స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-213

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వివరణ:- సోమరస పానం మిక్కిలి ఆనందప్రదమైనదని వేదాలు పలుచోట్ల అభివర్ణించాయి. ఆనందనాయిని అయిన సోమరసాన్ని స్తుతిస్తూ ఋగ్వేదం-
స్వాధిష్ఠయా మదిష్ఠయా పవస్వ సోమ ధారయ (ఋ.9-1-1) ‘‘ఓ సోమమా! గొప్ప రుచికరమై ఆనందాన్ని కలిగించే నీవు మమ్ములను పవిత్రం చేయి’’అని ప్రార్థించింది కూడ. అంతటితో సంతృప్తిచెందక సోమరస ప్రాధాన్యాన్ని ‘మదేషు సర్వధా అసి’(ఋ.9-18-1) ఆనంద సమయాలలో అందరిచేత సేవింపబడేదానవు నీవే’’అని ఋగ్వేదం ప్రశంసించింది. వేదాలన్ని ‘దేవోభ్యః ఉత్తమం హవిః’ ‘‘దేవతలు ప్రీతిపూర్వకంగా పానంచేసే హవిస్సు సోమమే’’అని ఋగ్వేద వచనాన్ని సమర్థించాయి. ఈ సోమరసం కేవలం ప్రీతిపాత్రమైన పానీయమే కాదు దేవతలకది జీవన హేతువుగా ‘త్వాం దేవాసో అమృతాయ కం పపుః’ (ఋ.9-106-8) ‘‘దేవతలు తమ సుఖజీవనంకోసం ప్రియంగా సోమాన్ని సేవిస్తారు’’అని ఋగ్వేదం శ్లాఘించింది. ఈ సోమరసం బలవర్ధకం కావడంవలన ‘యస్య తే పీత్వా వృషభో వృషాయతే’ (ఋ.9-108-2) ‘‘దేనిని త్రాగి ఇంద్రుడు బలశాలి అవుతున్నాడో అదే సోమరసం’’అని మరియు ఆత్మను పరిశుద్ధంచేసేది కావడం కారణంగా ‘ఇంద్రాయ పవతే సుతః’ (ఋ.9-6-7) ‘‘బాగా దంచిన సోమలతనుండి తీయబడిన సోమరసం ఇంద్రుడికి పవిత్రకారకంగా అగుచున్నది’’అని ఋగ్వేదం బహుధా సోమలతారస మహిమను వర్ణించింది. సోమలతను దంచి రసం తీయడమొక పవిత్ర కర్మ. దానిని సిద్ధంచేయడం అందరూ చేయదగినది కాదు. ‘స మృజ్యతే సుకర్మభిర్ణేవో దేవేభ్యః సుత.’ (ఋ.9-99-7) ‘‘సత్కర్మ పరాయణులైన దివ్యులు మాత్రమే దేవతల కొఱకు సోమరసం సిద్ధంచేయబడుతుంది’’అన్న ఋగ్వేద వచనానుసారం సోమరసాన్ని దివ్యులే సిద్ధంచేయవలసి యుంటుంది.
ఇంకావుంది...