ హవం విపిపానస్య’ (ఋ.7-22-4) ‘‘అత్యంత దాహార్తుని (నీ నామామృతపాన దాహార్తుని) హృదయవేదనారావాన్ని విను.’’ నీవు వినకుంటె ఓ జనార్ధనా! ఇంకెవరు వింటారు?
నీవు విను, వినకపో. నేను మాత్రం ‘సదా తే నామ స్వయశో వినక్మి’ అనుపమానమైన కీర్తిశాలివగు నీ నామానే్న స్మరిస్తూ నినే్న పిలుస్తూ ఉంటాను.’’
**
175. దేశ కల్యాణానికి కలిసి భగవదారాధన చేయండి
సహస్రం సాకమర్చత పరి ష్ట్భోత వింశతిః
శతైన మన్వనోనవురింద్రాయ బ్రహ్మోద్యతమర్చన్నను స్వరాజ్యమ్‌॥
భావం:- వేలకొలది కలిసి ఒకే కంఠంతో భగవదారాధన చేయండి. ఇరువది మంది కూడి నలువైపుల వినబడేలా భగవన్నుతిని గానం చేయండి. బ్రహ్మచర్యయుక్తులై స్వదేశ కల్యాణానికి వందలకొలది సంపదలకోసం ఆ దైవాన్ని నమస్కరించి ప్రార్థించండి.
వివరణ:- భగవదారాధన రెండు విధాలు. 1.వైయక్తికం 2.సామూహికం. సాధారణంగా పూజ లేదా ధ్యానం ఏకాంత ప్రదేశంలో చేయవలసియుంది. మనస్సులోని సమస్త చింతనలను పారద్రోలి ఉదయం సూర్యారాధన చేయడం, ఆ తరువాత నిష్కపటంగా స్వీయదోషాలను- బలహీనతలను దైవానికి విన్నవించుకోవడం, వానిని తొలగించుకొనే ఆత్మబలాన్ని ఈయమని ప్రార్థించడం, తదుపరి ధ్యాన, సమాధి, ఈశ్వర ప్రణిధానాదులను సశాస్ర్తియంగా ఆచరించడం మొదలయిన విధానాలన్ని వైయక్తిక దైవారాధన కోవలోనికి వస్తాయి. ఈ ఆరాధన వలన వ్యక్తి వ్యక్తిగతంగా సంస్కారవంతుడవుతాడు. దానివలన మనస్సు, ఆత్మ పరిశుద్ధమవుతాయి.
ఈ రీతిగా వైయక్తిక ఆరాధనారీతి ద్వారా వ్యక్తి వైయక్తికంగా ఉద్ధరణ పొందిన రీతిగా వ్యక్తుల సంఘాత స్వరూపమైన సమాజమంతకు ఉద్ధరణ- సంస్కారం సిద్ధించేందుకు సామూహిక పూజ కూడ ఉంటే అవసరం. ఈ సామూహిక భగవదారాధన ద్వారా సమాజంలో సమతా-సమైక్యతా వైభవం పరిఢవిల్లుతుంది. దానితోబాటు సమాజంలోని విభిన్న మనస్తత్వాలుగల మనుషుల మధ్య ఏకమనస్కత- ఏకసదాలోచనలనే సర్వోత్కృష్ట్భావాలు వెల్లివిరుస్తాయి. తద్వారా సమాజం సంఘటిత శక్తివంతమై పురోభివృద్ధిని సాధిస్తుంది.
వైయక్తికారాధనలో ప్రతి వ్యక్తి శారీరక, మానసిక శుచిత్వాన్ని పాటించే రీతిగా సామూహిక ప్రార్థనకు కూడ ముఖ్యమని వేదం బ్రహ్మోద్యతమ్= బ్రహ్మచర్యయుక్తులు కావాలని సూచించింది. అంతేకాదు. ఈ సామూహిక దైవారాధనా లక్ష్యం వైయక్తికంగాకాక అర్చన్నను స్వరాజ్యమ్= స్వదేశానికి తగినట్టి కల్యాణ వైభవం సిద్ధించేదిగా మనుషులు సంకల్పించాలని వేదం స్పష్టంగా శాసించింది. వందలు-వేలమంది కలిసివచ్చి ముక్తకంఠంతో విన్నవిస్తే ఆ విన్నపాన్ని ప్రభుత్వం విధిగా మన్నిస్తూ ఉంది. ఇది అందరకు అనుభవంలోనిదే. అదే విధంగా జగత్ప్రభువును అందరు ప్రార్థిస్తే వారి ప్రార్థనను మన్నింపకుంటాడా? ఈ మార్మికతనే వేదం ‘సహస్రం సాక మర్చత’= ‘‘వేలమంది కలిసి ప్రార్థించండి’’అని మంత్రారంభంలోనే సంకేతించింది. అంటే సంఘటన శక్తికెంతటి బలముందో వేదమెప్పుడో మానవాళికి ప్రబోధించిందన్నమాట.
176. ఓ ఐశ్వర్యవంతుడా! హింస చేయకు
మా స్రేధత సోమినో దక్షతా మహే కృణుధ్వం రాయ ఆతుజే
తరణిరిజ్జయతి క్షేతి పుష్యతి న దేవాసః కవత్నవే॥
భావం:- ఓ ఐశ్వర్యవంతులారా! జీవితంలో మీరు హింసకు పాల్పడకండి. నిరంతరం ఉత్సాహవంతులై యుండండి. జీవితంలో సర్వవిధాలుగా శక్తిమంతులు కావడానికి మరియు ధనాన్ని సంపాదించేందుకు నిరంతరం ప్రయత్నపరులుకండి. పరులను హింసించక సంరక్షణ చేసేవాడే జీవితంలో వృద్ధిపొందుతాడు. చిరకాలం జీవించి సర్వసమృద్ధులతో తులతూగుతాడు. దైవీశక్తులు హింసాపరుల ఎడల సుముఖంగా ఉండవు.
వివరణ:- దుర్మార్గులకు- అత్యాచారాలకు మృత్యుదండన విధించి శిక్షించమని వేదం రాజును శాసిస్తూనే మా స్రేధత= ‘‘హింస చేయవద్దు’’ అని ప్రధానంగా అహింసనే ప్రబోధించింది. మరి ఆ అహింస ఘనత ఏమిటో వివరంగా మంత్రంలో విస్తరించి చెప్పింది. అందులో మొదటి అంశం ‘తరణిరిజ్జయతి’= ‘‘రక్షకుడైనవాడే అభివృద్ధి పొందుతాడు’’అన్నది. మనిషి విజయాన్ని పొందేందుకు సాధారణంగా హింసే చేస్తాడు. యుద్ధాలు చేస్తాడు. కాని దానివలన ఏ కాలంలోనూ ఎవరికి శాశ్వత విజయం సిద్ధించనే లేదు. వారి చరిత్ర చరిత్రపుటలలో రక్తపు మరకలతో మసకబారిపోయింది. కాని ఎవరు అహింసనే బోధిస్తూ జీవులను రక్షించారో వారినే తరతరాలుగా సమాజం ప్రాతఃస్మరణీయులుగా ఆరాధించింది.
వారి చరిత్రను చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించుకొని తరతరాలకు ఆదర్శచరితులుగా అందించింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు