స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే పూర్వజన్మల సుకృతఫలం ఏ లవలేశమో ఉంటే సత్కర్ముల సాంగత్యభాగ్యం లభించి పాపకర్మ విముక్తులై సుజ్ఞానవంతులు కాగలరు. కాబట్టి సంసార విషవృక్షానికి పండే సజ్జన సాంగత్య ఫలాన్ని ఆస్వాదించండి. సుజ్ఞానులు కండి.
**
కలిసి నడవండి. కలిసి పలకండి
సం గచ్ఛ్ధ్వం సం వదధ్వం సం వో మనాంసి జానతామ్‌
దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే॥ ఋ.10-191-2॥
భావం:- పూర్వులైన పరిపూర్ణ విద్వాంసులు సంపూర్ణంగా తెలిసినవారైనా మోక్షప్రదాతయగు భగవంతుని ఏ రీతిగా కలిసి ఉపాసిస్తున్నారో అదే రీతిగా మీరందరు కలసిమెలసి నడవండి. మీరందరు ఒకేమాట పలకండి. మీ మనస్సులు జ్ఞానుల మనస్సులు సమానమగుగాక. ‘ఓ దేవాధిదేవా! మాకు ధనాన్ని ప్రదానం చేయి’అని ఋగ్వేదంలో ఒక ప్రార్థన ఉంది. (ఋ.10-191-1) ఆ ప్రార్థనకు సమాధానంగా ధనసాధనోపాయాలను భగవంతుడు మూడు మంత్రాలలో ఉపదేశించాడు. వానిలో ఈ మంత్రం రెండవది.
సంగచ్ఛ్ధ్వమ్:- ‘‘మీరంతా కలిసిమెలసి ఒకే రీతిగా నడవండి’’అని ఈ వాక్యానికర్థం. ఇలాకాక ఎవరిత్రోవన వారు పోతే కార్యసిద్ధి సంభవం కాదు. కానప్పుడు ధనమెలా సిద్ధిస్తుంది? ధనమంటే కేవలం డబ్బు అని అనుకొంటారు. అది సరికాదు. జీవిత సౌఖ్యప్రదాయకమైన వైభోగమే ధనం. అది వ్యక్తికి గాని సమాజానికి గాని కలసిమెలసి అంతా నడిచినప్పుడే సిద్ధిస్తుందని దైవ సందేశం.
సంవదధ్వమ్:- ‘‘మీరందరూ ఒకేమాట పలకండి’’అని దీని అర్థం. సామాజికంగా గాని, వ్యక్తిగతంగా గాని లక్ష్యాన్ని సాధించాలంటే ఈ దైవశాసనాన్ని శిరసావహించడం విధ్యుక్త ధర్మం. అంటే వైయక్తికంగా క్షణానికో మాట మాటలాడవద్దని, సామాజికపరంగా అందరి మాట ఒకటియై ఉండాలని దైవశాసనంలోని అంతరార్థం. అలాకాక విరుద్ధంగా ప్రవర్తిస్తే అది అంతఃకలహాలకు దారితీసి లక్ష్యసిద్ధిని భగ్నం చేస్తుంది. ఫలితంగా అలక్ష్మికి ద్వారాలు తెరువబడతాయి. అందుకే ఐశ్వర్యసిద్ధికి సాధనంగా దైవమీ శాసనాన్ని చేసింది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512