స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-205

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా మరణ శాసనంలో కూడ నీ దయయే ఇమిడి యుంటుంది. జ్ఞానప్రదాయకా! సృష్ట్యారంభంలో మానవులకు మార్గోపదేశకంగా బుద్ధినిచ్చావు. దానికి సహయోగంగా కంటికి సూర్యకాంతితో సమానమైన వేద విజ్ఞానాన్ని అందించావు. అది నాడు నేడురేపు మానవులకు కల్యాణదాయకమైయుంది. కాని జన్మమరణ చక్రభ్రమణ రూపమైన సంసారచక్రంలో నీవు ప్రదానం చేసిన మానవజన్మ స్వల్పకాలం కూడ మనలేక సుడులు తిరిగిపోతూ ఉంది. నీకు దూరంగా నాకు ఎన్నో జన్మలు నిరర్థకమైపోయాయి. నీ సేవకు వినియోగపడని జన్మ వ్యర్థమేకదా. కాని నేనిప్పుడు నీ సేవలో తరించే విధంగా ఈ జన్మలో జీవించాలనుకొంటున్నాను. ‘ప్ర నో నయ ప్రతరం వస్యో అచ్ఛ’ (ఋ.6-47-7) ‘‘సార్థకమైన దీర్ఘ జీవనాన్ని అనుగ్రహించు’’. ‘ఇంద్ర మృళమహ్యం జీవాతు మిచ్ఛ’ ‘‘ఇంద్రా! నాకు ఆ విధంగానే జీవించాలని ఉంది.’’. మృత్యువును నా నుండి దూరంగా తరిమికొట్టు. జీవించియుంటే కదా నేను నిన్ను పూజించేది. నిన్నారాధించనిదే నాకేమీ సిద్ధించదు. మహాజనులు నీవు జీవులకు అలభ్యుడవని చెబుతారు. కాని ఓ ప్రభూ! ‘్భవా సుపారో అతిపారయో నః’ (ఋ.6-47-7) ‘‘మాకు సన్నిహితుడవై మమ్ము తరింపచేయి’’ సంసార సాగర తరంగ భ్రమణంలో మా బుద్ధిశక్తిని కోల్పోయి కార్యాకార్యాలను గ్రహించలేకుంది. అందుచేత ‘చోదయ ధియం సో న ధారామ్’ ‘‘ఆయుధానికి పదును పెట్టినట్లుగా మా బుద్ధి వివేకంతో పదును అగునట్లు ప్రచోదనపరచుము.’’
ఓ మహాదేవా! ఈ ప్రపంచాన్ని చూసాను. అంతా నిస్సారమే. నీవొక్కడవే సారస్వరూపుడవు. నినే్న పొందేందుకు తగిన సద్బుద్ధినిమ్ము. యత్కించాహం త్వాయు రిదం వదామి తజ్జుషుస్వ కృధి మా దేవవంతమ్ (ఋ.1-13202) ‘‘ఓ దేవా! నేను చెప్పే మాటలను ప్రీతి పూర్వకంగా స్వీకరించు’’ఇదే నా వినతి. బుద్ధిజాడ్యంవలన కలిగే ‘ఆరే అస్మదమతిమ్’ (ఋ.3-8-2) ‘‘బుద్ధిహీనతను అనగా నాస్తికతను దూరంచేయి’’ పరమేశ్వరా! ‘ప్ర ణః పురఏతేవ పశ్య’ (ఋ.6-47-7) ‘‘ఒక అధినేత తన అనుయాయుల మీద చూపే దయవంటి దయను నీవు నాపై చూపు.’’ నీ దయను పొందేందుకు తగిన ఉపాయమేదీ నాకు తోచడం లేదు. ‘్భవా సునీతిరుత వామనీతిః’ (ఋ.6-47-7) ‘‘నీవే నాకు శ్రేష్ఠమైన, సుందరమైన నీతివి’’. నీ వెటు నడిపిస్తే అటు నడుస్తా. ‘తస్య వయం సుమతౌ యజ్ఞియస్యాపి భద్రే సౌమనసే స్యామ’ (ఋ.6-47-13) ‘‘నీ పూజనీయమైన కృపామృత సద్బుద్ధియందు కల్యాణదాయకమైన నీ సౌహార్ద్రమందు మేము నిశ్చితంగా ఉందుముగాక!’’ అందుకొఱకై ఓ ప్రభూ! ‘ఇంద్ర మృళ ధియో యో నః ప్రచోదయాత్’ (శు.య.36-3) ‘‘ఓ మహాదేవా! దయచూపు. మా బుద్ధులను ప్రచోదన చేయి.’’
**
మేము శుభదాయకమైన సన్మార్గంలో నడుస్తాం
అపి పంథామగన్మహి స్వస్తిగామనేహసమ్‌
యేన విశ్వాః పరి ద్విషో వృణక్తి విందతే వసు॥
భావం:- ఏ మార్గాన నడిస్తే మానవుడు తనలోని ద్వేషభావాలను పూర్తిగా విడిచి శుభదాయకమైన ధనాన్ని పొందుతాడో అటువంటి సుఖకారకమైన, దోషరహితమైన మార్గానే్న మేము అనుసరించి నడుస్తాం.
వివరణ:- ఓ మార్గబంధూ! సంసారారణ్యంలో ప్రవేశించి మేము సన్మార్గానే్న మరచిపోయాం. ఎటుపోవాలో ఎటుపోరాదో దిక్కు తెలియటం లేదు. మార్గాన్ని సూచించేవాడు కూడ కానరావడం లేదు. ఇక మేమెవరిని అడిగి సన్మార్గాన్ని తెలుసుకోవాలి? తిరిగి తిరిగి దిక్కుతోచక తలపగిలి చచ్చిపోతున్నాం. ఎప్పటికైనా సంసారారణ్యాన్ని దాటి రావటానికి మార్గోపదేశకుడు నీవే కావాలి. ఎప్పుడో చిట్టచివరన నీవు చేయదలచిన పనిని ఇప్పుడే ఏల చేయరాదు? మావంటి సంసార సర్పదష్టుల ఎడల నీకు కృపయే ఉంటే ఇప్పుడే-
సం పూషన్ విదుషా నయ యో అంజసానుశాసతి
య ఏవేద మితి బ్రవత్‌॥
‘‘ఇతడే భగవంతుడు అని స్పష్టంగా నిర్దేశించి చెప్పగల విద్వాంసునితో కలయిక ఏర్పడునట్లు చేయి.’’ విద్వాంసుడయినవాడే ఏ విషయాన్నైనా స్పష్టంగా అసందిగ్ధంగా బోధించగలడు. అతడి వలననే ‘అపి పంథామగన్మహి స్వస్తిగామనేహసమ్’ ‘‘సౌకర్యవంతమైనది మరియు దోష రహితమైన సన్మార్గంలో నడువగలం’’ అంతే కాదు. ‘విశ్వాః పరి ద్విషో వృణకిత విందతే వసు’॥ ‘‘మనిషి పూర్తిగా తన మనస్సులోని ద్వేషభావాలను విడిచి క్షేమకరమైన ఐశ్వర్యాన్ని ఏ మార్గంలో నడిచి పొందగలడో ఆ మార్గంలో నడువగలం.’’
నే నెవరిని ద్వేషించను. ననె్నవరు కూడ ద్వేషించరాదు. అందరితో ప్రేమపూర్వకంగా ధర్మానుసారంగా నడుచుకొంటాను. అందరు కూడ నాతో అట్లే నడుచుకోవాలి. ఓ భగవాన్! ద్వేషమనే బందిపోటు నా మనస్సులోని ప్రేమ ధనాన్ని దోచుకొంటున్నాడు. అతడిని నా హృదయ మందిరంనుండి బయటకు గెంటివేయి. అప్పుడు నా మదిలోని ప్రేమ ధనాన్ని భద్రంగా ఉంచుకోగలను. దాని ద్వారా నీకు ప్రీతిపాత్రుడను కాగలను. దానివలన ‘సర్వా ఆశా మమ మిత్రం భవంతు’ (అథర్వ.వే.19-15-6) ‘‘సమస్త దిక్కులు నాకు మిత్రులు కావాలి’’ ఎక్కడ కూడ నాకు శత్రువులు గాని, ద్వేషించేవారు గాని ఉండకూడదు. అందరకు, అందరికంటే నేను ప్రేమపాత్రుడను కావాలి. అట్లగుట ద్వారా నేను ‘తస్య తే శఱ్మన్నుపదద్యమానే రాయా మదేమ తన్వా తనా చ’ ‘‘కల్యాణదాయకుడైన నీవంటి కరుణాపూరితుడగు విద్వాంసుని సాహచర్యాన్ని పొంది ధన, ధాన్య, సంతాన సమృద్ధితో ఆనందంగా జీవిస్తాను’’ ఓ మహాదేవా! నేనెన్నడూ ఎవరివలన కూడ ‘న రిష్యేమ కదా చన’ (ఋ.6-54-9) ‘‘ఎక్కడా ఎప్పుడూ పీడింపబడకుండెదను గాక.’’
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు