స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఇట్టి ఆదిత్య స్వభావుల మార్గమెవరికి శ్రేయోదాయకంకాదు? దీనికి సమాధానం ఋగ్వేదంలో ఈవిధంగా లభిస్తూంది. ‘సుగఃపంథా అనృక్షర ఆదిత్యాస ఋతం యతే’(ఋ.1-41-4) ఓ ఆదిత్యా! ‘‘ఋతానుసారులకే సృష్టి, దైవశాసనాలు, ధర్మాలను మార్గాలన్నీ నిష్కంటకమై యుంటాయి’’, కాబట్టి మానవులారా! మీ మార్గాలు పూలమార్గాలు కావడానికి ఆదిత్యభావాలను అలవరుచుకోండి. ఋతానుసారులుకండి. ఇందుకొరకై వేదోపదేశానుసారం ‘నో దుష్పరిహంతు శర్మ’ ‘‘మమ్మా మార్గంనుండి తొలగనీయకు. నీ ఆశ్రయాన్ని మాకనుగ్రహించు’’అని దైవాన్ని సదా ప్రార్థించండి.
**
నిర్భయమైన వెలుగుబాటు లభించుగాక
న దక్షిణా వి చికితే న సవ్యా న
ప్రాచీన మాదిత్యా నోత పశ్చా
పాక్యా చిద్వసవో ధీర్యా
చిద్యుష్మానీతో అభయం జ్యోతిరశ్యామ్‌॥

భావం:- న్యాయ, స్నేహ, ఉపకార సమష్టి ధర్మస్వరూపులైన ఆదిత్యులారా! కుడి, ఎడమ, ముందు, వెనుక వైపులను వేనిని గుర్తింపజాలను. ఓ వసువులారా! నేను ధైర్యంగా మీ నుండి నిర్భయమైన వెలుగును పొందెదనుగాక!వివరణ:- ఎవరినుండియైన దేనిని గ్రహించాలన్నా ముఖ్యంగా జీవన మార్గాన్ని సుగమంచేసే జ్ఞానాన్ని జ్ఞానదాతలైన ఆదిత్యుల శరణుజొచ్చి ‘న దక్షిణా.... .... నోతపశ్చా’ ‘‘కుడి -ఎడమలు, ముందు, వెనుకలు నాకు తెలియవు’’అని జిజ్ఞాసువు అర్థించాడు.
- ఇంకాఉంది