స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యా తే అగ్నే పర్వతస్యేవ ధారా సశ్చంతీ పీపయద్దేవ చిత్రా
తామస్మభ్యం ప్రమతిం జాతవేదో వసో రాస్వ సుసమతిం విశ్వజన్యామ్‌॥
ఋ.3-57-6.
ప్రతిపదార్థం:- అగ్నే!= జ్ఞానప్రకాశం చేత అందరిని ప్రకాశింప చేయువాడా! అందరను అగ్రభాగాన నడిపించేవాడా!; దేవ= జ్యోతిస్వరూపుడవైన ఓ ప్రభూ!; పర్వతస్య+ఇవ= పర్వతంపై నుండి క్రిందికి వేగంగా ప్రవహించే జలధారతో సమానంగా; అసశ్చంతీ = ఎక్కడను నిలువక; చిత్రా= అద్భుతంగా ఉప్పొంగుతూ ప్రవహించే; ధారా= వేదమయ జ్ఞానధారను; అస్మభ్యమ్= మా పై; పీపయత్ = వర్షించుము; వసో= అందరను జీవింపచేసేవాడా!; జాతవేద!= సర్వజీవులలో వ్యాపించి యున్నవాడా! ప్రతి ఒక్క పదార్థంలో జనించేవాడా! సర్వజ్ఞుడా!; = అస్మభ్యమ్= మాకు; తామ్= అటువంటి; ప్రమతిమ్= ఉత్తమ జ్ఞానప్రదాతయైన; విశ్వజన్యామ్= సర్వజన శ్రేయోదాయకమైన; సుమతిమ్= వేద విజ్ఞానాన్ని గ్రహించే సద్బుద్ధిని; రాస్వ= ప్రసాదించుము.
భావం:- ఓ అగ్నీ! ఎక్కడా నిలువక పర్వతంపైనుండి క్రిందికి వేగంగా దుముకుతూ ప్రవహించే మహాజలప్రవాహం వలె అద్భుతంగా ఉప్పొంగుతూ ప్రవహించే వేదమయజ్ఞాన జలధారను మాపై వర్షించు. ఓ వసో! ఉత్తమ జ్ఞానప్రదాయిని- సమస్త జన శ్రేయస్కారిణి అయిన వేద విజ్ఞాన జిజ్ఞాస సద్బుద్ధిగా మాకు ప్రసాదించు.
వివరణ:- వేదం సృష్ట్యారంభం నుండి సమస్త మానవ సమాజ శ్రేయస్సు కొఱకై భగవంతుడు నిరంతరంగా ప్రవహింపచేసిన మహా జలధార. కొండపై నుండి క్రిందికి దుమికే జలధార నిరాఘాటంగా నలువైపుల ఎలా ప్రవహిస్తుందో అలా వేదమయమైన దివ్యజ్ఞానధార సమస్త దేశ జనుల అభ్యుదయానికై సన్నిహితంగా నిరాటంకంగా ప్రవహిస్తూ వస్తూంది.
మానవ సమాజమంతకూ దీనిపై సంపూర్ణ్ధాకారముంది. అందుకే ఈ మంత్రం ఈ వేద విజ్ఞానాన్ని ‘విశ్వజన్యామ్’ సర్వజన హితకారిణి అని పేర్కొంది. కొందరు విమతీయులు ఈ వేద ధారను ఆటంకపరచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆపబడిన జలం నిలువ వుండి దుర్వాసన పుట్టినట్లుగా ఈ జ్ఞానధార నాటంకపరిస్తే మానవ సమాజానికి చేటు కలుగుతుంది. నేటి భారతదేశం దీనికి నిదర్శనం. వేదం సర్వమానవాభ్యుదయం కోసమే ప్రభవించిందని వేదంలో అనేక సందర్భాలలో నొక్కి చెప్పబడింది. ఎందుకంటె వేద విజ్ఞానాన్ని అపార్థం చేసుకొనేవారిని పలుమార్లు హెచ్చరించేందుకే. ఈ క్రింది వేద మంత్రాలను గమనించండి.
‘పంచజనా మమ హోత్రం జుషధ్వమ్’ మానవ సమాజంలోని పంచవిధ జనులు నా వేద వాక్కును గ్రహించండి.
యథే మాం వాచం కల్యాణీ మావదాని జనేధ్యః
బ్రహ్మరాజన్యాభ్యా శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ చ॥
శుక్ల యజు.26-2॥
నేను కల్యాణదాయకమైన వేదవాణిని మానవజాతి కొఱకై వినిపించాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర చతుర్విధ వర్ణాలు మరియు వారి స్ర్తిలు- సేవకులు మరియు ఉత్తమ లక్షణాలతో కూడిన అంత్యజుల కొఱకు నేను వేదోపదేశం చేసాను.
ఒక్క వేదమే భగవంతుడు ఏ ఒక్కరికో మాత్రమే సృజించాడా? చంద్రుడు, సూర్యుడు, నీరు, గాలి, భూమి, ఆకాశం మొదలయినవి సృష్టించింది అందరి కొఱకు కాదా? ఇలా అన్నింటిని సృష్టించిన సృష్టికర్త తాను వినిపించిన వేద విజ్ఞానం మాత్రం అందరి కొఱకు కాదా? అలా కాకుంటే ఒక్క బ్రాహ్మణులకే గాక తక్కినవారందరకు జ్ఞానాన్ని విని గ్రహించగల చెవుల నెందుకిచ్చాడు? బుద్ధినెందుకిచ్చాడు? వేదం విశ్వచనీనమైంది. కల్యాణకారకమైన ఆ వేదవాణి సర్వజనహితానే్న కాంక్షిస్తుంది. వేదవాణి సర్వోత్తమ జ్ఞానఖని. సుబుద్ధిదాయిని. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు