స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
అంగుష్ఠమాత్రో రవితుల్యరూపః సంకల్పాహంకార సమన్వితో యః
బుద్ధేర్గుణేనాత్మగుణేన చైవ ఆరాగ్రమాత్రో హ్యపరో - పి దృష్టః
పరమాత్మ కేవలం జ్ఞానం వలననే తెలియబడతాడు. ఆయన సూర్యుని వలె మహా తేజస్వి, ముల్లుగర్రకున్న ముల్లు వలె చాలా సూక్ష్మమైనవాడు. ఈతడే జీవాత్మకు గల బుద్ధికి సహజమైన పరిమితి (పరిచ్ఛిన్నత) జ్ఞానం చేత అంగుష్ఠమాత్రుడగా నిలిచియుంటాడు.
‘అపరో- పి దృష్టః’- వాస్తవానికి జీవుడు అపరుడు. పరమాత్మ పరుడు. బుద్ధియొక్క గుణ స్వభావాలు ఆత్మజ్ఞానాన్ని జనింపజేస్తాయి. సుఖ, దుఃఖ, జ్ఞాన, ప్రయత్న, ఇచ్ఛ, ద్వేషములు ఆత్మ ఉన్నదని అనుమాన ప్రమాణం చేత నిరూపిస్తాయి. ఈ ప్రమాణం చేత ఆత్మను తెలిసికొని సాధన చేసినవాడు ఆత్మను ప్రత్యక్షం చేసికొనగలుగుతాడు.
ఈ సందర్భంగా అదే ఉపనిషత్తు అపరమైన జీవాత్మ ఎంత సూక్ష్మతమైనదో వివరిస్తూ-

బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ
భాగో జీవః స విజ్యేః స చానంత్యాయ కల్పతే
ఆత్మ వెంట్రుక యొక్క నూరవ భాగంలో నూరవ భాగమంత ప్రమాణంలో ఉంటుంది. ఉపమాన పూర్వకంగా వర్ణించినా అది అనంతతత్వాన్ని పొంది అనంత శక్తివంతంగా విరాజల్లుతుందని పేర్కొంది. ఈ అంశానే్న దయానంద సరస్వతి ఇలా అన్నారు.
‘‘జీవుడు ఒక పరమాణువులో కూడా సులభంగా ఇమిడిపోగల సూక్ష్మమైనవాడు. కాని ఆ జీవులలోని శక్తులు- మరియు ప్రాణాలు తీగలలోని విద్యుత్తులా గొప్ప చైతన్యవంతమై యుంటాయి.
శే్వతాశ్వతరము మరియు దయానందుడు ఈ మార్మికాంశాలను యోగవిద్య ద్వారా తెలుసుకున్నారు. అథర్వవేదం కూడా జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని స్వభావాన్ని యిలా వర్ణించింది.
బాలాదేక మణీయస్క ముతైకం నేవ దృశ్యతే
తతః పరిష్వ జీయసీ దేవతా సా మమప్రియా
భావం:జీవాత్మకేశం కంటె చాలా సూక్ష్మమైనది. ప్రకృతి మాత్రం కనబడేదే కాదు. ఈ రెండింటికంటె అత్యంత సూక్ష్మమూ సర్వవ్యాపకమూ అయినది పరమాత్మ. అతడు మాత్రమే నాకు ప్రియుడు. అంటే పరమాత్మ జీవుని కంటె అత్యంత సూక్ష్మమైనవాడు.
జీవునియందు వ్యాపించి యున్నవాడు ఆయనే. అలా ఉన్నా జీవునితో మమేకం కాకుండా సంగరహితుడై ఉంటాడు పరమాత్మ. అందుకే జీవుడు పరమాత్మను ప్రేమించి ఆరాధించాలి. జీవితంలో శుభాన్ని కోరుకొనేవాడు ప్రకృతి యెడల గల ప్రేమభావాన్ని వీడి పరమాత్మ ప్రేమలో నిమగ్నం కావాలి. ఈ పని ఎంత కఠిమో అంత సులభం కూడా. ఆత్మ పరమాత్మలను గూర్చి సత్యమైన జ్ఞానం కలిగినపుడే పరమాత్మ ఎడల కలిగే ప్రేమలో సిద్ధి ఏర్పడుతుంది. అంటే జ్ఞానం కలుగకుండా కర్మ చేయడం సంభవం కాదు. అందుకే శాస్త్రాలలో కర్మకంటే జ్ఞానం ముందు చెప్పబడింది.
పై అధర్వణ మంత్రంలోని రెండవ వాక్యం మరో గంభీరమైన విషయాన్ని సంకేతిస్తున్నది. జ్ఞానం యొక్క ప్రధాన ప్రయోజనం దాన్ని అనుష్టానమే. జ్ఞానం క్రియారూపంగా పరిణతి పొందకుంటే లేదా కర్మ నిర్వహణలో జ్ఞానం సహాయకారి కాకుంటే అది జ్ఞానమే కాదు.
అది కేవలం జ్ఞానాభాసమే. దీనిని బట్టి వేదం కర్మవాదానికి ప్రేరకమే గాని కర్మ త్యాగానికి మాత్రం కాదు అన్నది సుస్పష్టం. ఏకదేశమైన శరీర పంజరంలో వుండే జీవాత్మ కర్మ చేయకుండా క్షణం కూడా జీవింపలేడు. అతడు తనకు నలువైపులా గల పదార్థాలను గురించి తెలుసుకోవాలని కోరుకొంటాడు.
*