స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవలలుగా ఒకేసారి పుట్టిన బిడ్డలు ఒకే దారుఢ్యం కలిగి యుండరు. ఇదే విధంగా ఒకే రక్తసంబంధం గల ఇద్దరు వ్యక్తులు సమానంగా దానగుణం కలిగి యుండరు. సృష్టిలో ఇటువంటి విషమత అందరకు అనుభవంలోనిదే. వీనినుండి ఓ మానవుడా! అలాంటి స్వభావాన్ని అలవరచుకోవద్దు. ఫలానా వ్యక్తి ధనవంతుడైనా దానం చేయడు. నిర్ధనుడైన నేనెందుకు చేయాలి? అని అనుకోవద్దు. నేనెందుకు చేయకూడదు? అనే ప్రశ్న వేసుకో. ఆ విధంగా నీవు బుద్ధివికాసాన్ని సాధించు. జ్ఞానవంతుడవై వర్తించు. జ్ఞానం అందరిలో ఏకరూపంగా ఉండదు. అది ఆ వ్యక్తి అలవరచుకొనే బుద్ధివికాసాన్నిబట్టి ఉంటుంది. ఈ విషయాన్ని ఋగ్వేదం ఎంత రమణీయంగా సోదాహరణంగా చెప్పిందో చూడు.
అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో మనోజవేష్వసమా బభూవుః
ఆదఘ్నాస ఉపకక్షాస ఉ త్వే హ్రదాఇవ స్నాత్వా ఉ త్వే దద్భశ్రే॥ ॥
‘‘ఓ మిత్రుడా! కళ్ళూ-చెవులూ సమానంగా కలిగిఉన్నా జ్ఞానసంపాదన చేసే ఇద్దరు వ్యక్తుల మనస్సు సమానవేగంగా స్పందించదు. జలాశయాలలో స్నానం చేసే మనుష్యులు మూడువిధాలుగా ఉంటారు. ఒకరు బాహుమూలాల వరకు, మరొకరు కంఠం వరకు, మరికొందరు శిరస్సు పూర్తిగా మునిగేవరకు జలంలో నిలిచి స్నానమాచరిస్తారు. జ్ఞాన సరస్సులో మునిగే జనుల తీరు ఇదే విధంగా ఉంటుంది.’’
అంటే అల్పులైనవారి జ్ఞానం అపరిపక్వమై విషయ పరిజ్ఞానశక్తి చాలక సృష్టిలోని సమానత్వభావనను గాక అసమానత్వభావననే ప్రమాణంగా గ్రహిస్తారు. జ్ఞాన సరస్సులో పూర్తిగా మునిగినవారు అసమానత్వ భావనను వీడి సమానత్వ భావననే గ్రహిస్తారని పై వేదమంత్రోపదేశ సారాంశం.
మనిషికిట్టి అల్పజ్ఞత ఎలా సంక్రమిస్తుంది? అంటే ఆతడి పూర్వ-వర్తమాన కర్మానుగుణంగా మాత్రమే. తదనుగుణంగా మనిషిలో సత్ప్రవృత్తి దుప్రవృత్తులు కలుగుతాయి. ఫలితంగా సృష్టిలోగల పదార్థాలలోగల సమానత్వ- అసమానత్వాల వెనుకగల తాత్త్వికత బోధపడక అసమానభావనలకే ఆకర్షితుడై తిరిగి దుష్కర్మలనే చేస్తూ ఉంటాడు.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు