స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
తన వైపు చకచక అడుగులు వేసుకొంటూ వచ్చే బిడ్డకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్న భయంతో ఎదురుగా వచ్చే తల్లి తన ఒడిలోనికి తీసుకొని ఎలా ముద్దాడుతుందో అలా తనవైపు అడుగులు వేసుకొంటూ వచ్చే సాధకుడిని కూడా జగన్మాత లేక జగత్పిత చేతులు చాచి తన దగ్గరకు చేర్చుకొని సర్వవిధాలా అనుగ్రహిస్తాడు.

జీవాత్మ పరిమితం - పరిచ్ఛిన్నం

అవ్యసశ్చ వ్యచసశ్చ బిలం వి ష్యామి మాయాయా
తాభ్యాముద్ధృత్వ వేదమథ కర్మాణి కృణ్మహే

భావం: పరిమితమైన జీవాత్మ మరియు అపరిమితమూ, అప్రమేయమూ అయిన పరమాత్మ మధ్యగల భేదాన్ని మరియు రహస్యాన్ని మా బుద్ధి వైభవంతో తెలిసికొంటాము. ఇకనుండి జీవాత్మ- పరమాత్మలను గూర్చి చెప్పబడిన వేద వచనాలను మాత్రమే గ్రహించి సత్కర్మలనాచరిస్తాము.
వివరణ: జీవాత్మ - పరమాత్మల మధ్యగల సంబంధ విషయంలో ఆధ్యాత్మిక రంగంలో చాలా వివాదముంది. కొందరు అసలు వీని అస్తిత్వానే్న అంగీకరించరు. మరికొందరు అంగీకరించినా వారెవరూ ఏకాభిప్రాయం కలిగిలేరు. ఇక పరమాత్మ సప్తలోకాలపైన ఉన్నాడని కొందరు, మరికొందరు చతుర్భువనాలపైన ఉన్నాడని; ఇంకకొందరు క్షీరసాగరంలో ఉన్నాడని, ఇక్కడ కాక ఏదో తెలియరాని లోకాలలో ఉన్నాడని చెప్పి ఆయనను అంతట వ్యాపించి యుండని, కేవలమొకే ఒక ప్రదేశంలో ఉండే పరిచ్ఛిన్నుడైన సాకారవ్యక్తిగా మార్చివేశారు. ఆ విధంగా ఒక ప్రదేశంలో వుండే (ఏకదేశి) ఆ పరమాత్మ అల్పజ్ఞుడు మరియు అల్పసామర్థ్యం కలవాడు మాత్రమే కాగలడు. అట్టివాడు ఈ విశాల బ్రహ్మాండాలను సృష్టించి పోషించి సంహారం చేసే మహత్కార్యాలను నిర్వహించగలడా? ఈ రీతిగా పరమాత్మ అప్రమేయ సామర్థ్యాన్ని శంకింపజేసే దోషాన్ని నివారించేందుకు వేదాలు పరమాత్మను సర్వవ్యాపి అని జీవాత్మను ‘అవ్యాపకు’డని వ్యాఖ్యానించాయి. పరిపూర్ణంగా ఈ జీవాత్మ పరమాత్మల భేదాన్ని- రహస్యాన్ని కేవలం బుద్ధిబలం చేత మాత్రమే గ్రహించాలని బిలం విష్యమి మాయాయా అని వేదం హెచ్చరిస్తూంది.
లోకంలో సాధారణంగా ప్రత్యక్ష వస్తువుల విషయంలోనే ఎన్నో వివాదాలుంటాయి. ఇక పరోక్ష వస్తువుల విషయాన్ని గూర్చి చెప్పే పనేముంది? కాబట్టి వస్తువు దేనికి చెందినదయినా దయతో భగవంతుడిచ్చిన సూక్ష్మబుద్ధితో వాటిని పరిశీలించి సత్య వస్తు జ్ఞానాన్ని పొందాలి. ఈ దృష్టితోనే ఉపనిషత్ ఋషి...
హృదా మనీషా మనసా - భిక్లృప్తో య ఏతద్విదుమృతాస్తే భవంతి హృదయం, బుద్ధి మరియు మనస్సులకు మాత్రమే పరమాత్మ జ్ఞానం అనుభూతమవుతుంది. ఆ విధంగా జ్ఞానం పొందినవాడు అమృతత్వ స్థితిని చేరుకొంటాడు అని శే్వతాశ్వతరోపనిషత్తులో స్పష్టం చేశాడు.
ఆ విధంగా తన సూక్ష్మ బుద్ధి చేత అవినాశి, అమరమూ అయిన పరమాత్మ జ్ఞానం పొందినవాడికి మృత్యుభయమెక్కడుంటుంది? అయితే అట్టి ఆత్మానుభవం మనస్సు, బుద్ధి, హృదయాల సమరస సహకార భావం చేతనే సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన జ్ఞానం నిత్యస్మరణ (మననం) మరియు దృఢనిశ్చయం చేత బలవత్తరమవుతుంది. అలా ధారణ చేయకుంటే సూక్ష్మాతి సూక్ష్మ సంకల్ప వికల్పాలకు నిలయమైన హృదయంలో కుతర్క భావనలు ప్రవేశించి చివరకు ఆ వ్యక్తిని మరల నాస్తికత్వమనే గోతులలోనికి త్రోసివేస్తాయి.
..........................ఇంకావుంది