స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-203

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

‘నహి త్వదారే నిమిషశ్చనేషే’ ‘‘కట్టబడిన త్రాటిని విప్పి బాలుణ్ణి రక్షించినట్లుగా నన్ను పాప వాసనా రజ్జువునుండి విడివడ చేయుము’’ ఎందుకంటే- ‘నహి త్వదారే నిమిషశ్చనేషే’ ‘‘కను రెప్పపాటు కాలం కూడ నీకు దూరంగా ఉండలేను’’ అందుచేత ఓ తండ్రీ! పాపవాసనా విముక్తుణ్ణి చేసి నీ చెంతనుంచుకో.’’
**
ఓ వరుణదేవా! నీకు నమస్కారం
నమః పురా తే వరుణోత నూనముతాపరం తువిజాత బ్రవామ
త్వే హి కం పర్వతే న శ్రీతాన్యప్రచ్యుతాని దూళభ వ్రతాని॥
భావం:- ఓ వరుణదేవా! ఇంతకు ముందు, నమస్కరించాం. ఇప్పుడూ నమస్కరిస్తున్నాం. ఇకముందు కాలంలోకూడ నమస్కరించగలం. పర్వతంలా స్థిరంగా ఉండే శాశ్వతమైన నియమాలు సులభంగా నినే్న ఆశ్రయించియున్నాయి.
వివరణ:- ఓ వరుణదేవా! ఇంతకుముందు నమస్కరించాం. ఇప్పుడూ నమస్కరిస్తున్నా. ఇకముందు కాలంలో కూడ నమస్కరించగలం అంటూ స్తుతిరూపంగా భగవంతుని ముందు ఒక సాధకుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. భగవంతుడికి మనమే ద్రవ్యాన్ని ఏ వస్తువును ఈయగలం?’’ ఎందుకంటే ఆయనకు అట్టి ఆవశ్యకతయే లేదు. ఉన్నదేదో ఇద్దామనుకొన్నా ఆయనకు ఈయతగిన వస్తువు గాని, ద్రవ్యంగాని ఏది ఉంది? కాబట్టి ఆయనకు మనం సమర్పింపగలిగింది ఒక్క నమస్కారం తప్ప మనవద్ద ఏముంది? ఈ కారణాల వలననే వేదంలో నమస్కార ప్రాధాన్యాన్ని తెలిపే సందర్భాలెన్నో కనబడతాయి.
‘్భయిష్ఠాంతే నమ ఉక్తిం విధేయ’॥ శు.య.వే.
మేము పలుమారులు నీకు నమస్కారం- నమస్కారం అని పలుకుతాం.
‘హువే దేవం సవితారం నమోభిః’॥
నమస్కారాల ద్వారా సృష్టికర్తను పిలుస్తున్నాను.
అస్మై బహూనామవమాయ సఖ్యే యజ్ఞైర్విధేమ నమసా హవిర్భిః
సం సాను మర్జ్మి దిధిషామి బిల్మైర్ద్ధామ్యన్నైః పరి వంద ఋగ్భిః॥
‘‘సృష్టిలోని సమస్తజీవులను సంరక్షించే మిత్రుని నమస్కారాలతో, హవిస్సులతో ఆరాధిస్తాము. నేను శిఖర స్వరూపుడవైన నిన్ను పరిశుద్ధుని చేస్తాను. వేయి వెలుగులతో నిన్ను అలంకరిస్తాను. అన్నాది పదార్థముల సమర్పణ చేత ఆనందమయునిగా ఉంచుతాను. వేద మంత్రోచ్ఛారణ ద్వారా సంపూర్ణంగా నీకు వందన సమర్పిస్తాను’’ నమ సోప సద్యః భగవంతుడు నమస్కారం చేతనే లభిస్తాడు.
సమస్త జీవులను ఆ విశ్వాత్మునివలె సమానంగా చూడగలవాడు మరొకడు మరెవడున్నాడు? అట్టివానిని పొందేందుకు తలవంచి నమస్కారం చేయడం కంటె వేరే ఉపాయమేముంది? నమస్కారం చేయడమంటే కేవలం చేతులు జోడించి భగవానుని ఎదుట కూర్చోవడంకాదు. తన ప్రవర్తనను, వ్యవహారాలను తప్పక సంస్కరించుకోవాలి. కేవలం మన నమస్కారాలకు లొంగిపోయి భగవంతుడు తన స్థిరమైన నియమాలను సడలించుకోడు అని వేదం కరాఖండిగా ఇలా చెప్పింది-
త్వేహి కం పర్వతే న శ్రీతాన్యప్రచ్యుతాని దూళభ వ్రతాని
‘‘ఓ దుర్లభుడవైన ప్రభూ! పర్వతంవలె స్థిరంగా ఉండే నియమాలు, ధర్మాలు అనాయాసంగా నీలో ఉన్నాయి’’అని చెప్పింది. ఆ నియమాల సడలని స్వభావాన్ని తెలిపేందుకు ఉపమానంగా పర్వత శబ్దాన్ని ప్రయోగించింది. ఈ ఒక్క మంత్రంలోనేగాక చాలాచోట్ల పరమాత్ముని అచంచల నియమబద్ధతను ఋగ్వేదం వర్ణించింది.
అదబ్ధాని వరణుస్య వ్రతాని
వరుణరూపుడైన పరమాత్మ నియమాలు, ధర్మాలు అచంచలమైనవి. అందుచేత కేవలం నమస్కారాల చేత దైవం ప్రసన్నంకాదు. ప్రవర్తనను, ఆచార వ్యవహారాలను ఎవరికివారు సంస్కరించుకోవాలి. నమస్కారం చేయడంలోని పరమార్థం జనార్థనుని శాసనాలు, నియమాలు, ధర్మాలు సుస్థిరమైనవి. అవి ఎవరికోసమూ కూడ సడలింపబడవు అని గ్రహించడమే. ఆ విధంగా విశ్వసించి నమస్కార పూర్వకంగా ఆత్మ సమర్పణ చేసినవాని ఎడల మాత్రమే లోకనాథుడు ప్రసన్నుడవుతాడు.
**
విష్ణువు పరమపదంలో
అమృత స్రోతస్సు ఉంది.
తదస్య ప్రియమభి పాథో అశ్యాం నరో యత్ర దేవయవో మదంతి
ఉరుక్రమస్య స హి బంధురిత్థా విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సః॥
భావం:- భగవంతునియందు సదా అనురక్తుడయిన మానవుడు (్భక్తుడు) దేనిని భుజించి ఆనందమనుభవిస్తున్నాడో ప్రీతికరమైన ఆ అన్నాన్ని (అమృతాన్ని) నేనుకూడ భుజిస్తాను. విశ్వనిర్మాణదక్షుడైన భగవంతునకు అతడే ప్రియమైన బంధువగుచున్నాడు. సర్వోత్కృష్టమైన విష్ణు పదంలో (ఆకాశంలో) అమృతమయమైన ప్రవాహముంది.
వివరణ:- భగవంతుని యందు అనురక్తులైనవారు (్భక్తులు) నిత్యమూ పొందుతూ ఉండే ఆనందానుభూతిని చూచిన ఆస్తికుడు దానిని వారెలా పొందుతున్నారు? నేను కూడ ఆ ఆనందానుభూతిని ఎందుకు పొందలేను? వారేమి తిని దానిని పొందగలిగారు?
ఇంకావుంది...