స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-204

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను కూడ దానిని తినవచ్చుగదా అని ఒక ఆస్తికుడు ‘తదస్య ప్రియమభి పాథో అశ్వాం నరో యత్ర దేవ యవో మదంతి’ ‘‘దేనిని భుజించి భగవదనురక్తులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు? వారు తినే అన్నాన్ని నేను కూడ తిననా’’అని ప్రకటించిన చిత్రమైన ఆకాంక్షతో ఈ మంత్రమారంభమైనది. ఆ అన్నమేదో ఆ అన్నప్రదాత ఎవడో ఈ మంత్రంలో వివరించబడుతూ ఉంది.
ఆ సర్వరక్షకుడయిన భగవానుడే సర్వశ్రేష్ఠమైన అన్నాన్ని, అది లభించే ప్రియమైన స్థానాన్ని సంరక్షిస్తాడని, అందుండి ముక్తిరూపమైన అమృతాన్ని అనుగ్రహిస్తాడని ‘విష్ణుర్గోపాః పరమం పాతి పాథః ప్రియా ధామాన్యమృతా దధానః’ అని ఋగ్వేదం ఆస్తికునిపై ప్రశ్నలకు సమాధానంగా వివరించి దీనిని తెలిసికొన్న జ్ఞానులు సచేతసో అభ్యర్చంత్యత్ర ‘‘ఆ అమృతంకొఱకు పరమాత్మను ఆరాధిస్తారు’’అని ఆస్తికుల స్వభావాన్ని ప్రకటించింది.
ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయమేమంటే- పరమ ప్రియాతి ప్రియమైన ఆ అన్నాన్ని సంరక్షించేది కూడ పరమాత్మయే. ఈ విధమైన ఎఱుక గలిగి దైవాన్ని ఆరాధించిన ఆ జ్ఞానులు ఉరుక్రమస్య స హి బంధురిత్థా ‘‘ఆయనకు ఆత్మబంధువులే కాగలరు.’’ వారావిధంగా కావడం కూడ పరమాత్మకు చాల సంతోషమే. ఎందుకంటే తనను విశ్వసించి ఆరాధించేవారికి అమృతవర్షం కురిపించేందుకు ఆయన నివసించే ‘విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సః’ ‘‘విష్ణుపదంలో (ఆకాశంలో) అమృతమయమైన స్రోతస్సు ఉంది. ఈ కారణం చేతనే
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతమ్‌॥
జ్ఞానులు విష్ణువు పరమపదాన్ని ఆకాశమంతట వ్యాపించిన ప్రకాశ రూపంగా దర్శిస్తారు. అలా దర్శించినవారు-
తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే విష్ణోర్యత్పరమం పదమ్‌॥
స్తోత్ర నిపుణులు, జాగరూకులు, సావధానులు, బుద్ధిమంతులు, విద్వాంసులు అయినవారు ఆ విష్ణువును తన హృదయాలలో ప్రకాశింపచేసుకొంటారు’’అంటే సర్వాత్మకుడైన విష్ణుజ్ఞానాన్ని ముందుగా పొంది ఆయనను హృదయంలో నింపుకొంటారని తాత్పర్యం. కాని ఆ జ్ఞానులవలె విష్ణుపదాన్ని దర్శించి హృదయంలో నిలుపుకోదలచినవారు ‘‘ఓ ప్రభూ! నీ పరమపదాన్ని మాకు దర్శింపచేయి. మాపై మోక్షామృతాన్ని వర్షించు’’మని సదా ప్రార్థన చేయాలి.
**
ఈ రహస్యం నీకే తెలుసు
పరో మాత్రయా తన్వా వృధాన న తే మహిత్వమన్వశ్నువంతి
ఉభే తే విద్మ రజసీ పృథివ్యా విష్ణో దేవ త్వం పరమస్య విత్సే॥
భావం:- సమస్తంకంటె బృహత్తమమైన ఓ పరమేశా! నీవు పరిమాణం చేత, విస్తారంచేత అపారమైన వాడవు. ద్యావాపృథివీ లోకాలు రెండూ కూడ నీ మహత్వాన్ని తెలుసుకోలేవు. కాని ఆ రహస్యమేమిటో నీవే తెలిసిన వాడవు.
వివరణ:- సర్వాధారుడైన పరమేశ్వరుని మహత్వమూ, విస్తారమూ ఎవరికి తెలుసు? సమస్త విశ్వమూ ఆయనముందు నిస్సారమే. సృష్టిలో ఎంత గొప్ప పెద్ద వస్తువైనా చిన్న వస్తువయినా వానికొక పరిమాణం మరియు ప్రమాణం, కొలతలు, బరువు ఉంటాయి. కాని విశ్వాకారుడైన ఆ జగత్ప్రభువునకు ‘పరో మాత్రయా తన్వా’ ‘‘పరిమాణమూ, విస్తారమూ లేవు. వానికి ఆయన అతీతుడు.’’ అందుచేతనే ఓ జగదాధారా! ‘న తే మహిత్వమన్వశ్నువంతి’ నీ మహత్త్వం, మహిమను ఎవరునూ ఎరుగజాలరు’’ అని కీర్తించింది. అయినా తృప్తిచెందని ఋగ్వేదం ఆ సిద్ధ సంకల్పుని మహత్వాన్ని-
న తే విష్ణో జాయమానో న జాతో దేవ మహిమ్నః పరమంతమాప ‘‘ఓ సర్వేశ్వర! ముందు పుట్టినవాడుగాని, ప్రస్తుతం పుట్టియున్నవాడు గాని మరియు ఇకముందు కాలంలో పుట్టబోయేవాడు గాని నీ మహత్వానికి అంతాన్ని కనుగొనలేడు అది ఎప్పటికి అగమ్యగోచరమే’’నని తీర్మానించింది. పరిమితమైన మానవ బుద్ధికి ఆదిదేవుని మహత్వం అందుకోలేకపోయినా విశాలమైన అంతరిక్ష- జ్యోతిర్లోకాలు సహితం తమలో ఆయన మహత్వాన్ని ఇముడ్చుకోజాలవు. కాని-
వ్యస్త్భ్నా రోదసీ విష్ణవేతే దాధర్థ పృథవీముభితో మయూభైః
‘‘నీ వా అంతరిక్ష- జ్యోతిర్లోకాలను నివాసంగా చేసుకొని పృథివిని నీవు నీ వెలుగులతో నింపివేసావు’’. అట్టి ముల్లోకాలలో వ్యాపించియున్న నీవు అన్నింటికంటే మహత్వంకలవాడవని వేరుగా నిరూపించాలా? అలా అన్నింటిని వహించి, వ్యాపించి, నివాసంగాచేసుకొన్న నీవే ‘త్వం పరమస్య విత్సే’ ‘‘నీ పరమ మహత్వ రహస్యాన్ని నీవే ఎరిగినవాడవు’’అని ఋగ్వేదం పరమాత్మ అప్రమేయత్వాన్ని (కొలతకు అందనట్టిది) వర్ణించలేక శ్లాఘించి విరమించింది.
**
దేవా! నన్ను ఆస్తికునిగా చేయి
ఇంద్ర మృళ మహ్వం జీవాతు మిచ్ఛ చోదయ ధియమయసో
న ధారామ్: యత్కిం చాహం త్వాయురిదం వదామి తజ్జుషస్వ
కృధి మా దేవవంతమ్‌॥
భావం:- ఓ పరమేశ్వరా! నాకు జీవించాలనే కోరిక ఉంది. నాపై దయ చూపు. ఆయుధానికుండే పదునులా నా బుద్ధికి పదునుపెట్టి ప్రేరణ కలిగించు. నీ భక్తుడనైన నేను ఏమి పలుకుచున్నానో దానిని స్వీకరించి నన్ను ఆస్తికునిగా చేయి.
వివరణ:- ఓ పరాత్పర! ఈ సమస్త విశ్వమూ నీ కృపకు ప్రత్యక్షరూపం. ఓ కర్మ ఫలప్రదాతా! నీవు మహా దానశూరుడవు. నీ దానఘనతను ఎవరు శ్లాఘించగలరు? ‘్భద్రా ఇంద్రస్య రాతయః’ ‘‘దైవంగా మీరు చేసే దానాలు మహోన్నతమైనవి, కల్యాణ-కారకమయినవి.’’
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు